APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష కోసం సన్నద్దమయ్యే అభ్యర్ధులు పరీక్ష కి దాదాపు 80 రోజులు ఉంది. ఇప్పటికే ప్రిపరేషన్ లో నిమాగ్నమైన అభ్యర్ధులకి లేదా కొత్తగా ప్రిపరేషన్ ప్రారంభించే అభ్యర్ధులకి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పై ఒక అవగాహన ఉండాలి పరీక్షల్లో ప్రశ్నలు కచ్చితంగా వచ్చే అవకాశం ఉన్నందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యయం, అప్పులు మరియు వడ్డీల గురించిన సమాచారం ఈ కధనం లో తెలుసుకోండి.
Adda247 APP
AP బడ్జెట్ 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓట్ ఆన్ అకౌంటు బడ్జెట్ ని రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన 7 వ తారీఖున శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సంవత్సరంతో ఆంధ్రప్రదేశ్ కి బుగ్గన శాసనసభలో బడ్జెట్ 5 సార్లు ప్రవేశపెట్టారు. 2024-2025 సంవత్సరానికి 2,86,389 కోట్ల అంచనాతో బడ్జెట్‌ను మంత్రి ప్రవేశపెట్టారు.
AP Vote on Account Budget 2024 Key Highlights
image source: AP Budget
2022-23లో (సవరించిన అంచనా) రూ 1,76,448.39 కోట్ల నుండి 2023-24 సంవత్సరంలో రెవిన్యూ ఖాతాపై రసీదులు ` 2,06,224.01 కోట్లుగా అంచనా వేయబడ్డాయి మరియు వ్యయం రూ. 2,28,540కి వ్యతిరేకంగా రూ. 2022-23లో ` 2,05,555.95 కోట్లు (రివైజ్డ్ ఎస్టీ మేట్). 2023-24 అంచనా ప్రకారం రెవెన్యూ లోటు (-) ` -22,316.70 కోట్లు
గత నాలుగు సంవత్సరములుగా రెవెన్యూ రాబడుల వివరాలు తెలుసుకోండి రూ. కోట్లల్లో:
- 2019-20: 1,11,034.02
- 2020-21: 1,17,136.18
- 2021-22: 1,50,552.50
- 2022-23: 1,76,448.39
- 2023-24(BE): 2,06,224.01
2017 నుంచి కూడా రెవెన్యూ అకౌంటు లోటు లోనే ఉంది 2017 లో 1,6,151.68 కోట్లు కాగా అది 2023-24 బడ్జెట్ సమయానికి 22,316.70కోట్లుకు చేరుకుంది. దీని బట్టి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పై ఒక అంచనా కి రావొచ్చు మరియు రాష్ట్ర ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటోంది .
Image source: ap finance dept
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాలలో వివిధ శాఖలకు చేసిన మూలధన ఖాతా వ్యయం వివరాలు తెలుసుకోండి:
- నీటి వనరులు: సవరించిన బడ్జెట్ ప్రకారం 2022-23లో 9,113.95 కేటాయించారు మరియు 2023-24 బడ్జెట్ లెక్కల ప్రకారం 10218.35 కోట్లు కేటాయించారు
- విధ్య: సవరించిన బడ్జెట్ ప్రకారం 2022-23 లో 2,326 కోట్లు మరియు 2023-24 బడ్జెట్ అంచనా ప్రకారం 4079.05 కోట్లు
- పంచాయతీ రాజ్ మరియు గ్రామీనాభివృద్ది కి సవరించిన బడ్జెట్ 2022-23 ప్రకారం 1,204 కోట్లు మరియు బడ్జెట్ అంచనా 2023-24 కోసం 3,365 కోట్లు
- రవాణా (TR&B):
- సవరించిన బడ్జెట్ 2022-23 ప్రకారం 712.38, మరియు బడ్జెట్ అంచనా 2023-24 కోసం 3,507.44 కోట్లు
- మునిసిపాలిటీ: సవరించిన బడ్జెట్ 2022-23 ప్రకారం 474.20 కోట్లు మరియు బడ్జెట్ అంచనా 2023-24 కోసం 1,682.04 కోట్లు
- ఆరోగ్యం: కోసం సవరించిన బడ్జెట్ 2022-23 ప్రకారం 949.22 కోట్లు మరియు బడ్జెట్ అంచనా 2023-24 కోసం 2,810.02 కోట్లు
కేంద్ర ప్రభుత్వం నుంచి అందుకున్న అప్పులు:
గత ఐదు సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం నుంచి అందుకున్న అప్పుల వివరాలు (రూ. కోట్లల్లో)ఇలా ఉన్నాయి.
