Telugu govt jobs   »   AP History Top 20 MCQs

AP History Top 20 MCQs for APPSC Group 2 Mains and AP Police Constable | APPSC గ్రూప్ 2 మెయిన్స్ & AP పోలీస్ కానిస్టేబుల్ కోసం AP చరిత్ర టాప్ 20 MCQలు

ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్ష APPSC గ్రూప్ 2 మెయిన్స్ డిసెంబర్ 2024లో నిర్వహించబడుతుంది. సమయం తక్కువ ఉన్నందున అభ్యర్థుల కోసం మేము ఈ తక్కువ సమయంలో రివిజన్ చేసుకునే  విధంగా టాప్ 20 అతి ముఖ్యమైన MCQS లను అందిస్తున్నాము. ఈ కథనంలో AP చరిత్రకు సంబందించిన ప్రశ్నలను అందించాము.

APPSC గ్రూప్ 2 & AP పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పాలిటీ, చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, పర్యావరణ శాస్త్రం మొదలైన అంశాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకుAdda247 ప్రతిరోజు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి. ఈ ప్రశ్నలు చాలా ప్రత్యేకమైనవి మరియు కామెటిటివ్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

AP History Top 20 MCQs

Q1. కాంగ్రెస్ సంస్థ ఉండగా హోంరూలు లీగ్ అవసరమేమిటని ప్రశించిన పత్రిక

(a)కృష్ణా పత్రిక

(b) ఆంధ్రపత్రిక

(c) గౌతమీ పత్రిక

(d) శశి రేఖ పత్రిక

Q2. వెనీసు బాటసారి మార్కోపోలో ఏ సంవత్సరంలో తూర్పుతీర రేవుపట్టణం మోటుపల్లి దగ్గర దిగి కాకతీయ సామ్రాజ్య పరిస్థితుల్ని వివరించినాడు.

(a) క్రీ.శ. 1292

(b) క్రీ.శ. 1294

(c) క్రీ.శ. 1296

(d) క్రీ.శ. 1298

Q3. A)కందుకూరి 1874 లో ధవళేశ్వరంలో బాలికల పాఠశాలను నెలకొల్పాడు .

B) పెద్దాపురం  రాజా ఇచ్చిన పదివేల ధనంతో రాజమండ్రిలో స్త్రీల విద్యకోసం ఒక ఉన్నత పాఠశాలను నెలకొల్పాడు .

(a) A,B సరైనవి

(b) A,B సరి కాదు

(c) A సరి కాదు,B సరైనది

(d) A సరైనది,B సరి కాదు

Q4.కందుకూరి వీరేశలింగం ఎవరి వద్ద సంస్కృతం నేర్చుకునే వాడు

(a) దూసి సోమయాజులు

(b)సామినేని ముద్దు నరసింహం

(c) ఏనుగు వీరయ్య

(d)పురాణపండ రామ దీక్షుతులు

Q5. అభ్యుదయ రచయితల సంఘం 1943 లో ఏర్పడింది . దీని ప్రధమాధ్యక్షులు

(a) తాపీ ధర్మారావు

(b) శ్రీశ్రీ

(c) ఆరుద్ర

(d) సి.నా.రె

Q6.’’వాస్తవికతతోపాటు అధివాస్తవికతను , వ్యక్తి చైతన్యంతోపాటు సంఘచైతన్యమును సమానాధికారంతో ప్రవచించిన ప్రవక్త శ్రీ శ్రీ’’ అని ఎవరు ప్రశంసించారు .

(a) సి.నారాయణరెడ్డి

(b)విశ్వనాధ సత్యనారాయణ

(c)చెర బండ రాజు

(d) తెన్నేటి విశ్వనాధం

Q7.ఆంధ్ర రాష్ర ఏర్పాటు సమయంలో  హైకోర్టు గుంటూరులో ఏర్పరచాలని ఆంధ్ర శాసనసభ  ఏ సంవత్సరంలో తీర్మానించింది

(a) 1955

(b) 1954

(c) 1958

(d)  1956

Q8. ‘వేదాంత రసాయనం‘ అనే క్రైస్తవ గ్రంథాన్ని రచించిన వారు

(a) మంగళగిరి ఆనందరావు

(b) శేషగిరి శాస్త్రి

(c) షుల్జ్

(d) మార్తిమం రోజర్

Q9.1907 బిపిన్ చంద్ర పాల్ రాజమండ్రి పర్యటన సమయానికి రాజమండ్రి కళాశాల ప్రిన్సిపాల్ ఎవరు ?

(a) లైడింగర్

(b) మార్క్ వాంటర్

(c)స్కాట్

(d)సాడ్లింగ్

Q10. ” గురజాడ తెలుగు సారస్వతానికి సరిహద్దు ” అని అన్న వారు

(a) దాశరధి

(b) గిడుగు వెంకటరామమూర్తి

(c) ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి

(d) నార్ల వెంకటేశ్వరరావు గారు

Q11. కందుకూరి వీరేశలింగం గారు తొలి వితంతువు వివాహాన్ని ఏ రోజున జరిపించారు?

(a) డిసెంబర్ – 10 – 1881
(b) డిసెంబర్ – 11 – 1881
(c) డిసెంబర్ – 12 – 1881
(d) డిసెంబర్ – 13 – 1881
Q12. జస్టిస్ పార్టీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?

(a) 1915
(b) 1916
(c) 1917
(d) 1918
Q13. 1934లో ఏర్పడిన రాయలసీమ మహాసభ తొలి సమావేశం ఎక్కడ జరిగింది?

(a) కడప
(b) అనంతపురం
(c) మద్రాస్
(d) కర్నూలు
Q14. శ్రీ బాగ్ ఒప్పందం ఏ నాయకులు మధ్య జరిగింది?

(a) ఆంధ్ర – తెలంగాణ
(b)తెలంగాణ – రాయలసీమ
(c) ఆంధ్ర – తమిళ
(d) ఆంధ్ర – రాయలసీమ
Q15. కాకతీయుల కాలంలో మొట్టమొదటి ముస్లింల దాడి ఏ సంవత్సరంలో జరిగింది?

(a) 1301
(b) 1301
(c) 1303
(d) 1304
Q16. నందంపూడి అగ్రహారం ఈ క్రింది వానిలో ఎవరికి ఇవ్వబడింది?

(a) నన్నయ్య
(b) నారాయణ బట్టు
(c) పావులూరి మల్లన్న
(d) పాల్కురికి సోమనాథుడు
Q17. కాకతీయుల కాలం నాటి నాట్యం, సంగీతం గురించి ఈ క్రింది ఏ శాసనం పేర్కొంటుంది?

(a) బీదర్ కోట శాసనం
(b) మల్కాపురం శాసనం
(c) వరంగల్ శాసనం
(d) మోటుపల్లి అభయ శాసనం
Q18. విజయనగర సామ్రాజ్య చరిత్రకు ప్రధాన ఆధారమైన గ్రంధం ఈ క్రింది వానిలో ఏది?

(a) మను చరిత్ర
(b) ఆముక్త మాల్యాద
(c) పాండురంగ మహత్యం
(d) ఫర్ గాటెన్ ఎంపీరియర్
Q19. పెద కోమటి వేమారెడ్డి ఆస్థానంలో గల విద్యాధికారి ఎవరు?

(a) విద్యనాథుడు
(b)త్రినాధుడు
(c) శ్రీ నాథుడు
(d) ఎర్రా ప్రగడ
Q20. ప్రముఖమైన అల్లూరి శాసనం ఈ క్రింది ఏ రాజ వంశం కాలం నాటిది?

(a) తూర్పు చాళుక్యులు
(b) కాకతీయులు
(c) ఇక్ష్వాకులు
(d) రెడ్డి రాజులు

TEST PRIME - Including All Andhra pradesh Exams

Solutions:

S1.Ans(b)

Sol.కాంగ్రెస్ సంస్థ ఉండగా హోంరూలు లీగ్ అవసరమేమిటని ఆంధ్రపత్రిక ప్రశించింది .

S2.ans.(a)

Sol. వెనీసు బాటసారి మార్కోపోలో ఏ సంవత్సరంలో తూర్పుతీర రేవుపట్టణం మోటుపల్లి దగ్గర దిగి కాకతీయ సామ్రాజ్య పరిస్థితుల్ని వివరించినాడు. –  క్రీ.శ. 1292

S3.ans.(d)

sol.కందుకూరి 1874 లో ధవళేశ్వరంలో బాలికల పాఠశాలను నెలకొల్పాడు . పిఠాపురం రాజా ఇచ్చిన పదివేల ధనంతో రాజమండ్రిలో స్త్రీల విద్యకోసం ఒక ఉన్నత పాఠశాలను నెలకొల్పాడు .

