Telugu govt jobs   »   Article   »   APPSC పరీక్షలలో నూతన విధానాలు
Top Performing

APPSC Exercise on New Procedures in Conducting Exams | APPSC పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో కొత్త విధానాలపై కసరత్తు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్(APPSC) నిర్వహించే పరీక్షలు, ప్రశ్న పత్రాల మూల్యాంకనం, అభ్యర్థుల ఎంపిక విధానాన్ని శాస్త్రీయంగా, మరింత సమర్థంగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ చైర్మన్ గౌతం సవాంగ్ తెలిపారు. అభ్యర్థుల వాస్తవిక నైపుణ్యాన్ని అంచనా వేసి పూర్తి సమర్థులైన వారిని ఎంపిక చేసేలా కొత్త విధానాలకు రూపకల్పన చేస్తున్నామని చెప్పారు. APPSC పరీక్షల నిర్వహణ,మూల్యాంకనంలో కొత్త విధానాలపై కసరత్తు గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో చదవండి.

APPSC పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో నూతన విధానాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో అవసరమైన మార్పులపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉన్నతాధికారులతో ఒక కమిటీ నియమించిందని కమిషన్ చైర్మన్ గౌతం సవాంగ్ తెలిపారు. దానికి అనుబంధంగా APPSC లో అంతర్గతంగా రెండు కమిటీలు ఏర్పాటు చేశారు. నియామక విధానాలపై APPSC సభ్యుడు సలాం బాబు నేతృత్వంలో అపార నైపుణ్యం ఉన్న ఐదుగురితో ఒక కమిటీ, వివిధ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న సీనియర్ ప్రొఫెసర్లతో మరో కమిటీ నియమించినట్లు వివరించారు. దీంతోపాటు వివిధ రంగాలకు చెందిన మేధావుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఉన్న పరీక్ష విధానాలపై అభ్యర్థులు, తల్లిదండ్రులు, సమాజంలోని పలువురి నుంచి రకరకాల అభ్యంతరాలు వస్తున్నాయని, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, వీటన్నింటికి పరిష్కారం చూపేలా సరికొత్త విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాము నియమించిన కమిటీలు వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న నియామక విధానాలు, ఉత్తమ ప్రాక్టీసులను అధ్యయనం చేసి ఒక నివేదిక ఇస్తాయని చెప్పారు. IIM వంటి అత్యుత్తమ సంస్థల ప్రొఫెసర్ల నుంచి సైతం అభిప్రాయాలు సేకరిస్తున్నామని కమిషన్ చైర్మన్ గౌతం సవాంగ్ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.

SBI అప్రెంటీస్ సిలబస్ మరియు పరీక్షా సరళి 2023 పూర్తి వివరాలు_70.1

APPSC/TSPSC Sure shot Selection Group

నూతన విధానంలో జరగబోయే మార్పులు ఏమిటి?

  • ప్రస్తుతం APPSC గ్రూప్-1 ప్రిలిమ్స్ లో రెండు పేపర్లు ఉన్నాయి, దాన్ని ఒక పేపర్ చేసే అవకాశం ఉంది.
  • స్క్రీనింగ్ దశ పరీక్ష కాబట్టి ఒక పేపర్ సరిపోతుందనే అభిప్రాయాలు ఎక్కువగా వస్తున్నాయని, అందుకే ఒక పేపర్ తో పరీక్ష నిర్వహించాలి అనే ఆలోచన చేస్తున్నట్లు కమిషన్ చైర్మన్ గౌతం సవాంగ్ తెలిపారు.
  • గతంలో నిర్వహించిన దానికంటే సులభంగా APPSC గ్రూప్-1 ప్రిలిమ్స్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
  • APPSC గ్రూప్-1 మెయిన్స్ లో కూడా ఇప్పుడు ఉన్న ఐదు పేపర్లను నాలుగు పేపర్లకు తగ్గించి, అందులో రెండు పేపర్లు వ్యాసరూప ప్రశ్నలు (డిస్క్రిప్టివ్), రెండు పేపర్లు ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో రూపొందించాలనే దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.
Read More
APPSC Group 1 Notification 2023  APPSC Group 1 Syllabus
APPSC Group 1 Exam Pattern 2023 APPSC Group 1 Previous Year Question Paper

ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు?

  • ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రశ్నపత్రాలు ఎలా ఉండాలి?
  • ప్రశ్నపత్రాలు ఎలా రూపొందించాలి?
  • ప్రశ్నపత్రాలు మూల్యాంకనం ఎలా ఉండాలి?
  • మూల్యాంకనం ఎలా చేయాలి?
  • ఇతర రాష్ట్రాలు, UPSC వంటి సంస్థలు ఎలాంటి పద్ధతులను అనుసరిస్తున్నాయి? అనే అంశాలను వివిధ కోణాల్లో పరిశీలిస్తున్నారు.

APPSC సిలబస్ మారుతుందా?

పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ప్రిలిమ్స్, మెయిన్స్ లలో మార్పులు జరిగితే, సిలబస్ మారదని, ఉన్నదాన్నే కొంతగా  రీఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుందని చెప్పారు.  మూల్యాంకన విధానాన్ని మార్చేందుకు అధ్యయనం జరుగుతోందన్నారు. మొత్తంగా నియామక విధానాన్ని సులభంగా, సౌలభ్యంగా మార్చే దిశగా కసరత్తు చేస్తున్నామన్నారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, వారిలో వాస్తవ సామర్థ్యాన్ని వెలికితీసేలా కొత్త విధానం ఉంటుందన్నారు. APPSC గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ నెల రోజల తర్వాత విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. APPSC గ్రూప్-2 లో కూడా పోస్టుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

 

APPSC గ్రూప్ 2 కి సంబంధించిన ఆర్టికల్స్ 
APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023
APPSC గ్రూప్ 2 మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు
APPSC గ్రూప్ 2 పరీక్షా సరళి
APPSC గ్రూప్ 2 ఖాళీలు 2023
APPSC గ్రూప్ 2 జీతం
APPSC గ్రూప్ 2 సిలబస్
APPSC గ్రూప్ 2 ఉద్యోగ వివరాలు
APPSC గ్రూప్ 2 అర్హత ప్రమాణాలు
APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ కోసం ఇండియన్ సొసైటీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి?
APPSC గ్రూప్ 2 మరియు ఇతర పరీక్షలకు భౌగోళిక శాస్త్రం ఎలా ప్రిపేర్ అవ్వాలి?
APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలకు నోట్స్ ఎలా సిద్ధం చేసుకోవాలి?
కొత్త సిలబస్‌తో APPSC గ్రూప్ 2 పరీక్షకు ఎలా సిద్ధం కావాలి?
APPSC గ్రూప్ 2 పరీక్ష పుస్తకాల జాబితా (కొత్త సిలబస్)
APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కోసం చరిత్రను ఎలా ప్రిపేర్ అవ్వాలి?

APPSC GROUP-2 2023 Prelims and Mains Chapter wise and Subject Wise Practice Tests Online Test Series in Telugu and English By Adda247

 

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

APPSC Exercise on New Procedures in Conducting Exams_5.1