సంవత్సరం | అప్పు | సంవత్సరం చివరి నాటికి బకాయి |
2019-20 | 2,030.42 | 10,223.01 |
2020-21 | 4,562.73 | 14,171.01 |
2021-22 | 4895.71 | 17,672.44 |
2022-23 RE | 5,500 | 21,243.89 |
2023-24 BE | 6,522.09 | 26,292.19 |
గత 5 సంవత్సరాలలో కేంద్రం నుంచి అప్పులు దాదాపు 3 రెట్లు పెరిగినీడ మరియు బకాయి దాదాపు 2.4 రేట్లు పెరిగింది.
వివిధ శాఖలకి కేటాయించిన చెల్లింపులు
విద్య
వివరాలు | 2019-20 | 2020-21 | 2021-22 | 2022-23 | 2023-24 |
గ్రాంట్లు | 12,995.27 | 13,634.40 | 14,548.66 | 17,326.67 | 17,785.80 |
నాడు నేడు | 100 | 3,121.92 | 2,750 | 2,000 | 3,500 |
సమగ్ర శిక్ష | 1302.29 | 1,624.29 | 1,989.32 | 1,152.57 | 1,800.00 |
జగనాన్న గోరుముద్ద- మధ్యన భోజన పధకం | 710 .90 | 656.43 | 1,539.72 | 1,152.57 | 1,800 |
ఇతర పద్ధకాలకి | 9,204.76 | 2,884.20 | 2,525.96 | 3,462.97 | 4,101.91 |
మొత్తం | 24,313.21 | 21,921.23 | 23,353.66 | 25,741.52 | 29,690.71 |
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వివిధ పధకాల ద్వారా విద్యాభివృద్ది కోసం ఎంతో వెచ్చించినది మరియు 2019-20తో పోలిస్తే 2023-24లో దాదాపు 22 శాతం అధికంగా కేటాయింపులు చేసింది.
ఆరోగ్యం:
వివరాలు | 2019-20 | 2020-21 | 2021-22 | 2022-23 | 2023-24 |
DR. YSR ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ | 1,305 | 1,024.70 | 1,758.94 | 2,000 | 2,400 |
DR YSR ఆరోగ్య ఆసరా | 100 | 200 | 266.05 | 445.14 | 455 |
జాతీయ ఆరోగ్య మిషన్ | 1252.62 | 2,400.75 | 1,755.28 | 2,250.55 | 2,585.10 |
నాడు నేడు | 84.22 | 385.93 | 992.44 | 807.07 | 2,124.21 |
ఆంధ్ర ప్రదేశ్ వైద్య విధాన పరిషద్ | 743.40 | 643.28 | 686.87 | 750.37 | 1,013.29 |
మందుల కొనుగోలు కోసం | 180 | 400 | 14.95 | 625.53 | 500 |
104 మరియు 108 సేవల కోసం | 207.66 | 257.05 | 233.99 | 297.69 | 351.60 |
ఇతర పధకాలు | 3,479.91 | 4,015.19 | 5,334.94 | 6,122.50 | 6,373.14 |
మొత్తం | 7,352.80 | 9,366.90 | 11,043 | 13,298.66 | 15,882.34 |
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యం మరియు కుటుంభ సంక్షేమం కోసం 2019-20తో పోలిస్తే 2023-24లో దాదాపు 110% అధికంగా కేటాయింపు చేసింది.