S4.ans.(a)

sol. కందుకూరి వీరేశలింగం ఎవరి వద్ద సంస్కృతం నేర్చుకునే వాడు – దూసి సోమయాజులు

S5.ans(a)

sol. అభ్యుదయ రచయితల సంఘం 1943 లో ఏర్పడింది . దీని ప్రధమాధ్యక్షులు – తాపీ ధర్మారావు

S6.ans(a)

sol. .‘’వాస్తవికతతోపాటు అధివాస్తవికతను , వ్యక్తి చైతన్యంతోపాటు సంఘచైతన్యమును సమానాధికారంతో ప్రవచించిన ప్రవక్త శ్రీ శ్రీ’’ అని ఎవరు ప్రశంసించారు .- సి.నారాయణరెడ్డి

S7.ans(b)

Sol. ఆంధ్ర రాష్ర ఏర్పాటు సమయంలో హైకోర్టు గుంటూరులో ఏర్పరచాలని ఆంధ్ర శాసనసభ 1954 లో తీర్మానించింది.

S8.ans(a)

sol. ‘వేదాంత రసాయనం‘ అనే క్రైస్తవ గ్రంథాన్ని రచించిన వారు  – మంగళగిరి ఆనందరావు

S9.ans(b)

sol. 1907 బిపిన్ చంద్ర పాల్ రాజమండ్రి పర్యటన సమయానికి రాజమండ్రి కళాశాల ప్రిన్సిపాల్ ఎవరు ?- మార్క్ వాంటర్

S10.ans(c)

Sol. ” గురుజాడ తెలుగు సారస్వతానికి సరిహద్దు ” అని ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి ప్రసంశించారు.

S11.Ans(b)

Sol: వితంతు పునర్వివాహ చట్టాన్ని 1856 లో లార్డ్ డల్హౌసి కాలంలో రూపొందించడం జరిగింది. ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడానికి ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఈ చట్టం ఫలితంగా ఆంధ్ర ప్రాంతంలో జరిగిన మొదటి వివాహము డిసెంబర్ – 11 – 1881 న రాజమండ్రిలో జరిగింది. కందుకూరి వీరేశలింగం ఈ వివాహాన్ని గోగులపాటి శ్రీరాములు, సీతమ్మకు జరిపించారు.

S12.Ans(c)

Sol: బ్రాహ్మణులకు వ్యతిరేకంగా భారతదేశంలో స్థాపించబడిన మొదటి రాజకీయ పార్టీ. దీన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి పానుగల్ రాజా. జస్టిస్ పార్టీని 1917లో ఏర్పాటు చేశారు. దీని మొదటి సమావేశం 1917 జులై 19న కోయంబత్తూర్ లో జరిగింది ఈ సమావేశానికి అధ్యక్షత వహించినది పానుగల్ రాజా.

S13.Ans(c)

Sol: రాయలసీమ ప్రజల ప్రయోజనాలను కాపాడడానికి K. సుబ్రహ్మణ్యం, C.L నరసింహారెడ్డి 1934లో ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. దీని మొదటి సమావేశం 1934 జనవరి 28వ తేదీన మద్రాసులో జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినది నెమలి పట్టాభి రామారావు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ సభ్యులు హాజరు కాలేదు. దీని యొక్క రెండో సమావేశం 1935 సెప్టెంబర్ మొదటి వారంలో కడపలో జరిగింది.

S14.Ans(d)

Sol: మద్రాసులో కాశీనాధుని నాగేశ్వరరావు ఇంటి వద్ద 1937 – నవంబర్ – 16 న ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్ర – రాయలసీమ నాయకుల మధ్య ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగా 1937 లో దీపావళి పండుగను ఆంధ్రులు ఆంధ్ర రాష్ట్ర దినోత్సవం గా జరుపుకున్నారు. శ్రీ బాగ్ ఒప్పందం ఆధారంగా 1952 – సెప్టెంబర్ – 2 తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఏర్పాటు చేశారు.

S15.Ans(c)

Sol. కాకతీయుల కాలంలో మొట్టమొదటి ముస్లింల దాడి 1303 లో జరిగింది. ఈ మొదటి దాడిలో ముస్లిం వర్గానికి ఫక్రుద్దీన్ జునా నాయకత్వం వహించాడు. కానీ ఈ తిరుగుబాటు విజయవంతం కాలేదు. మొత్తంగా కాకతీయులపై ముస్లింలు 5 సార్లు దండయాత్ర చేశారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ దండయాత్ర వల్ల 1323 లో కాకతీయ సామ్రాజ్యము ఢిల్లీ సుల్తాన్ రాజ్యంలో అంతర్భాగమైంది. కాకతీయుల కాలంలో జరిగిన మొట్టమొదటి ముస్లింల దాడి రెండో ప్రతాపరుద్రుడి కాలంలో జరిగింది.

S16.Ans(b)

Sol. తూర్పు చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రుడు తన ఆస్థానములోని నారాయణ భట్టుకు నందంపూడి అగ్రహారం ఇచ్చాడు. మహాభారత రచనల్లో నన్నయకు సహకరించినందుకు. మహాభారతంలో మొత్తం 18 పర్వాలు కలవు. ఎక్కువ భాగాన్ని తిక్కన రచించాడు.

మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన కవులు నన్నయ్య, తిక్కన , ఎర్రన.

S17.Ans(b)

Sol: కాకతీయుల కాలం నాటి నాట్యం, సంగీతం గురించి మల్కాపురం శాసనంలో పేర్కొనడం జరిగింది. ఈ శాసనాన్ని వేయించినది గణపతి దేవుని కుమార్తె అయిన రుద్రమదేవి. రుద్రమదేవి యొక్క గురువు విశ్వేశ్వర శివాచార్యుడు. ఈయనకు మందడ అనే గ్రామాన్ని దానం చేయడం జరిగింది. ఈ మల్కాపురం శాసనంలోనే ప్రసూతి గృహం గురించి పేర్కొన్నారు.

S18.Ans(d)

Sol: విజయనగర చరిత్రకు అతి ముఖ్యమైన ఆధార గ్రంధం ఫర్ గాటెన్ ఎంపీరియర్. దీని రచయిత  రాబర్ట్ సీవెల్. విజయనగర సామ్రాజ్యం 1336 లో ఏర్పాటు చేశారు. విజయనగర సామ్రాజ్యాన్ని మొత్తం నాలుగు రాజవంశాలు పరిపాలించాయి. వాటిలో ఎక్కువ కాలం పరిపాలించిన వంశం సంఘము వంశం. ప్రముఖమైన శ్రీకృష్ణదేవరాయలు తుళువ అంశానికి చెందినవాడు.

S19.Ans(c)

Sol: పెద కోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా శ్రీనాధుడు పనిచేశాడు. శ్రీ నాథుడికి గల ప్రముఖమైన బిరుదు కవి సార్వభౌమ. ఈ బిరుదును రెండవదేవరాయల ఆస్థానంలో ఉన్న గౌడ  డిండిమ భట్టును ఓడించి కవి సార్వభౌమ అనే బిరుదును పొందాడు. ఈ బిరుదును రెండవదేవరాయలు చేతుల మీదుగా పొందుకున్నాడు.

S20.Ans(c)

Sol: ప్రముఖమైన అల్లూరి శాసనం ఇక్ష్వాకుల కాలంలో వేయబడింది. ఇక్ష్వాకులలో ప్రముఖ రాజు అయిన వీర పురుష దత్తుడు అల్లూరి శాసనాన్ని వేయించాడు. ఇతని పాలనా కాలాన్ని బౌద్ధ మతానికి స్వర్ణ యుగంగా పేర్కొంటారు. ఇతని కాలంలో ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధ మతం అత్యధికంగా వ్యాప్తి చెందింది. అందువల్లనే ఇతనిని దక్షిణాది అశోకుడు అంటారు. ఇతనికి గల ప్రముఖమైన బిరుదులు శ్రీ పర్వతాధిపతి, దక్షిణాది అశోకుడు.APPSC Group 2 Mains 2024 | Online Test Series (Telugu & English) By Adda247 Telugu

APPSC Group 2 2024 Mains AP History Batch | Complete AP history by Shiva Sir | Online Live Classes by Adda 247

APPSC Group 2 Mains Success Pack I Preparation & Revision Complete Live + Recorded Batch By Adda247

Adda247 Telugu Home page Click here
Adda247 Telugu APP Click Here

Sharing is caring!