Telugu govt jobs   »   Daily Quizzes   »   General Knowledge Quiz In Telugu

AP State GK MCQs Questions and Answers in Telugu ,13th June 2023 For APPSC Groups & AP Police

AP State GK MCQs Questions And Answers in Telugu: Practice Andhra Pradesh State Questions and answers Quiz in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. In this Section, you get the questions from Current Affairs Questions. Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

AP State GK MCQs Questions and Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రశ్నలు మరియు సమాధానాల క్విజ్‌ని తెలుగులో ప్రాక్టీస్ చేయండి, మీరు ఈ విభాగానికి బాగా ప్రిపేర్ అయితే, మీరు పరీక్షలో మంచి మార్కులు సాధించవచ్చు. ఈ విభాగంలో మీరు కరెంట్ అఫైర్స్ ప్రశ్నల నుండి ప్రశ్నలను పొందుతారు. జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగంలో అడిగే ప్రశ్నలు చాలా వరకు కరెంట్‌ అఫైర్స్‌ ఆధారంగా ఉంటాయి. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Adda247 Telugu
APPSC/TSPSC Sure shot Selection Group

General  Knowledge MCQs Questions And Answers in Telugu (తెలుగులో)

Q1. భారతదేశంలో జనాభాపరంగా అతి పెద్దదైన, అతి చిన్నదైన రాష్ట్రాలు వరుసగా?

  1. మహారాష్ట్ర మరియు కేరళా
  2. ఉత్తరప్రదేశ్ మరియు సిక్కిం
  3. ఆంధ్రప్రదేశ్ మరియు హర్యానా
  4. మధ్యప్రదేశ్ మరియు పంజాబ్

Q2. జనాభా లెక్కలు 2011 ప్రకారం క్రిందివానిలో ఏది సరికాదు?

  1. కేరళ రాష్ట్రం అత్యధిక అక్షరాస్యత కలిగి ఉన్నది
  2. డిల్లి అత్యధిక జన సాంద్రత కలిగి ఉంది
  3. రాష్ట్రాలలో సిక్కిం అతి తక్కువ జనసాంద్రత కలిగిన రాష్ట్రం
  4. విస్తీర్ణం దృష్ట్యా గోవా అతి చిన్న రాష్ట్రం

Q3.  “అందాల మాల“ సమీపంలోని  బంగాళాఖాతంలో కలిసే నది ఏది?

  1. గుండ్లకమ్మ
  2. స్వర్ణముఖి నది
  3. నాగులేరు
  4. పైవేవి కాదు

Q4. శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానం ఏ నదీ తీరాన ఉన్నది?

  1. గుండ్లకమ్మ
  2. స్వర్ణముఖి నది
  3. నాగులేరు
  4. పైవేవి కాదు

Q5. ఆంధ్రాలో వాణిజ్య ప్రాముఖ్యత గలదిగా ప్రసిద్ది చెందిన అతి పొడవైన కాలువ ఏది?

  1. కె. సి. కెనాల్
  2. బందరు కాలువ
  3. ఏలూరు కలువ
  4. బకింగ్ హాం కాలువ

Q6. కేంద్ర ఆర్ధిక సంఘం విశాఖపట్నం అభివృద్దికి ఎంత మొత్తం గ్రాంటును కేటాయించడానికి సిఫారసు చేసింది?

  1. రూ. 1400 కోట్లు
  2. రూ. 2300 కోట్లు
  3. రూ. 1210 కోట్లు
  4. పైవేవీ కాదు

Q7. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యధికంగా ఎగుమతి చేస్తున్న ఖనిజం ఏది?

  1. బొగ్గు
  2. ముడి చమురు
  3. మైకా
  4. బెరైటీస్

Q8. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్లో ఆంధ్రప్రదేశ్ నుండి మొత్తం ఎన్ని ప్రాజెక్టులను చేర్చడం జరిగింది?

  1. 503
  2. 105
  3. 612
  4. 413

Q9. క్రింది వానిలో సరైన దానికి ఎంచుకొనుము.

