Telugu govt jobs   »   AP పోలీస్ కానిస్టేబుల్ PET పరీక్షలు వాయిదా
Top Performing

AP పోలీస్ కానిస్టేబుల్ PET పరీక్షలు వాయిదా, కొత్త తేదీలను తనిఖీ చేయండి

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో SCT పోలీస్ కానిస్టేబుల్ (సివిల్) (పురుషులు & మహిళలు), మరియు SCT పోలీస్ కానిస్టేబుల్ (APSP) (పురుషులు) పోస్టులకు సంబంధించి  ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT)/ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) ఈవెంట్‌లు వాయిదా వేస్తున్నట్లు  అధికారిక నోటిస్ ద్వారా తెలియజేయబడింది. పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సంబంధించి జనవరి 8 నుంచి 10వ తేదీ మధ్య జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షలు (PMT, PET) పలు జిల్లాల్లో వాయిదా పడ్డాయి.

AP Police constable PET Tests Postponed Notice

పోలీసు కానిస్టేబుల్‌ దేహదారుఢ్య పరీక్షలు వాయిదా

ఆంధ్ర ప్రదేశ్  పోలీస్ కానిస్టేబుల్ PMT/PET ఈవెంట్‌లు  30 డిసెంబర్ 2024 నుండి జరుగుతున్నాయి, అయితే వైకుంఠ ఏకాదశి, శాంతి భద్రతల సమస్యలను దృష్టిలో పెట్టుకుని పలు జిల్లాల్లో జనవరి 8 నుంచి 10వ తేదీ మధ్య జరగాల్సిన ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) ఈవెంట్‌లను వాయిదా వేసినట్లు పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ ఎం.రవిప్రకాశ్‌ జనవరి 5న అధికారిక నోటిస్ విడుదల చేశారు.

 పోలీసు కానిస్టేబుల్‌ PMT/PET ఈవెంట్‌ల కొత్త తేదీలు

జిల్లా మునుపటి ఈవెంట్ తేదీలు కొత్త తేదీలు
శ్రీకాకుళం జనవరి 8 జనవరి 11
విజయనగరం జనవరి 8 జనవరి 11
విశాఖపట్నం జనవరి 8 జనవరి 11
అనంతపురం జనవరి 8 నుంచి 10 వరకు జనవరి 17, 18, 20 తేదీలలో
చిత్తూరు జనవరి 8 నుంచి 09 వరకు జనవరి 17, 18
  • అందువల్ల, పైన పేర్కొన్న తేదీలలో ఈవెంట్‌లలో పాల్గొనాల్సిన అభ్యర్థులు పైన పేర్కొన్న విధంగా సవరించిన తేదీలలో ఈవెంట్‌లకు హాజరు కావాలి. పైన పేర్కొన్న వాయిదా తేదీలలో ఏవైనా ఇతర పరీక్షలు ఉన్న అభ్యర్థులు, 16.01.2025 తర్వాత ఏదైనా పని రోజున అనంతపురం మరియు చిత్తూరు కేంద్రాలలో హాజరు కావచ్చు. శ్రీకాకుళం, విజయనగరం మరియు విశాఖపట్నం కేంద్రాలకు చెందిన అభ్యర్థులు, 08-01-2025 తర్వాత ఏదైనా పని దినం తర్వాత, తగిన రుజువుతో పరీక్షలకు హాజరు కావచ్చు.
  • మిగిలిన జిల్లాలకు సంబంధించిన కార్యక్రమాలు ప్రస్తుత షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయి. ఏదైనా స్పష్టత కోసం, అభ్యర్థులు కార్యాలయ వేళల్లో హెల్ప్‌లైన్ నంబర్: 9441450639 మరియు 9100203323కు కాల్ చేయవచ్చు.

TEST PRIME - Including All Andhra pradesh Exams

Sharing is caring!

AP పోలీస్ కానిస్టేబుల్ PET పరీక్షలు వాయిదా, కొత్త తేదీలను తనిఖీ చేయండి_4.1