AP విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్ల ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. AP విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్ల ఆన్లైన్ దరఖాస్తు పక్రియ 31 అక్టోబర్ 2023 న ప్రారంభమైనది మరియు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 20 నవంబర్ 2023 అనగా ఈరోజే చివరి తేదీ. అభ్యర్థుల recruitments.universities.ap.gov.in వెబ్ సైటు నుండి దరఖాస్తులు సమర్పించవలెను. AP విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్ల పోస్టులకు దరఖాస్తు చేయడానికి లింక్ ఈ కధనంలో అందించాము.
APPSC/TSPSC Sure shot Selection Group
AP విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్ల ఆన్లైన్ దరఖాస్తు అవలోకనం
AP విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్ల ఆన్లైన్ దరఖాస్తు పక్రియ 31 అక్టోబర్ 2023 నుండి 20 నవంబర్ 2023 వరకు అందుబాటులో ఉంటుంది. AP విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్ల ఆన్లైన్ దరఖాస్తు అవలోకనం దిగువ పట్టికలో అందించాము.
APPSC యూనివర్సిటీ ప్రొఫెసర్ పోస్టుల దరఖాస్తు 2023 అవలోకనం | |
సంస్థ | ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ |
పోస్ట్ | ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ |
ఖాళీలు | 3,220 |
నోటిఫికేషన్ విడుదల | 30 అక్టోబర్ 2023 |
ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ | 31 అక్టోబర్ 2023 |
ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి మరియు పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ & సమయం | 20 నవంబరు 2023 5:00 PM |
పోస్ట్/కొరియర్ ద్వారా అన్ని ఎన్‌క్లోజర్‌లతో పాటు అప్లికేషన్ హార్డ్‌కాపీని స్వీకరించడానికి చివరి తేదీ & సమయం | 27 నవంబరు 2023 5:00 PM |
పరీక్షా విధానం | ఆన్ లైన్ |
అధికారిక వెబ్సైట్ | psc.ap.gov.in |
AP విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు లింక్
AP విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు పక్రియ ప్రారంభమైనది. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్ధులు 31 అక్టోబర్ 2023 నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ 20 నవంబర్ 2023 సాయంత్రం 05:00 గంటలు. ఆన్ లైన్ దరఖాస్తు సమర్పించిన తరువాత సంబంధిత డాక్యుమెంట్‌లతో పాటు దరఖాస్తు యొక్క హార్డ్‌కాపీని 27 నవంబర్ 2023 సాయంత్రం 05:00 గంటలు లోపు సమర్పించాలి. అభ్యర్థులు దిగువ ఇచ్చిన లింక్ నుండి తమ దరఖాస్తు లను సమర్పించవచ్చు.
దరఖాస్తు చేసుకునే ముందు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు :
- అధికారిక వెబ్‌సైట్ recruitments.universities.ap.gov.inలో నమోదు తప్పనిసరి.
- అభ్యర్థులు ఏదైనా విశ్వవిద్యాలయం లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు/అసిస్టెంట్ లైబ్రేరియన్/అసిస్టెంట్ డైరెక్టర్/అసోసియేట్ ప్రొఫెసర్లు/డిప్యూటీ లైబ్రేరియన్/డిప్యూటీ డైరెక్టర్/ప్రొఫెసర్లు/లైబ్రేరియన్/డైరెక్టర్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఒక్కసారి మాత్రమే నమోదు చేసుకోవాలి.
- ఒక దరఖాస్తుదారు కోసం బహుళ వినియోగదారు IDలు నిషేధించబడ్డాయి.
- మరిన్నిపోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అదే రిజిస్ట్రేషన్/లాగిన్ ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలి. వారు ప్రతి పరీక్షకు ప్రత్యేక రుసుము చెల్లించాలి
AP విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్ పోస్టుల ఆన్లైన్ దరఖాస్తు లింక్
AP విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్ల పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?
- అభ్యర్ధులు ఆన్‌లైన్https://recruitments.universities.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి
- అభ్యర్థి ముందుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.
- అభ్యర్థి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTPని అందుకుంటారు, రిజిస్ట్రేషన్ పూర్తి చేయడానికి అతను/ఆమె రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను పూరించాలి.
- అభ్యర్థి నమోదు ధృవీకరించబడిన తర్వాత, అభ్యర్థి ఆధారాలను ఉపయోగించి అప్లికేషన్ పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి మరియు విద్యార్హతలు, అనుభవం, విద్యా/పరిశోధన వివరాలు మొదలైన అన్ని అవసరమైన సమాచారాన్ని పూరించి, సమర్పించాలి.
- అభ్యర్థులు విజయవంతంగా సమర్పించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రింట్ అవుట్ తీసుకొని, రిజిస్టర్డ్ పోస్ట్/ కొరియర్/ స్పీడ్ పోస్ట్ ద్వారా అభ్యర్థి ఎంపిక చేసిన సంబంధిత విశ్వవిద్యాలయాలకు క్లెయిమ్ చేసిన ధ్రువపత్రాలకు మద్దతుగా స్వీయ ధృవీకరించిన సర్టిఫికెట్లు మరియు ఇతర డాక్యుమెంట్ల యొక్క స్వీయ ధృవీకరించిన హార్డ్ కాపీలను 27 నవంబర్ 2023 తేదీలోగా సమర్పించాలి.
- దరఖాస్తుల హార్డ్ కాపీని సపోర్టింగ్ డాక్యుమెంట్లతో పాటు విశ్వవిద్యాలయాలకు సమర్పించడం తప్పనిసరి. దరఖాస్తుదారులు పోస్టల్ జాప్యాలు లేదా ఏవైనా ఇతర ఊహించని సమస్యలను నివారించడానికి, చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే సమర్పించాలని సూచించారు.
APPSC యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ 2023 పరీక్ష తేదీ
AP యూనివర్సిటీలు ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు రుసుము
- అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అన్‌రిజర్వ్డ్/ BC/ EWS వర్గం వారు రూ.2500/- చెల్లించాలి
- ఎస్సీ, ఎస్టీ, పీబీడీలు :రూ.2 వేలు చెల్లించాలి
- ప్రవాస భారతీయులైతే 50 డాలర్లు/రూ.4.200 ఆన్లైన్ దరఖాస్తుతో పాటు ఫీజు చెల్లిం చాల్సి ఉంటుంది.
- ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ టి విభాగాల్లో రాయాలనుకుంటే మాత్రం విడివిడిగా ఫీజులు చెల్లించాలి.
- ఇక ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు అన్ని కేటగిరీల అభ్యర్థులు రూ.3 వేలు, ప్రవాస భారతీయులైతే ప్రొఫెసర్ పోస్టుకు 150 డాలర్లు/రూ.12,600, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు 100 డాలర్లు/రూ.8,400 దరఖాస్తు రుసుము చెల్లించాలి.
వర్గం | రుసుము |
అన్‌రిజర్వ్డ్/ BC/ EWS | రూ.2500/- |
SC/ ST/ PBDలు | రూ.2000/- |
ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (OCIలు) | USD 50 సమానమైన మొత్తం రూపాయిలలో చెల్లించాలి (అంటే, రూ.4200/-) |
AP విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్ నోటిఫికేషన్ 2023
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |