Telugu govt jobs   »   Daily Quizzes   »   AP State GK MCQs Questions and...

AP State GK MCQs Questions and Answers in Telugu ,19th July 2023 For APPSC GROUP-2

AP State GK MCQs Questions And Answers in Telugu: Practice Andhra Pradesh State Questions and answers Quiz in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. In this Section, you get the questions from Current Affairs Questions. Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

AP State GK MCQs Questions and Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రశ్నలు మరియు సమాధానాల క్విజ్‌ని తెలుగులో ప్రాక్టీస్ చేయండి, మీరు ఈ విభాగానికి బాగా ప్రిపేర్ అయితే, మీరు పరీక్షలో మంచి మార్కులు సాధించవచ్చు. ఈ విభాగంలో మీరు కరెంట్ అఫైర్స్ ప్రశ్నల నుండి ప్రశ్నలను పొందుతారు. జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగంలో అడిగే ప్రశ్నలు చాలా వరకు కరెంట్‌ అఫైర్స్‌ ఆధారంగా ఉంటాయి. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Adda247 Telugu
APPSC/TSPSC Sure shot Selection Group

Andhra Pradesh State GK MCQs Questions And Answers in Telugu

AP State GK – ప్రశ్నలు తెలుగులో

Q1. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లోని ఏ పరిచ్ఛేదాన్ని పోలవరం ఆర్డినెన్స్ బిల్లుగా పేరు పడిన ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ సవరణ ఆర్డినెన్స్, 2014 సవరించింది?

  1. 1వ పరిచ్చేదం 
  2. 2వ పరిచ్ఛేదం 
  3. 3వ పరిచ్చేధం
  4. 4వ పరిచ్ఛేదం

Q2. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ప్రాంతంలో ఉన్న అతి ప్రాచీన విశ్వవిద్యాలయము ఏది?

  1. ఆంధ్ర విశ్వవిద్యాలయం 
  2. శ్రీ వెంకటేశ్వరా విశ్వవిద్యాలయం 
  3. శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం 
  4. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయము

Q3. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష చట్టమును మొదటి విడత ఎన్ని గ్రామాలలో ప్రారంభించడం జరిగింది?

  1. 5000
  2. 4600
  3. 5122
  4. 4899

Q4. వైఎస్సార్ భీమా పధకం క్రింద 2021-22 సంవత్సరానికి గాను ఎంత మొత్తం ప్రీమియంను ప్రభుత్వం విడుదల చేసింది?

  1. రూ. 650  కోట్లు .
  2. రూ. 750  కోట్లు .
  3. రూ. 700 కోట్లు .
  4. రూ. 720 కోట్లు.

Q5 . వైఎస్సార్ ఉచిత పంటల భీమా పధకం ఎప్పుడు ప్రారంభం అయ్యింది?

  1. 2020 జనవరి 26 
  2. 2020 ఆగష్టు 10 
  3. 2020 డిసెంబర్ 15 
  4. 2020 అక్టోబర్ 2

Q6. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలలో ఏర్పాటు చేసే ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ యొక్క నెంబర్ ఎంత?

  1. 155251
  2. 122522
  3. 111123
  4. 100101

Q7. వందేమాతరం ఉద్యమం సమయంలో బిపిన్ చంద్ర పాల్ యొక్క ఆంధ్ర రాష్ట్ర పర్యటనను ఎవరు నిర్వహించారు? 

  1. వావిలాల గోపాలక్రిష్ణయ్య
  2. కొండ వెంకటప్పయ్య 
  3. ముట్నూరి  కృష్ణ రావు 
  4. కాసింథూనీ నాగేశ్వర రావు.

Q8. 1934లో ఏర్పడిన ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ మొదటి అధ్యక్షుడు ఎవరు?

  1. ఎన్ జి రంగ 
  2. గరీమెల్ల సత్యనారాయణ 
  3. పాండురంగ్ మహాదేవ్ బాపట్ 
  4. కొండ వెంకటప్పయ్య.

Q9.  ఆంధ్రలో హోంరూల్‌  ఉద్యమ నాయకుడు ఎవరు ?

  1. అయ్యదేవర కాళేశ్వరరావు
  2.  గాడిచెర్ల  హరిసర్వోత్తమరావు
  3.  న్యాపతి సుబ్బారావు
  4. భీమశంకరరావు

Q10. ఆంధ్ర శివాజీగా పేరొందిన వ్యక్తి ఎవరు?

  1. కన్నెగంటి హనుమంతు
  2. ఉన్నవ లక్ష్మీనారాయణ
  3. పర్వతనేని వీరయ్య చౌదరి
  4. టంగుటూరి ప్రకాశం పంతులు

Solutions:

S1. Ans(c) 

Sol. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని 3 వ పరిచ్చేధనాన్ని పోలవరం అర్డినన్స్ బిల్లుగా పేరు బడిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ అర్డినన్స్ , 2014 గా సవరించినది. 

