AP State GK Mega Quiz Questions And Answers in Telugu: AP State GK is one of the most important scoring subjects for all AP State level exams like APPSC Group 1,2,3, and 4 APPSC Endowment Officers etc. In this article we are providing AP state GK Mega Quiz Questions and answers, these Mega Quiz questions and answers will definitely helps in your success.
AP రాష్ట్ర GK Mega Quiz ప్రశ్నలు మరియు సమాధానాలు తెలుగులో: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
APPSC/TSPSC Sure shot Selection Group
AP State GK Mega Quiz Questions And Answers in Telugu
AP State GK Questions -ప్రశ్నలు
Q1. హార్స్ లీ కొండలు ఏ జిల్లలో ఉన్నాయి?
- కడప
- అనంతపూర్
- చిత్తూరు
- కర్నూలు
Q2. నల్లమల కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి?
- కర్నూలు
- ప్రకాశం
- కడప
- చిత్తూరు
Q3. ఆంధ్రప్రదేశ్ తీరంలో కొడవలిఆకారపు స్పిట్ ఎక్కడ ఉంది?
- కాకినాడ తీరం
- విశాఖ తీరం
- రాజమండ్రి తీరం
- మచిలీ పట్నం
Q4. తూర్పుకనుమలు ఏ రకమైన శిలలతో ఏర్పడినవి?
- చార్నోకైట్
- ఆర్కియన్ నీస్
- ఖండోలైట్
- (a) మరియు (c)
Q5. పులికాట్ సరస్సు ఏ జిల్లాలో ఉన్నది ?
- పశ్చిమ గోదావరి
- ప్రకాశం
- నెల్లూరు
- కృష్ణ
Q6. సహకార రంగంలో తొలి మహిళా బ్యాంకు ఎక్కడ ప్రారంభం అయింది?
- గుంటూరు
- విజయనగరం
- రాజమండ్రి
- ఏది కాదు
Q7. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో బాగంగా రాష్ట్రం ఏ విభాగాలలో వృద్ది సాధించింది?
- ఉపాధి పనుల కల్పనలో
- ధాన్యం ఉత్పత్తిలో
- ప్రజారోగ్యం
- పైవన్నీ
Q8. E – పంట నమోదు కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంబించినది?
- ఆంధ్రప్రదేశ్
- హర్యానా
- మధ్యప్రదేశ్
- పంజాబ్
Q9. కృష్ణ ,గోదావరి డెల్టాల మధ్య గల పల్లపు ప్రాంతాలలో ఏర్పడిన సరస్సు ఏది?
- పులికాట్ సరస్సు
- చిల్కా సరస్సు
- కొల్లేరు సరస్సు
- సాంబార్ సరస్సు
Q10. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం ఎన్ని రైతు బరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినది?
- 10412
- 10641
- 10000
- 12000
Q11. ఆంధ్రప్రదేశ్ నుండి రంసార్ ఒప్పంధలో బాగంగా చేర్చిన చిత్తడి ప్రాంతం?
- కోరింగ
- పులికాట్
- అనంతసాగరం
- కొల్లేరు
Q12. కడప-నెల్లూరు జిల్లా సరిహద్దులలో తూర్పుకనుమలను ఏమని పిలుస్తారు?
- ఎర్రమల
- వేలికొండలు
- రాపూరాల కొండలు
- పెంచల కొండలు
Q13 . విశాఖ రేవును సముద్ర అలల తాకిడి నుండి సహజ రక్షణగా కాపాడేది?
- పాపి కొండలు
- రుషి కొండలు
- డాల్ఫిన్ నోస్
- దూమకొండలు
Q14. కృష్ణ ,గోదావరి డెల్టాల మధ్య గల పల్లపు ప్రాంతాలలో ఏర్పడిన సరస్సు?
- పులికాట్ సరస్సు
- చిల్కా సరస్సు
- కొల్లేరు సరస్సు
- సాంబార్ సరస్సు
Q15. తూర్పు కనుమలలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది?
- జిందగడ
- అరోమా
- మహీంద్ర గిరి
- డాల్ఫిన్ నోస్
Q16. ఒండ్రు నేలలు ఎక్కువగా విస్తరించి ఉన్న జిల్లాలు ఏవి?
- ఉభయగోదావరి జిల్లాలు
- కృష్ణ
- గుంటూరు
- అన్ని
Q17. ఒండ్రు నేలలలో ఏ ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి?
- సున్నము మరియు పొటాషియం
- మాంగనీస్
- పాస్ఫరస్
- ఏది కాదు
Q18. నల్లరేగడి మృత్తికలలో ఎక్కువగా పండే పంట?
- మొక్కజొన్న
- రాగులు
- చిరుధాన్యాలు
- పత్తి
Q19. పప్పు దినుసులు మరియు నూనెగింజలు పంటలకు అత్యంత అనుకూలమైన నేలలు?
