Andhra Pradesh Geography PDF In Telugu: Download Andhra Pradesh Geography Study Material PDF in Telugu for APPSC Group-1, Group-2, Group-3, Group-4, and Andhra Pradesh Police exams. Download the chapter-wise PDF for Andhra Pradesh Geography Study Material. For More Free Study material for APPSC exams Do bookmark this page for the latest updates.
Andhra Pradesh Geography PDF In Telugu | ఆంధ్ర ప్రదేశ్ భూగోళశాస్త్రం స్టడీ మెటీరియల్ PDF ఆంధ్ర ప్రదేశ్ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు APPSC గ్రూప్స్ మరియు ఇతర పోటీ పరీక్షలకు భౌగోళిక శాస్త్రం చాలా ముఖ్యమైన మరియు స్కోరింగ్ సబ్జెక్టు. Andhra Pradesh Geography (ఆంధ్ర ప్రదేశ్ భూగోళశాస్త్రం) కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను PDF రూపంలో ఇక్కడ అందించాము.
APPSC/TSPSC Sure shot Selection Group
Andhra Pradesh Geography PDF In Telugu (ఆంధ్ర ప్రదేశ్ భూగోళశాస్త్రం PDF తెలుగులో)
APPSC గ్రూప్స్, పోలీస్ ,రెవెన్యూ , వంటి అన్ని పరీక్షలలో అడిగే ప్రశ్నల సరళిని అనుసరించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సమగ్రమైన సిలబస్ తో కూడిన సమాచారం ఈ క్రింద ఇవ్వడం జరిగింది.
- ఆంధ్ర ప్రదేశ్- భూగోళ శాస్త్రం
- ఆంధ్ర ప్రదేశ్- నైసర్గిక స్వరూపం
- ఆంధ్ర ప్రదేశ్- శీతోష్టన స్థితి
- ఆంధ్ర ప్రదేశ్- అడవులు జంతు జాలం
- ఆంధ్ర ప్రదేశ్- నేలలు-స్వభావం
- ఆంధ్ర ప్రదేశ్- నదీ వ్యవస్థ
- ఆంధ్ర ప్రదేశ్- నీటి పారుదల
- ఆంధ్ర ప్రదేశ్- ఖనిజ సంపద
- ఆంధ్ర ప్రదేశ్- వ్యవసాయం
- ఆంధ్ర ప్రదేశ్- పారిశ్రామిక రంగం
- ఆంధ్ర ప్రదేశ్- రవాణా
ఆంధ్రప్రదేశ్ – భూగోళశాస్త్రం
పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా 1953, అక్టోబరు 1న మద్రాసు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను, రాయలసీమ దత్త జిల్లాలను కలిపి కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించింది
చారిత్రక నేపథ్యం:
ఆంధ్ర అనే శబ్దం మొదటగా ఐతరేయ బ్రాహ్మణంలో కనిపిస్తుంది. ఇందులోని శునశ్శేపుని వృత్తాంతంలో దక్షిణాపథంలో “ఆంద్ర “ జాతి ప్రజలు ఉంటారని చెప్పబడింది.
ఆంధ్ర ప్రాంతాన్ని ఆంధ్ర దేశమని, త్రిలింగ దేశమని, ఆంధ్రాపథం, ‘ఆంధ్రావని’, ‘ఆంధ్రా విషయ’ అని వివిధ పేర్లతో సంబోధించేవారు. బౌద్ధ సాహిత్యంలో “అందరట్ట” గా ఆంధ్ర ప్రాంతాన్ని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ విభజన:
తెలంగాణా ప్రాంతంలో అనేక ఉద్యమాలు, సంఘర్షణల తర్వాత 2013, డిసెంబరు 3న ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదించింది.
- 29వ రాష్ట్ర హోదాలో 2014, జూన్ 2 నుంచి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించగా మిగిలిన ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌గా కొనసాగుతోంది.
ఉనికి: ఆంధ్రప్రదేశ్ భారత దేశానికి ఆగ్నేయ భాగంలో బంగాళాఖాతానికి ఆనుకుని ఉంది.
విస్తరణ: వైశాల్యం పరంగా భారతదేశంలో 8వ పెద్ద రాష్ట్రం.
- 1,60,205 చ.కి.మీ. విస్తీర్ణంతో మొత్తం దేశ భూభాగంలో 4.86% భూభాగాన్ని ఆంధ్రప్రదేశ్ ఆక్రమించింది.
- ఆంధ్రప్రదేశ్ నుంచి వేరుపడిన తెలంగాణ వైశాల్యంలో 12వ స్థానంలో ఉంది.
ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు
- తూర్పు – బంగాళాఖాతం
- దక్షిణం – తమిళనాడు
- ఉత్తరం – ఒడిశా, చత్తీస్‌గఢ్, తెలంగాణ
- పడమర – కర్ణాటక
ఇతర రాష్ట్రాలతో సరిహద్దు జిల్లాలు
- ఒడిశా: శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, విశాఖపట్నం
- తెలంగాణ: తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం
- కర్ణాటక: కర్నూలు, అనంతపురం, చిత్తూరు
- తమిళనాడు: చిత్తూరు, నెల్లూరు
- చత్తీస్‌గఢ్: తూర్పు గోదావరి
- తెలంగాణ రాష్ట్రం విడిపోవడం వల్ల మహారాష్ట్రతో సరిహద్దును ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది.
- కడప జిల్లాను మినహాయించి ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన అన్ని జిల్లాలకు ఇతర రాష్ట్రాలతో సరిహద్దులు ఉన్నాయి.
- ఏ రాష్ట్రంతో సరిహద్దులు లేని కడప జిల్లాను భూపరివేష్టిత జిల్లాగా పేర్కొంటారు.
భౌతిక, సాంఘిక, ఆర్థిక స్థితి దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌ను రెండు ప్రాంతాలుగా విభజించవచ్చు. అవి
1.కోస్తా ప్రాంతం 2. రాయలసీమ ప్రాంతం
కోస్తా ప్రాంతం:
ఈ ప్రాంతంలో 9 జిల్లాలు ఉన్నాయి.
- శ్రీకాకుళం
- విజయనగరం
- విశాఖపట్టణం
- తూర్పు గోదావరి
- పశ్చిమ గోదావరి
- కృష్ణా
- గుంటూరు
- ప్రకాశం
- నెల్లూరు
- కోస్తా ఆంధ్ర ప్రాంతం వైశాల్యం 92,900 చ.కి.మీ. ఈ ప్రాంతంలో నాగావళి, వంశధార, గోదావరి, కృష్ణా, పెన్నా నదులు ఏర్పరచిన సారవంతమైన డెబ్టామైదానాలున్నాయి. రాష్ట్రంలో పండుతున్నఆహార, వాణిజ్య పంటలు అత్యధికంగా ఈ ప్రాంతంలోనే పండుతున్నాయి. అందుకే కోస్తా ఆంధ్ర
ప్రాంతాన్ని దక్షిణ భారత దేశ ధాన్యాగారం (గ్రానరి ఆఫ్ ది సౌత్ ఇండియా)గా పిలుస్తారు.
- ఈ ప్రాంతం వాణిజ్య, రవాణా, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో రాయలసీమ ప్రాంతం కంటే అభివృద్ధి చెందింది.
రాయలసీమ ప్రాంతం:
రాయలసీమలో 4 జిల్లాలు ఉన్నాయి. అవి:
1. చిత్తూరు
2. కడప
3. అనంతపురం
4. కర్నూలు
- రాయలసీమ వైశాల్యం 67,400 చఃకి.మీ.
- పూర్వం నుంచి కరవు కాటకాలకు ప్రసిద్ది చెందింది. జనసాంద్రత కూడా అల్పమే.
- శిలామయమైన నిస్సార మృత్తికలు, నిలకడలేని వర్షపాతం ఈ ప్రాంతంలో కనిపిస్తాయి.