వ్యవసాయం:
వివరాలు | 2019-20 | 2020-21 | 2021-22 | 2022-23 | 2023-24 |
YSR రైతు భరోసా | 3,615.60 | 3,840.92 | 3,825.95 | 3,988.52 | 4,020 |
YSR PM ఫసల్ భీమా యోజన | 113.75 | 1,028.69 | 1,709.25 | 2,943.21 | 1,600 |
RKVY | 9,23.88 | 1,137.44 | 235.14 | 1,258.26 | 2,603.91 |
YSR వడ్డీ లేని రుణం | 77 | 1,100 | 244 | 286.34 | 500 |
పంట ధరల స్టీరికరణ నిధి | 356.70 | 524.52 | – | 301.46 | 500 |
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కి సహాయం | 345.33 | 362 | 354.08 | 326.05 | 452.57 |
రైతులకి విత్తనాల కోసం | 186.87 | 181.25 | – | – | 200 |
రైతు సాధికార సంస్థ | 120.05 | 1,133 | 119 | 150 | 147 |
DR YSR ఉద్యానవన విశ్వవిద్యాలయం | 43.59 | 61.46 | 64.44 | 65.93 | 102.04 |
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ | 61.22 | 34.18 | 0.32 | 75.91 | 75.91 |
అక్వా రంగానికి | – | 5.09 | 8.29 | 50 | 70 |
ఇతరములు | 130.39 | 561.71 | 447.22 | 859.21 | 1,703.25 |
ఆంధ్రప్రభుత్వం 2019-20 తో పోలిస్తే 2023-24కి దాదాపు 91 శాతం అధికంగా వెచ్చించినది
ఇంధన రంగం
సంవత్సరం | కేటాయింపులు |
2019-20 | 11,592 |
2920-21 | 6,110.76 |
2021-22 | 11,518.69 |
2022-23 | 8,323.17 |
2023-24 సవరించిన బడ్జెట్ లో | 6,238.71 |
నీటి పారుదల శాఖ
చిన్న మధ్య తరహ ప్రాజెక్టులు | పెద్ద ప్రాజెక్టులు | CAD | వరద నిర్వహణ మరియు డ్రైనేజి | మొత్తం | |
2019-20 | 4145.23 | 718.89 | 5.48 | 61.31 | 4930.91 |
2020-21 | 4,255.81 | 400.90 | 5.34 | 53.35 | 4,715.41 |
2021-22 | 6,440.83 | 441.81 | 5.41 | 139.24 | 7027.29 |
2022-23 | 8527.39 | 1,029.46 | 10.27 | 237.90 | 9805.02 |
2023-24 | 9,922.38 | 843.25 | 5.07 | 198.07 | 10968.77 |
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బహిరంగ మార్కెట్ల ద్వారా 31 మార్చి 2022 కి 2,65,420.98 కోట్లు ఇందులో 5.89% నుంది దాదాపు 14% వరకు వడ్డీ రేట్లతో రుణాలు ఉన్నవి. మరిన్ని వివరాలకి ఆంధ్రప్రదేశ్ ప్రభత్వం 2024 బడ్జెట్ అనుబంధం ని తనిఖీ చేయండి. ఈ కధనం లోని అన్నీ వివరాలు రాష్ట్ర బడ్జెట్ మరియు దాని అనుబంధం లోనివి. సమగ్ర సమాచారం కోసం బడ్జెట్ ని తనిఖీ చేయండి.
- కేంద్ర ప్రభుత్వం ద్వారా 31 మార్చి 2023 కి 17,672.44 కోట్లు
- స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థల నుంచి 17,544.42 కోట్లు
- స్పెషల్ సెక్యూరిటీస్ NSSF కింద కేంద్ర ప్రభత్వం ద్వార 8,985.42 కోట్లు
- మొత్తం పబ్లిక్ డెట్ 3,09,623.26 కోట్లు
APPSC గ్రూప్ 2 మెయిన్స్ కోసం సన్నద్దమయ్యే అభ్యర్ధులు తప్పనిసరిగా ఈ వివరాలపై అవగాహన ఉండాలి గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష ని దృష్టి లో ఉంచుకుని సన్నద్దమైతే సులభంగా మెయిన్స్ లో విజయం సాధించవచ్చు.