Telugu govt jobs   »   Article   »   APPSC, DSc మరియు కేంద్ర పోటీ పరీక్షల...

APPSC, DSc and central govt exam dates overlap | APPSC, DSc మరియు కేంద్ర పోటీ పరీక్షల తేదీలు మారనున్నాయా?

ప్రభుత్వ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్ధులు ప్రస్తుతం ఉన్న పరీక్ష తేదీలను చూసి ఆందోళన చెందుతున్నారు. అవును నిజమే ఎందుకంటే దేశ వ్యాప్తంగా చాలా మంది అభ్యర్ధులు గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగాలను సాదించాలి అనే కోరికతో చదవుతూ ఉన్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వ మరియు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ప్రస్తుతం ఉన్న పరీక్ష తేదీలు చూసి టెన్షన్‌ మొదలైనది. ఎందుకంటే, కేంద్ర ప్రభుత్వ మరియు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్ష తేదీలు ఒకే రోజున జరగనున్నాయి, ఈ నేపథ్యంలో ఒకటి కంటే ఎక్కువ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇప్పటికే ఏ పరీక్ష రాయాలో, ఏ పరీక్షకు సన్నద్ధమవ్వాలో తెలియక సందిగ్ధంలో ఉన్నారు. పరీక్ష తేదీల్లో మార్పు చేయాలని కొందరు అభ్యర్థన చేస్తున్నారు. మరి ప్రభుత్వాలు కలుగజేసుకుని APPSC, DSc మరియు కేంద్ర పోటీ పరీక్షల తేదీలు మారస్తారా? లేదా అనేది అర్దం కానీ ప్రశ్న.

APPSC, DSc మరియు కేంద్ర పోటీ పరీక్షల తేదీలు మారనున్నాయా?

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో తక్కువ ఖాళీలతో ప్రకటనలు వెలువడిన నోటిఫికేషన్ లకు విస్తారమైన సిలబస్‌, పరీక్ష సమయం తక్కువ ఉండటంతో అభ్యర్ధులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో  వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న 1,423 ఉద్యోగాల భర్తీకి ఇటీవల APPSC ఏడు ఉద్యోగ ప్రకటనలు జారీచేసిన సంగతి తెలిసిందే. APPSC  గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ పరీక్ష ఫిబ్రవరి 25, 2024 న, APPSC గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష  మార్చి 17, 2024  జరుగనుంది. SSC GD కానిస్టేబుల్‌ పరీక్షలు ఫిబ్రవరి 20 నుంచి మార్చి 12 వరకు జరుగనున్నాయి. AP TET పరీక్షలు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు మరియు AP డీఎస్సీ పరీక్షలు మార్చి 15 నుంచి 30 వరకు జరుగుతాయి. ఎక్కువ సిలబస్‌ కారణంగా APPSC  గ్రూప్స్‌, AP డీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న 19 రోజుల్లో AP TET, 36 రోజుల్లో DSc  ఎలా నిర్వహిస్తారని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.

TSPSC ఫిజికల్ డైరెక్టర్ హాల్ టికెట్ 2023, డైరెక్ట్ డౌన్‌లోడ్ లింక్_40.1APPSC/TSPSC Sure shot Selection Group

APPSC, DSc మరియు కేంద్ర పోటీ పరీక్షల తేదీలు

కేంద్ర ప్రభుత్వ మరియు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్ష తేదీలు ఇక్కడ పట్టికలో చూడవచ్చు.

APPSC, DSc మరియు కేంద్ర పోటీ పరీక్షల తేదీలు
నోటిఫికేషన్లు పోస్టులు రాత పరీక్ష తేది
APPSC గ్రూప్‌-2 897 ఫిబ్రవరి 25 (ప్రిలిమ్స్‌)
APPSC గ్రూప్‌-1 సర్వీసు 81 మార్చి 17 (ప్రిలిమ్స్‌)
SSC GD కానిస్టేబుల్‌ 26146 ఫిబ్రవరి 20 – మార్చి 12
AP TET 2024  –  ఫిబ్రవరి 27 – మార్చి 9
AP DSC 6,100 మార్చి 15 –  మార్చి 30
APPSC పాలిటెక్నిక్‌ లెక్చరర్లు 99 ఏప్రిల్/ మే
APPSC DyEO 38 ఏప్రిల్‌ 13 (ప్రిలిమ్స్‌)
AEE ఇంజినీర్ 21 ఏప్రిల్/ మే
APPSC జూనియర్‌ లెక్చరర్లు 47 ఏప్రిల్/ మే
APPSC డిగ్రీ లెక్చరర్లు 240 ఏప్రిల్/ మే

AP Geography eBook for APPSC GROUP-1, GROUP-2, AP Grama Sachivalayam, JL, DL, DEO and other APPSC Exams By Adda247.

 

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!