  1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం EBC నేస్తం పధకాన్ని ప్రారంభించినది.
  2. దీనికి 45 నుండి 60 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళలు అర్హులు
  3. బ్రాహ్మణ, వెలమ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, ముస్లిం ఇతర అగ్ర వర్ణ పేద మహిళలకు ఏటా రూ. 15,000 అందజేస్తారు.
  1. 1 మాత్రమే
  2. 2, 3 మాత్రమే
  3. 1, 2 మాత్రమే
  4. 1, 2, 3 మాత్రమే

Q10. YSR ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చురింగ్ క్లస్టర్ ను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు?

  1. వెలిగొండ
  2. వర రామచంద్రాపురం
  3. కొప్పర్తి
  4. వలసపాకల

Solutions:

S1. Ans(b)

Sol. భారతదేశంలో జనాభాపరంగా అతి పెద్దదైన, అతి చిన్నదైన రాష్ట్రాలు వరుసగా ఉత్తరప్రదేశ్ మరియు సిక్కిం.

S2. Ans(c)

Sol. జనాభా లెక్కలు 2011 ప్రకారం, కేరళ రాష్ట్రం అత్యధిక అక్షరాస్యత కలిగి ఉన్నది, డిల్లి అత్యధిక జన సాంద్రత కలిగి ఉంది, రాష్ట్రాలలో అరుణాచల్ ప్రదేశ్ అతి తక్కువ జనసాంద్రత కలిగిన రాష్ట్రం, విస్తీర్ణం దృష్ట్యా గోవా అతి చిన్న రాష్ట్రం.

S3.ANS.B)

Sol. స్వర్ణముఖి నది జిల్లాలోని చంద్రగిరి గుట్టల్లో జన్మించి నెల్లూరు జిల్లా ద్వారా ప్రవహిస్తూ , ఆ జిల్లాలోని అందాల మాల  సమీపంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. స్వర్ణముఖి నది దక్షిణ భారతదేశంలో ప్రవహించే ఒక నది. చిత్తూరు జిల్లాలో ప్రముఖ నది. ప్రముఖ శైవ క్షేత్రమయిన శ్రీకాళహస్తి ఈ నది ఒడ్డున నెలకొని ఉంది. తిరుపతి-చంద్రగిరి మధ్య తొండవాడ సమీప కొండప్రాంతం ఈ నది జన్మస్థానం. ధూర్జటి తన రచనల్లో దీన్ని మొగలేరు అని ప్రస్తావించాడు. ఈ నది ఒడ్డున శ్రీకాళహస్తీశ్వరాలయం, తొండవాడ వద్ద ఉన్న అగస్తేశ్వరాలయం, యోగి మల్లవరం వద్దనున్న పరాశరేశ్వరాలయం, గుడిమల్లం దగ్గరున్న పరశురామేశ్వరాలయం, గాజులమండ్యం దగ్గరున్న మూలస్థానేశ్వరాలయం ఉన్నాయి. ఇది జీవనది కాదు. సాధారణంగా అక్టోబరు నుంచి డిసెంబరు దాకా ప్రవహిస్తుంది

S4.Ans(B)

Sol. స్వర్ణముఖి నది దక్షిణ భారతదేశంలో ప్రవహించే ఒక నది. చిత్తూరు జిల్లాలో ప్రముఖ నది. ప్రముఖ శైవ క్షేత్రమయిన శ్రీకాళహస్తి

శ్రీకాళహస్తి ఆలయం అనే పేరుతో కాళహస్తీశ్వర స్వామి దైవంగా 5 వ శతాబ్దంలో స్వర్ణముఖి నది ఒడ్డున నిర్మించిన శివుడి ఆలయం. ఇది తిరుపతికి 36 కి.మీ (22 మైళ్లు). శ్రీకాళహస్తి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాలో ఒక పట్టణం, ఒక మండలం. ఈ పట్టణం స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున ఉంది. ఇది స్వర్ణముఖి నది తీరములో ఉన్న క్షేత్రము స్వర్ణముఖి ఇక్కడ పశ్చిమాభిముఖముగా ప్రవహించడం జరుగుతున్నది. చిన్నవాగులా పుట్టింది. ధూర్జటి తన రచనల్లో దీన్ని ‘మొగలేరు’ అని ప్రస్తావించాడు.స్వర్ణముఖి నదీ పరీవాహక ప్రాంతంలో పవిత్ర హిందూ పుణ్యక్షేత్రాలైన తిరుమల, శ్రీకాళహస్తీశ్వరాలయం.

