Telugu govt jobs   »   ap police constable   »   AP కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్

AP Police Constable 2024 Recruitment Notification Will be Released Soon | AP పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ త్వరలో విడుదల  

AP Constable Recruitment 2024: గతంలో 6100  కానిస్టేబుల్ ఖాళీలకు నిర్వహించిన రిక్రూట్​మెంట్​ ప్రక్రియ అర్ధంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే AP పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పునరుద్ధరణపై ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఆగస్టు 2024 నెలాఖరులోగా AP పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం.

త్వరలోAP పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్

2022 డిసెంబర్ లో విడుదల అయిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు దేహదారుఢ్య, శారీరక సామర్థ్య (PMT, PET) పరీక్షలు జరగలసి ఉండగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా వాయిదా పడింది, తర్వాత ఆ కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఎటువంటి ప్రకటన రాలేదు. ఈ క్రమంలోనే కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం నుండి కొత్త అప్డేట్ వచ్చింది. త్వరలోనే AP పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ను విడుదల చేస్తాం అని ప్రకటించింది. గత నోటిఫికేషన్ పై న్యాయస్థానాల్లో గతంలో కొన్ని కేసులు దాఖలై ఉన్నందున వాటిపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుని తదుపరి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది.

AP పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియ

AP పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌ కోసం నోటిఫికేషన్‌లు అధికారిక వెబ్‌సైట్‌లో త్వరలో విడుదల చేయబడుతుంది. నమోదు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. ఫలితాలు మరియు హాల్ టిక్కెట్లను అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

AP కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌ కోసం నాలుగు దశలను కలిగి ఉంటుంది.

  • ప్రిలిమినరీ ఎగ్జామ్,
  • ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT),
  • ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) మరియు
  • ఫైనల్ ఎగ్జామ్.

ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి స్థాయి పరీక్షకు అర్హులు.

ప్రిలిమినరీ పరీక్ష అనేది బహుళ ప్రశ్నలతో కూడిన రాత పరీక్ష, అయితే ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ మరియు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ ఒక అభ్యర్థి భౌతిక సామర్థ్యాన్ని పరిశీలిస్తాయి.

చివరగా, ఈ ఫిజికల్ టెస్ట్‌లలో అర్హత సాధించిన అభ్యర్థులు ఆంధ్ర ప్రదేశ్  పోలీస్ మెయిన్స్ పరీక్షకు హాజరు కావడానికి అనుమతించబడతారు, ఇది మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు  కలిగి ఉన్న పరీక్ష.

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

AP కానిస్టేబుల్ వయోపరిమితి 

  • కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఆంధ్రప్రదేశ్ లేదా AP నివాస రుజువు ఉన్న దరఖాస్తుదారులు తప్పనిసరిగా18 సంవత్సరాల నుండి 34 సంవత్సరాల వయస్సు మధ్య ఉండాలి.
  • ఇతర రాష్ట్రాల నుండి18 సంవత్సరాల నుండి 26 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  • ఆంధ్రప్రదేశ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ రిజర్వ్‌డ్ కేటగిరీకి చెందిన దరఖాస్తుదారులకు గరిష్ట వయోపరిమితిలో వయో సడలింపులను అందిస్తుంది.

AP కానిస్టేబుల్ విద్యా అర్హతలు

  • ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన పరీక్ష. షెడ్యూల్డ్ కులాలు లేదా షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థి విషయంలో, అతను/ఆమె తప్పనిసరిగా SSC లేదా దాని తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి మరియు ఇంటర్మీడియట్ చదివి 1వ సంవత్సరం మరియు 2వ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరై ఉండాలి.

APPSC Group 2 Mains Success Pack I Preparation & Revision Complete Live + Recorded Batch By Adda247

AP Constable Related Articles 
AP Police Constable Salary and Job Profile AP Constable Syllabus
AP Constable Age limit  AP Constable Exam Pattern
AP Constable Selection Process  AP Police Constable Previous Year Cut off
AP Police Constable and SI PET Event Details
AP Police Constable Eligibility

Sharing is caring!