- ఆంధ్రప్రదేశ్ 972 కి.మీ. (605 మైళ్ల)తో తూర్పు తీరంలో పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం.
- పొడవైన తీర రేఖ కలిగిన జిల్లా – శ్రీకాకుళం
- అత్యల్ప తీర రేఖ కలిగిన జిల్లా – పశ్చిమ గోదావరి
జనాభా:
జనాభా లెక్కల ప్రకారం, 4.95 కోట్ల జనాభాతో దేశంలో 10వ స్టానాన్ని ఆక్రమించి, దేశ జనాభాలో 4.10 శాతాన్ని కలిగి ఉంది
- జనాభాపరంగా అతి పెద్ద జిల్లా – తూర్పు గోదావరి
- అతి తక్కువ జనాభా ఉన్న జిల్లా – విజయనగరం
- ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్డ్ కులాలు 17.08%, షెడ్యూల్డ్ తెగలు 5.53% గా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ అధికారిక చిహ్నాలు
రాష్ట్ర అధికారిక ముద్ర | పూర్ణకుంభం |
రాష్ట్ర అధికారిక భాష(లు) | తెలుగు, ఉర్దూ |
రాష్ట్ర గీతం | మా తెలుగు తల్లికి మల్లెపూదండ |
రాష్ట్ర జంతువు | కృష్ణ జింక (బ్లాక్ బక్) |
రాష్ట్ర పక్షి | పాలపిట్ట (ఇండియన్ రోలర్/ బ్లూ జే) |
రాష్ట్ర వృక్షం | వేప చెట్టు (అజూడేర్చా ఇండీకా) |
రాష్ట్ర క్రీడ | కబడ్డి |
రాష్ట్ర నృత్యం | కూచిపూడి |
రాష్ట్ర పుష్పం | కలువ – (వాటర్ లిల్లి) |
రాష్ట్ర జలచరం | డాల్ఫిన్ |
రాష్ట్ర ఫలం | మామిడి – మూంజిపైరా ఇండికా |
మరిన్ని ముఖ్యాంశాలు:
- ఆంధ్ర రాష్ట్ర రాజధాని – కర్నూలు 1953 అక్టోబరు 1 నుంచి 1956 నవంబరు 1 ముందు వరకు
- ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజధాని – హైదరాబాద్ (10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని)
- ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి – టంగుటూరి ప్రకాశం
- ఆంధ్ర రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి – బెజవాడ గోపాల్ రెడ్డి
- ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద జిల్లా – అనంతపురం
- అతిచిన్న జిల్లా – శ్రీకాకుళం
- ఆంధ్రప్రదేశ్‌లో చివరగా ఆవిర్భవించిన జిల్లా – విజయనగరం (1979, జూన్ 1)
- ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని – అమరావతి
- అమరావతి శంకుస్థాపన – 23 అక్టోబరు, 2015
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టు – హైదరాబాద్ (10 సంవత్సరాలు ఉమ్మడిగా ఉంటుంది)
- రాయలసీమకు ఆ పేరు పెట్టింది – గాడిచర్ల హరి సర్వోత్తమరావు
- ఆంధ్రప్రదేశ్ ఆకారం – తాళం చెవి
- శానసభ (దిగువ సభ) స్థానాలు – 175
- విధానమండలి (ఎగువ సభ) స్థానాలు – 58
- లోక్‌సభ స్టానాలు – 25
- రాజ్యసభ స్టానాలు – 11
- నూతన ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి – నారా చంద్రబాబు నాయుడు
- ప్రమాణ స్వీకారం చేసిన తేది – 2014 జూన్ 8
- సమైక్య రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి – నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి
- సమైక్య రాష్ట్ర చివరి:మొదటి నవ్యాంధ్రప్రదేశ్ గవర్నరు – ఏక్కాడు శ్రీనివాసన్ లక్ష్మీ నరసింహన్
ఆంధ్రప్రదేశ్ – భూగోళశాస్త్రం PDF
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |