Telugu govt jobs   »   Current Affairs   »   ఏకోపాధ్యాయ పాఠశాలల కోసం AP మొబైల్ టీచర్...

ఏకోపాధ్యాయ పాఠశాలల కోసం AP మొబైల్ టీచర్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది

ఏకోపాధ్యాయ పాఠశాలల కోసం AP మొబైల్ టీచర్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది

రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో నిరంతర బోధనను నిర్ధారించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్’ (CRMT) విధానాన్ని అమలు చేసింది. ఈ విధానంలో, పాఠశాలలో ఉపాధ్యాయులు సెలవులో ఉన్నప్పుడల్లా, రిసోర్స్ పూల్ నుండి క్లస్టర్ రిజర్వ్ మొబైల్ ఉపాధ్యాయులచే భర్తీ చేయబడతారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇప్పటివరకు ఒకరిద్దరు ఉపాధ్యాయులు ఉన్నచోట సెలవు పెట్టినా, డెప్యుటేషన్లపై మరో చోటకు వెళ్లినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం వల్ల బోధనకు ఇబ్బంది ఏర్పడుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి, CRMT వ్యవస్థను ప్రవేశపెట్టారు. గతంలో హైస్కూల్ కాంప్లెక్స్‌లో క్లస్టర్ రిసోర్స్ పర్సన్‌లను (సీఆర్‌పీ) నియమించి బడి బయట పిల్లలను చేర్పించడంతోపాటు పలు పనులు చేసేవారు. అయితే, ఈ బాధ్యతలను ఇప్పుడు ఎక్కువగా ఎంఈఓలు, విద్యా సంక్షేమ సహాయకులు, వాలంటీర్లు నిర్వహిస్తున్నారు.

దీంతో పాఠశాలల్లో బోధనకు అన్ని అర్హతలు ఉన్న సీఆర్పిలను బోధన ప్రయోజనాల కోసం ఉపయోగించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించి మండలాన్ని ఒక క్లస్టర్గా రిజర్వ్ మొబైల్ టీచర్లుగా వారినే నియమించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,489 మంది క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు ఇకపై క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్లుగా మారనున్నారు. ఎంఈవో పర్యవేక్షణలో ఒక్కో సీఆర్ఎంటీ మూడు లేదా నాలుగు పాఠశాలలకు సేవలు అందించేలా విధులను నిర్ణయించారు. రాష్ట్రంలోని 9,602 ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సెలవు పెట్టినప్పుడు వీరిద్వారా నిరాటంకంగా బోధన అందించవచ్చు.

"VISION" APPSC Group-1 Prelims Officers Batch | Telugu | Online Live Interactive Classes From Adda247

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

***************************************************************************

Sharing is caring!

FAQs

మొదటి విద్యా మంత్రి ఎవరు?

మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి విద్యా మంత్రి, మరియు అతని పుట్టినరోజు, నవంబర్ 11, జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటారు. విద్య కోసం న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు మరియు పాత్రికేయుడు, మౌలానా అబుల్ కలాం ఆజాద్.