S5. Ans(d)

Sol. ఆంధ్రాలో వాణిజ్య ప్రాముఖ్యత గలదిగా ప్రసిద్ది చెందిన అతి పొడవైన కాలువ బకింగ్ హాం కాలువ. బకింగ్‌హామ్ కెనాల్ 796 కిలోమీటర్లు (494.6 మైళ్ళు) పొడవైన మంచినీటి నావిగేషన్ కాలువ, ఇది ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ నగరం నుండి తమిళనాడులోని విలుప్పురం జిల్లా వరకు దక్షిణ భారతదేశంలోని కోరమాండల్ తీరానికి సమాంతరంగా ఉంటుంది. ఈ కాలువ తీరం వెంబడి ఉన్న చాలా సహజమైన వెనుక జలాలను చెన్నై (మద్రాస్) ఓడరేవుకు కలుపుతుంది. ఈ కాలువ బ్రిటీష్ పాలనలో నిర్మించబడింది మరియు పంతొమ్మిదవ శతాబ్దపు చివరిలో మరియు ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభంలో ఇది ఒక ముఖ్యమైన జలమార్గం.

S6. Ans(a)

Sol . విశాఖపట్నం అభివృద్దికి నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో 15 వ ఆర్ధిక సంఘం రూ. 1400 కోట్లు గ్రాంటును సిఫారసు చేసింది. కిడ్నీ సమస్యలు ఉన్న ఉద్దానం ప్రాంతానికి రూ.300 కోట్లు, ఫ్లోరిదే సమస్య తో సతమవుతున్న గుంటూరు జిల్లా పల్నాడు, ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రాంతాలకు కలిపి రూ. 400 కోట్లు, యురేనియం ఫిల్టరింగ్ తో ప్రభావితమైన పులివెందులకు రూ. 200 కోట్లు ఇవ్వాలని సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు.

S7. Ans(d)

Sol. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా బెరైటీస్ ఖనిజం ఉత్పత్తి అవుతుంది. అలాగే అత్యధికంగా ఎగుమతి చేసే ఖనిజం కూడా ఇదే.

S8. Ans(a)

Sol. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్లో ఆంధ్రప్రదేశ్ నుండి మొత్తం 16 రంగాలకు చెందిన మొత్తం 503 ప్రాజెక్టులు చేర్చడం జరిగింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలకు చెందిన మొత్తం 26,801 మెగావాట్ల సామర్ధ్యంతో 42 సోలార్ పార్కులు మంజూరు చేసారు. వీటిలో 5 ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయని విద్యుత్ శాఖ మంత్రి తెలిపారు.

S9. Ans(d)

Sol. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం EBC నేస్తం పధకాన్ని ప్రారంభించినది. దీనికి 45 నుండి 60 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళలు అర్హులు.  బ్రాహ్మణ, వెలమ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, ముస్లిం ఇతర అగ్ర వర్ణ పేద మహిళలకు ఏటా రూ. 15,000 అందజేస్తారు.

S10. Ans(c)

Sol. . YSR ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చురింగ్ క్లస్టర్ ను YSR జిల్లాలోని కొప్పర్తిలో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మొత్తం 540 ఎకరాలలో 748.76 కోట్ల పెట్టుబాడితో దీనిని అభివ్రుది చేయనున్నారు .Telangana Mega Pack (Validity 12 Months)

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

where can i found daily quizzes?

You can found different quizzes at adda 247 telugu website