- ఎర్ర నేలలు
- నల్లరేగడి
- ఒండ్రు నేలలు
- లేటరైట్
Q20. గ్రానైట్ శిలల సైతిల్యం వలన ఏర్పడే నేలలు ఏవి?
- ఎర్ర నేలలు
- నల్లరేగడి నేలలు
- ఒండ్రు నేలలు
- ఏది కాదు
Q21. బసాల్ట్ శిలల సైతిల్యం వలన ఏర్పడే నేలలు ఏవి?
- ఎర్ర నేలలు
- నల్లరేగడి నేలలు
- ఒండ్రు నేలలు
- ఏది కాదు
Q22. తోటల పెంపకానికి అనుకూలమైన నేలలు ఏవి ?
- ఎర్ర నేలలు
- నల్లరేగడి నేలలు
- ఒండ్రు నేలలు
- లేటరైట్
Q23. నదుల ద్వారా కొట్టుకు వచ్చిన ఇసుక, ఒండ్రుమట్టి , ద్వారా ఏ రకం మృతికలు ఏర్పడతాయి?
- జేగురు
- ఒండ్రు
- ఇసుక
- తీరప్రాంత
Q24. నీటిని గ్రహించి ఎక్కువ కాలం నీటిని నిల్వ ఉంచుకొనే సామర్ధ్యం గల మృతికలు ఏవి?
- ఒండ్రు
- నల్లరేగడి
- ఎర్రనేలలు
- ఏది కాదు
Q25. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళకుండా ప్రభుత్వంతో సంకర్షణకు , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ప్రజలకు, ఒక ప్రతేక పబ్లిక్, ప్రైవేటు రంగాలు కలిసిన, అవకాసం కల్పించినది, అది ఈ క్రింది వాటిలో ఏది?
- నవజీవన్ (A.P).
- ప్రజావాణి (A.P).
- నూతన్ (A.P).
- పైవేవి కావు.
Q26. నూతన ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా ఈ వనరులపై ఆధారపడవల్సి ఉంది?
- బొగ్గు .
- తీర వనరులు .
- చమురు మరియు వాయువు .
- పైవేవీ కాదు.
Q27. స్థల విస్తీర్ణత పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నవ స్థానంలో ఉంది?
- 7 వ
- 8 వ
- 9 వ
- 6 వ
Q28. పులిచింతల ప్రాజెక్ట్ ఏ నది పై ఉంది?
- గోదావరి
- కృష్ణ నది
- తుంగ భద్ర
- పెన్నార్ నది
Q29. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో ఏర్పాటు చేయాలనుకున్న “ఆంధ్రప్రదేశ్ మత్స్య మరియు సముద్ర విశ్వ విద్యాలయాన్ని “ ఎక్కడ ఏర్పాటు చెయ్యబోతున్నారు?
- భీమవరం, కర్నూలు జిల్లా
- భీమవరం , పశ్చిమగోదావరి జిల్లా
- లింగ సముద్రం, ప్రకాశం జిల్లా
- బనవాసి, కర్నూలు జిల్లా
Q30. 1960-70 దశకాల మధ్య పంచాయతి రాజ్ సంస్థల క్షీణతకు గల కారణం ఏమిటి?
- సామాజిక, ఆర్ధిక ప్రాబల్యం కలిగిన సమూహాల ఆధిపత్యం
- గ్రామాలలో అక్షరాస్యులు లేకపోవడం
- నిధులు సరిగా అందకపోవడం
- ఈ సంస్థల పట్ల రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు విశ్వాసం లేకపోవడం
AP State GK Solutions: సమాధానాలు
S1.Ans.(c)
హార్స్ లీ కొండలు చిత్తూరు జిల్లలో ఉన్నాయి
S2.Ans.(a)
నల్లమల కొండలు కర్నూలు జిల్లాలో ఉన్నాయి
S3.Ans.(c)
ఆంధ్రప్రదేశ్ తీరంలో కొడవలిఆకారపు స్పిట్ రాజమండ్రి తీరం ఉంది.
also read: తెలంగాణ జిల్లాల సమాచారం
S4.Ans.(d)
తూర్పుకనుమలు చార్నోకైట్ మరియు ఖండోలైట్ రకమైన శిలలతో ఏర్పడినవి
S5.Ans.(c)
పులికాట్ సరస్సు నెల్లూరు జిల్లాలో ఉన్నది
S6.Ans.(a)
Sol. సహకార రంగంలో తొలిసారిగా మహిళా బ్యాంకు ఏర్పాటైంది . గుంటూరు రూరల్ మండల చల్లవారిపాలెంలో సహకార బ్యాంకు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో ఏర్పడినది.