S2. Ans (a) 

Sol. ఆంధ్ర ప్రాంతంలో ఉన్న అతి ప్రాచీన విశ్వ విద్యాలయం ఆంధ్రా విశ్వవిద్యాలయము. దీనిని 1926 వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. 

S3. Ans(c)

Sol. భూ వివాదాల్ అపరిష్కారం, ప్రజల ఆస్తులకు భరోసా కలిపించాలి అనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా జిల్లా జగయ్య పేట మండలం తక్కేల్లపాడులో ఈ పధకాన్ని 2020 డిసెంబర్ 21 న  CM ప్రారంభించారు. 2023 నాటికి రాష్ట్రము అంతా సర్వే పూర్తయ్యే విధంగా మొదటి విడతలో 5,122 గ్రామాలలో , రెండవ విడత 6000 గ్రామాలలోను , మూడవ విడతలో మిగిలిన గ్రామాలలో సర్వే పూర్తీ చేయనున్నారు. 

S4. Ans(b) 

Sol. వైఎస్సార్ భీమా పధకం క్రింద 2020 -21 గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ. 750కోట్ల రూపాయల ప్రీమియం చెల్లించడం జరిగింది. కేంద్రం 2020 ఏప్రిల్ 1 నుండి ఈ పధం నుండి తప్పుకోవడం వల్ల, రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఈ బాధ్యతను తీసుకోవడం జరిగింది. దీని క్రింద 18నుండి 70 సంవత్సరాలు ఉన్న  మొత్తం 1. 32 కోట్ల ప్రజలకు ప్రయోజనం చేకూరనున్నది. ఈ పధకం తొలుత 2020 , అక్టోబర్ 2 న ప్రారంభం అయ్యింది.  

S5. Ans(c)

Sol. వైఎస్సార్ ఉచిత పంటల భీమా పధకమును 2020 డిసెంబర్ 15 న సియం జగన్ ప్రారంభించారు. అతి వృష్టి , అనావృష్టి కారణంగా పంటను కోల్పోయిన మొత్తం 9,48 లక్షల మంది రైతులకు 2019 గాను మొత్తం రూ. 1252 కోట్ల రూపాయల భీమా పరిహారం చెల్లించడం జరిగింది. 

S6. Ans (a)

Sol. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను 2020 మే 30 న క్యాంపు కార్యాలయం నుండి ప్రారంభించారు. మొత్తం ఒకే సారి 10, 641 రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించారు. దీని టోల్ free నెంబర్ 155251. వీటి ద్వారా మొత్తం 15 రకాల మౌలిక సదుపాయలు రైతులు అందుకోనున్నారు. 

S7. Ans (c) 

Sol. వందేమాతర ఉద్యమాన్ని ఆంధ్రలో ప్రచారం చేయడానికి బిపిన్చంద్రపాల్‌ వచ్చారు. ఈ పర్యటన ఏర్పాటు చేసింది ముట్నూరు కృష్ణారావు. 1907 ఏప్రిల్‌లో పాల్‌ విజయనగరం, విశాఖపట్నంప్రాంతాల్లో ప్రసంగించారు.

S8. Ans (a)

Sol.  1934 జూన్‌ 22న విజయవాడలో నాయకులనేని గోగినేని రంగా ఆంధ్ర సోషలిస్ట్‌ పార్టీని స్థాపించారు.

S9.Ans (b)

Sol. సెప్టెంబరులో మద్రాస్‌లోని గోఖలే హాలులో హోంరూల్‌ లిగ్‌ను స్థాపించారు. హోంరూల్‌ భావనను ఐర్లాండ్‌ నుంచి గ్రహించారు. ఆంధ్రలో గాడిచెర్ల హరిసర్వోత్తమరావు ఉద్యమ నాయకుడు. 52 హోంరూల్‌లిగ్‌ శాఖలు ఆంధ్రలో ఏర్పడ్డాయి.  3 పైసల కరపత్రాలు ప్రచురించారు. స్వరాజ్య ఉద్దేశం,స్వతంత్ర వర్ధన పత్రం, స్వరాజ్యం కోరడానికి కారణాలు లాంటి కరపత్రాలు ప్రచురించారు.

S10. Ans (c)

Sol.  పెదనందిపాడు పన్నుల సహాయ నిరాకరణ ఉద్యమం ఆంధ్ర శివాజీగా పేరొందిన పర్వతనేని వీరయ్య చౌదరి నాయకత్వంలో జరిగింది. ఈయన శాంతిసేన వాలంటీర్‌ దళాన్ని ఏర్పాటు చేశారు. ఇంగ్లండ్‌ పార్లమెంట్‌లో కూడా ఈ ఉద్యమం చర్చకు వచ్చింది.

"VISION" APPSC Group-1 Prelims Officers Batch | Telugu | Online Live Interactive Classes From Adda247

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

where can i found daily quizzes?

You can found different quizzes at adda 247 telugu website