AP పోలీస్ కానిస్టేబుల్ మరియు SI PET ఈవెంట్స్ వివరాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (APSLPRB) విజయవంతంగా AP పోలీస్ కానిస్టేబుల్ మరియు SI ప్రిలిమ్స్ పరీక్షలను నిర్వహించింది. AP పోలీస్ కానిస్టేబుల్ మరియు SI ఎంపిక పక్రియాల ప్రకారం ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)/ఫిసికల్ మెసుర్మెంట్ టెస్ట్ (PMT) జరగాల్సి ఉంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు PET/PMT పరీక్షలకు హాజరు కావాలి. AP పోలీస్ కానిస్టేబుల్ ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ మరియు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ 2024 డిసెంబర్ చివరి వారంలో తాత్కాలికంగా నిర్వహించబడతాయి. అభ్యర్ధులు ఇది ఒక మంచి అవకాశంగా భావించి తమ ప్రిపరేషన్ ను ఇంకా మెరుగుపరచుకోవాలి. AP పోలీస్ కానిస్టేబుల్ మరియు SI PET ఈవెంట్స్ కి సంబంధించిన వివరాలు ఈ కధనంలో అందించాము.
Adda247 APP
AP పోలీస్ కానిస్టేబుల్ మరియు SI ఎంపిక పక్రియ
AP పోలీస్ కానిస్టేబుల్ మరియు SI రిక్రూట్‌మెంట్ ప్రక్రియ 2023, 4 దశలను కలిగి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ మరియు SI ప్రిలిమ్స్ పరీక్షాలో అర్హత సాధించిన అభ్యర్థులు ముందుగా ఈ పోస్టు నియామకానికి ఉన్న పరీక్ష ఎంపిక విధానం ను తెలుసుకోవాల్సి ఉంటుంది. AP కానిస్టేబుల్ మరియు SI పోస్ట్‌లకి ఎంపిక కావడానికి అభ్యర్థులు తప్పనిసరిగా ఎంపిక పక్రియ లో అన్ని దశలకు అర్హత సాధించాలి. అవి
- ప్రిలిమినరీ రాత పరీక్ష
- ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT) & ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)
- చివరి రాత పరీక్ష
- డాకుమెంట్స్ వెరిఫికేషన్
AP కానిస్టేబుల్ PET షెడ్యూల్ విడుదల
AP పోలీస్ కానిస్టేబుల్ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) వివరాలు
ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థి తప్పనిసరిగా శారీరక పరీక్షల శ్రేణిని పూర్తి చేయాలి. దరఖాస్తు చేసిన పోస్ట్‌ను బట్టి ఈ పరీక్షలు మారుతూ ఉంటాయి. మహిళలు, మాజీ సైనికులు మరియు రిజర్వేషన్లు ఉన్నవారికి కొన్ని మినహాయింపు నియమాలు ఉంటాయి.
(పోస్ట్ కోడ్ నెం. 21): పురుషులు & మహిళల అభ్యర్థులు తప్పనిసరిగా 1600 మీటర్ల పరుగు (ఎల్ మైల్ రన్) లో అర్హత సాధించాలి
AP పోలీస్ కానిస్టేబుల్ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్: 100 మీటర్ల పరుగు
AP పోలీస్ కానిస్టేబుల్ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్: 100 మీటర్ల పరుగు |
|
జనరల్ | 15 సెకన్లు |
మాజీ సైనికులు | 16.50 సెకన్లు |
స్త్రీలు | 18 సెకన్లు |
AP పోలీస్ కానిస్టేబుల్ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్: 1600 మీటర్ల పరుగు
AP పోలీస్ కానిస్టేబుల్ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్: 1600 మీటర్ల పరుగు |
|
జనరల్ | 8 నిముషాలు |
మాజీ సైనికులు | 9 నిమిషాల 30 సెకన్లు |
స్త్రీలు | 10 నిమిషాల 30 సెకన్లు |
AP పోలీస్ కానిస్టేబుల్ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్: లాంగ్ జంప్
AP పోలీస్ కానిస్టేబుల్ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్: లాంగ్ జంప్ |
|
జనరల్ | 3.80 మీటర్లు |
మాజీ సైనికులు | 3.65 మీటర్లు |
స్త్రీలు | 2.75 మీటర్లు |
పోస్ట్ కోడ్ నెం. 23 : పోస్ట్ కోడ్ నెం. 23 కి దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ కి సంబంధించిన మూడు ఈవెంట్లలో తప్పనిసరిగా అర్హత సాధించాలి
పరీక్ష:
1. 1600 మీటర్ల పరుగు (1 మైలు పరుగు)
2. 100 మీటర్ల పరుగు
3. లాంగ్ జంప్
క్రమ సంఖ్య | అంశం | అర్హత సమయం /దూరం | ||
జనరల్ | మాజీ సైనికులు | మార్కులు | ||
1 | 100 మీటర్ల పరుగు | 15 సెకండ్స్ | 16.5 సెకండ్స్ | 30 |
2 | లాంగ్ జంప్ | 3.80 మీటర్లు | 3.65 మీటర్లు | 30 |
3 | 1600 మీటర్ల పరుగు | 8 నిముషాలు | 9 నిమిషాల 30 సెకండ్స్ | 40 |
AP పోలీస్ కానిస్టేబుల్ భౌతిక ప్రమాణాలు/ PMT టెస్ట్ వివరాలు
అభ్యర్థులు నిర్వహించే అధికారం ద్వారా నిర్దేశించిన నిర్దిష్ట భౌతిక కొలతను కలిగి ఉండాలి. AP కానిస్టేబుల్ ఫిజికల్ మెజర్‌మెంట్స్ టెస్ట్ 2023 పురుషులు మరియు మహిళలు సంబంధించిన వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.