S7.Ans.(d)
Sol. ఉపాధి పనులు కల్పనలో , ధాన్యం ఉత్పత్తిలో , ప్రజారోగ్యం లో రాష్ట్రం ఎంతో పురోగతి సాధించింది.
S8.Ans.(a)
E – పంట నమోదు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రారంబించినది
S9.Ans.(c)
కృష్ణ ,గోదావరి డెల్టాల మధ్య గల పల్లపు ప్రాంతాలలో ఏర్పడిన సరస్సు కొల్లేరు సరస్సు
S10.Ans.(b)
Sol. రాష్ట్రంలో మొత్తం పదమూడు జిల్లాలో , 670 మండలాలలో 10641 వై ఎస్ ఆర్ రైతుభరోసా కేంద్రాలలో పంట నమోదు చేసుకొనే అవకాసం కల్పించారు.
Also read: తెలంగాణా SI పరీక్షా విధానం
S11.Ans.(d)
ఆంధ్రప్రదేశ్ నుండి రంసార్ ఒప్పంధలో బాగంగా చేర్చిన చిత్తడి ప్రాంతం కొల్లేరు
S12.Ans.(b)
కడప-నెల్లూరు జిల్లా సరిహద్దులలో తూర్పుకనుమలను వేలికొండలు పిలుస్తారు
S13.Ans.(c)
విశాఖ రేవును సముద్ర అలల తాకిడి నుండి సహజ రక్షణగా కాపాడేది డాల్ఫిన్ నోస్
S14.Ans.(c)
కృష్ణ ,గోదావరి డెల్టాల మధ్య గల పల్లపు ప్రాంతాలలో ఏర్పడిన సరస్సు కొల్లేరు సరస్సు
S15.Ans.(a)
తూర్పు కనుమలలో అత్యంత ఎత్తైన శిఖరం జిందగడ.
S16.Ans.(d)
ఒండ్రు నేలలు ఎక్కువగా విస్తరించి ఉన్న జిల్లాలు ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణ , గుంటూరు.
S17.Ans.(a)
ఒండ్రు నేలలలో సున్నము మరియు పొటాషియం ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి
S18.Ans.(d)
నల్లరేగడి మృత్తికలలో ఎక్కువగా పండే పంట ప్రత్తి.
S19.Ans.(a)
పప్పు దినుసులు మరియు నూనెగింజలు పంటలకు అత్యంత అనుకూలమైన నేలలు ఎర్ర నేలలు .
Also Read: తెలంగాణా జానపద నృత్యాలు
S20.Ans.(a)
గ్రానైట్ శిలల సైతిల్యం వలన ఏర్పడే నేలలు ఎర్ర నేలలు
S21.Ans.(b)
బసాల్ట్ శిలల సైతిల్యం వలన ఏర్పడే నేలలు నల్ల రేగడి నేలలు.
S22.Ans.(d)
తోటల పెంపకానికి అనుకూలమైన నేలలు లేటరైట్ నేలలు.
S23.Ans.(b)
నదుల ద్వారా కొట్టుకు వచ్చిన ఇసుక, ఒండ్రుమట్టి , ద్వారా ఒండ్రు రకం మృతికలు ఏర్పడతాయి
S24.Ans.(b)
నీటిని గ్రహించి ఎక్కువ కాలం నీటిని నిల్వ ఉంచుకొనే సామర్ధ్యం గల మృతికలు నల్లరేగడి మృతికలు.
S25.Ans.(b)
Sol. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళకుండా ప్రభుత్వంతో సంకర్షణకు , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ప్రజలకు, ఒక ప్రతేక పబ్లిక్, ప్రైవేటు రంగాలు కలిసిన, అవకాసం కల్పించినది ప్రజావాణీ (అంధ్రప్రదేశ్).
S26.Ans.(a)
Sol. నూతన ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా బొగ్గు పై ఆధారపడవలసి ఉన్నది.
S27.Ans.(a)
Sol. స్థల విస్తీర్ణం ఆధారంగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 7 వ స్థానంలో ఉన్నది.
Also Read: Sustainable Development Goals Report 2021
S28.Ans.(b)
Sol. పులిచింతల ప్రాజెక్ట్ కృష్ణా నది మీద నిర్మించబడి ఉన్నది.
S29.Ans.(b)
Sol. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో ఏర్పాటు చేయాలనుకున్న “ఆంధ్రప్రదేశ్ మత్స్య మరియు సముద్ర విశ్వ విద్యాలయాన్ని భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటుచేయడం జరుగుతుంది.
S30.Ans.(a)
Sol. 1960-70 దశకాల మధ్య పంచాయతి రాజ్ సంస్థల క్షీణతకు కారణం సామాజిక, ఆర్ధిక ప్రాబల్యం కలిగిన సమూహాల ఆధిపత్యం