Telugu govt jobs   »   Current Affairs   »   AP Tops in Social Expenditure

AP Tops in Social Expenditure | సామాజిక వ్యయంలో ఏపీ అగ్రస్థానంలో ఉంది

AP Tops in Social Expenditure | సామాజిక వ్యయంలో ఏపీ అగ్రస్థానంలో ఉంది

(కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్)CAG గణాంకాల ప్రకారం సామాజిక వ్యయంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు వివిధ రాష్ట్రాల చేసిన వ్యయాలలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా గుజరాత్ రెండవ స్థానంలో, కేరళ మూడవ స్థానం, తమిళనాడు నాలుగోవ స్థానం మరియు తెలంగాణ ఐదవ స్థానంలో నిలిచాయి.

సామాజిక వ్యయం అంటే ఏమిటి?

సామాజిక వ్యయం లేదా సామాజిక రంగా వ్యయం అనగా ఒక రాష్ట్రం విద్య, వైద్య,  పౌష్టికాహారం, మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, గ్రామీణాభివృద్ది మరియు పట్టణాభివృద్ది పై చేసిన ఖర్చు.

బడ్జెట్ ప్రతిపాదించిన తొలి ఆరు నెలల్లో 55.71% నిధులు వీటి పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది అని CAG తెలిపింది. ఈ వ్యయం తో మానవ వనరులు అభివృద్ధి తో పాటు ప్రజల జీవన అవసరాలు, మౌలిక సదుపాయాలు కూడా కలిపించారు. గుజరాత్ 42.83% నిధులు ఖర్చుపెట్టింది.

ఆస్తుల కల్పన

తెలంగాణ ప్రభుత్వం ఆస్తుల కల్పన కోసం మూలధన వ్యయాన్ని బడ్జెట్ లో కేటాయించిన దాంట్లో మొదటి ఆరు నెలలోనే 60.86% ఖర్చు పెట్టి మొదటి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 53.37% ఖర్చు పెట్టి రెండవ స్థానంలో నిలిచింది . కేరళ, తమిళనాడు, గుజరాత్, కర్ణాట తర్వాతి స్థానాలలో నిలిచాయి.

Read More:
తెలుగులో వారపు కరెంట్ అఫైర్స్ 2023 నెలవారీ కరెంట్ అఫైర్స్ 2023 తెలుగులో 
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2023 స్టడీ మెటీరియల్

pdpCourseImg

 

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!