లింగము | అంశము | కొలతలు |
పోస్ట్ కోడ్ నెం. 21 & 23 | ||
పురుషులు | ఎత్తు | 167.6 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు. |
ఛాతి | కనీసం 5 సెం.మీ విస్తరణతో 86.3 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు. | |
పోస్ట్ కోడ్ నెం. 21 | ||
స్త్రీలు | ఎత్తు | 152.5 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు. |
బరువు | 40 కిలోల కంటే తక్కువ ఉండకూడదు |
గమనిక: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఏజన్సీ ప్రాంతాల్లోని షెడ్యూల్డ్ తెగలు మరియు ఆదిమ తెగలకు చెందిన అభ్యర్థులు కింది భౌతిక కొలతను కలిగి ఉండాలి
లింగము | అంశము | కొలతలు |
పోస్ట్ కోడ్ నెం. 21 & 23 | ||
పురుషులు | ఎత్తు | 160 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు. |
ఛాతి | కనీసం 3 సెం.మీ విస్తరణతో 80 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు. | |
పోస్ట్ కోడ్ నెం.21 | ||
స్త్రీలు | ఎత్తు | ఎత్తు 150 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు. |
బరువు | 38 కిలోల కంటే తక్కువ ఉండకూడదు |
AP పోలీస్ SI ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT) వివరాలు
AP SI ప్రిలిమ్స్ వ్రాత పరీక్ష లో అర్హత పొందిన అభ్యర్థులు AP SI ఫిజికల్ మెజర్‌మెంట్స్ టెస్ట్ 2023కి అర్హులు. అభ్యర్థులు నిర్వహించే అధికారం ద్వారా నిర్దేశించిన నిర్దిష్ట భౌతిక కొలతను కలిగి ఉండాలి. AP SI ఫిజికల్ మెజర్‌మెంట్స్ టెస్ట్ 2023 సంబంధించిన వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.
లింగము | అంశము | కొలతలు |
పోస్ట్ కోడ్ నెం. 11 & 13 | ||
పురుషులు | ఎత్తు | 167.6 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు. |
ఛాతి | కనీసం 5 సెం.మీ విస్తరణతో 86.3 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు. | |
పోస్ట్ కోడ్ నెం. 11 | ||
స్త్రీలు | ఎత్తు | ఎత్తు 152.5 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు. |
బరువు | 40 కిలోల కంటే తక్కువ ఉండకూడదు |
గమనిక: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఏజన్సీ ప్రాంతాల్లోని షెడ్యూల్డ్ తెగలు మరియు ఆదిమ తెగలకు చెందిన అభ్యర్థులు కింది భౌతిక కొలతను కలిగి ఉండాలి:
లింగము | అంశము | కొలతలు |
పోస్ట్ కోడ్ నెం. 11 & 13 | ||
పురుషులు | ఎత్తు | 160 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు. |
ఛాతి | కనీసం 3 సెం.మీ విస్తరణతో 80 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు. | |
పోస్ట్ కోడ్ నెం. 11 | ||
స్త్రీలు | ఎత్తు | ఎత్తు 150 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు. |
బరువు | 38 కిలోల కంటే తక్కువ ఉండకూడదు |
AP పోలీస్ SI ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) వివరాలు
పోస్ట్ కోడ్ నెం. 11 : పురుషులు & మహిళల అభ్యర్థులు తప్పనిసరిగా 1600 మీటర్ల పరుగు (ఎల్ మైల్ రన్) లో అర్హత సాధించాలి
క్రమ సంఖ్య | అంశం | అర్హత సమయం/ దూరం | ||
జనరల్ | మాజీ సైనికులు | మహిళలు | ||
1 | 100 మీటర్ల పరుగు | 15 సెకండ్స్ | 16.5 సెకండ్స్ | 18 సెకండ్స్ |
2 | లాంగ్ జంప్ | 3.80 మీటర్లు | 3.65 మీటర్లు | 2.75 మీటర్లు |
3 | 1600 మీటర్ల పరుగు | 8 నిముషాలు | 9 నిమిషాల 30 సెకండ్స్ | 10 నిమిషాల 30 సెకండ్స్ |
పోస్ట్ కోడ్ నెం. 13 : అభ్యర్థులు ఫిజికల్ ఎఫిషియెన్సీకి సంబంధించిన మూడు ఈవెంట్లలో తప్పనిసరిగా అర్హత సాధించాలి
పరీక్ష:
1. 1600 మీటర్ల పరుగు (1 మైలు పరుగు)
2. 100 మీటర్ల పరుగు
3. లాంగ్ జంప్
క్రమ సంఖ్య | అంశం | అర్హత సమయం /దూరం | ||
జనరల్ | మాజీ సైనికులు | మార్కులు | ||
1 | 100 మీటర్ల పరుగు | 15 సెకండ్స్ | 16.5 సెకండ్స్ | 30 |
2 | లాంగ్ జంప్ | 3.80 మీటర్లు | 3.65 మీటర్లు | 30 |
3 | 1600 మీటర్ల పరుగు | 8 నిముషాలు | 9 నిమిషాల 30 సెకండ్స్ | 40 |
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |