APPSC GROUP-2 పాత సిలబస్ మరియు కొత్త సిలబస్ మధ్య వ్యత్యాసం
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 899 ఖాళీలకు APPSC గ్రూప్-2 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇటీవలే, APPSC గ్రూప్-2 కొత్త పరీక్షా విధానం మరియు సిలబస్ ను అధికారిక వెబ్సైట్ www.appsc.gov.in లో విడుదల చేసింది. ఇంతకు ముందు ఉన్న సిలబస్ తో పోలిస్తే ఇప్పుడు ఉన్న సిలబస్ కొంచెం సులభతరంగా ఉంది. APPSC గ్రూప్-2 కొత్త సిలబస్ ప్రకారం, ఏ అంశం నుండి ఎన్ని ప్రశ్నలు లేదా, ఏ అంశం ఎన్ని మార్కులకు ఉంటుంది అనే దాని పై ఒక స్పష్టతను ఇచ్చింది. APPSC గ్రూప్-2 పాత సిలబస్ మరియు కొత్త సిలబస్ మధ్య వ్యత్యాసాన్ని విశ్లేషించి మేము మీకోసం ఇక్కడ అందించాము.
APPSC/TSPSC Sure shot Selection Group
APPSC గ్రూప్ 2 పరీక్షా సరళి మధ్య వ్యత్యాసం
APPSC గ్రూప్ 2 కొత్త సిలబస్ ప్రకారం, పరీక్షలో రెండు దశలు ఉంటాయి. ప్రిలిమ్స్ పరీక్షా (మొదటి దశ) 150 మార్కులకు ఉంటుంది. మెయిన్స్ పరీక్ష 300 మార్కులకు నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులు మాత్రమే మెయిన్స్ పరీక్ష రాయడానికి అర్హులు అవుతారు. APPSC గ్రూప్ 2 పాత పరీక్షా సరళికి మరియు కొత్త పరీక్షా సరళికి మధ్య వ్యత్యాసాన్ని దిగువ పట్టిక రూపంలో అందించాము.
పాత పరీక్షా సరళి | కొత్త పరీక్షా సరళి | ||
సబ్జెక్ట్ | మార్కులు | సబ్జెక్ట్ | మార్కులు |
ప్రిలిమ్స్ (స్క్రీనింగ్ టెస్ట్) | 150 | ప్రిలిమ్స్ (స్క్రీనింగ్ టెస్ట్) | 150 |
మెయిన్స్ పరీక్ష | మెయిన్స్ పరీక్ష | ||
పేపర్ I – జనరల్ స్టడీస్ | 150 | పేపర్ I
1.ఆంధ్ర ప్రదేశ్ యొక్క సామాజిక చరిత్ర (ఆంధ్ర ప్రదేశ్ లో సామాజిక మరియు సాంస్కృతిక ఉద్యమాల చరిత్ర.) 2. భారత రాజ్యాంగం యొక్క సాధారణ వీక్షణ |
150 |
పేపర్ II
1.ఆంధ్ర ప్రదేశ్ యొక్క సామాజిక చరిత్ర అంటే, ఆంధ్ర ప్రదేశ్ లో సామాజిక మరియు సాంస్కృతిక ఉద్యమాల చరిత్ర. 2. భారత రాజ్యాంగం యొక్క సాధారణ వీక్షణ |
150 | పేపర్ II
|
150 |
పేపర్ III
1. భారతదేశం మరియు భారత ఆర్థిక వ్యవస్థలో ప్రణాళిక సమకాలీన సమస్యలు మరియు ఆంధ్రప్రదేశ్‌కు సామాజిక సూచనతో గ్రామీణ సమాజంలో పరిణామాలు |
150 | —————————— | ——– |
మొత్తం | 450 | మొత్తం | 300 |
APPSC గ్రూప్ 2 మరియు ఇతర పరీక్షలకు భౌగోళిక శాస్త్రం ఎలా ప్రిపేర్ అవ్వాలి?
APPSC గ్రూప్-2 ప్రిలిమ్స్ పాత సిలబస్ మరియు కొత్త సిలబస్ మధ్య వ్యత్యాసం
APPSC గ్రూప్-2 ప్రిలిమ్స్ పాత సిలబస్ పరిమాణం తో పోలిస్తే, కొత్త సిలబస్ కొంచెం ఎక్కువగా ఉందనే చెప్పవచ్చు మరియు APPSC గ్రూప్-2 ప్రిలిమ్స్ పాత సిలబస్ కి కొత్త సిలబస్ కి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. APPSC గ్రూప్-2 ప్రిలిమ్స్ పాత సిలబస్ లో కరెంట్ అఫ్ఫైర్స్, పొలిటీ, ఎకానమీ అనే 3 సబ్జెక్ట్స్ మాత్రమే ఉన్నాయి. కానీ కొత్త సిలబస్ లో చరిత్ర (ప్రాచీన, మధ్యయుగ మరియు ఆధునిక చరిత్ర), భూగోళ శాస్త్రం (భారతదేశం మరియు AP ఆర్థిక భౌగోళిక శాస్త్రం, భారతదేశం మరియు AP యొక్క మానవ భూగోళశాస్త్రం), భారతీయ సమాజం (భారతీయ సమాజ నిర్మాణం, సామాజిక సమస్యలు, సంక్షేమ యంత్రాంగం), కరెంట్ అఫైర్స్ (సమకాలీన అంశాలు) (అంతర్జాతీయ, జాతీయ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమకాలీన అంశాలు), మెంటల్ ఎబిలిటీ (లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, ప్రాథమిక సంఖ్యాశాస్త్రం) అంశాలు ఉన్నాయి.
APPSC గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షా పాత మోడల్ ప్రకారం 150 మార్కులకి ఉంటుందని మాత్రమే తెలుసు. APPSC గ్రూప్-2 ప్రిలిమ్స్ పాత సిలబస్ లో ఏ అంశం నుండి ఎన్ని ప్రశ్నలు లేదా, ఏ అంశం ఎన్ని మార్కులకు ఉంటుంది అనే విషయం తెలీదు. కానీ APPSC గ్రూప్-2 ప్రిలిమ్స్ కొత్త సిలబస్ లో అంశం నుండి ఎన్ని ప్రశ్నలు లేదా, ఏ అంశం ఎన్ని మార్కులకు ఉంటుంది అని ఈ సిలబస్ లో తెలుసుకోవచ్చు.
APPSC గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. ఒక్కొక అంశం నుండి 30 మార్కులు చొప్పున ప్రాచీన, మధ్యయుగ మరియు ఆధునిక చరిత్ర(30), భూగోళ శాస్త్రం(30), భారతీయ సమాజం(30), కరెంట్ అఫైర్స్(30), మెంటల్ ఎబిలిటీ(30). ఈ ఐదు అంశాల నుండి మొత్తం 150 మార్కులకి ప్రిలిమ్స్ (స్క్రీనింగ్) పరీక్ష ఉంటుంది.
APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కోసం చరిత్రను ఎలా ప్రిపేర్ అవ్వాలి?
APPSC గ్రూప్-2 మెయిన్స్ పాత సిలబస్ మరియు కొత్త సిలబస్ మధ్య వ్యత్యాసం
APPSC గ్రూప్-2 మెయిన్స్ పాత సిలబస్ లో ఉన్న జనరల్ స్టడీస్ పేపర్ ఇప్పుడు లేదు
పేపర్ I – ఆంధ్ర ప్రదేశ్ యొక్క సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర
- APPSC గ్రూప్-2 మెయిన్స్ కొత్త సిలబస్ లో, పేపర్ I – ఆంధ్ర ప్రదేశ్ యొక్క సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర సిలబస్ లో ఏ మార్పు లేదు
- భారత రాజ్యాంగం యొక్క సాధారణ వీక్షణ సెక్షన్ లో పాత సిలబస్ లో మరియు కొత్త సిలబస్ లో ఉన్న అంశాలు ఒక్కటే. పాత సిలబస్ లో ఉన్న సంక్షేమ యంత్రాంగం అనే అంశం కొత్త సిలబస్ లో ప్రిలిమ్స్ పరీక్షలో భారతీయ సమాజం అనే అంశంలో చేర్చారు
APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలకు నోట్స్ ఎలా సిద్ధం చేసుకోవాలి?
పేపర్ II – భారతీయ మరియు A.P. ఆర్థిక వ్యవస్థ
- భారతీయ మరియు A.P. ఆర్థిక వ్యవస్థ సెక్షన్ లో పాత సిలబస్ మరియు కొత్త సిలబస్ కి చాలా వ్యత్యాసం ఉంది. ఈ సెక్షన్ లో పాత సిలబస్ తో పోలిస్తే 90% సిలబస్ కొత్తదని చెప్పవచ్చు.
- పాత సిలబస్ లో పేపర్ III భారతదేశం మరియు భారత ఆర్థిక వ్యవస్థలో ప్రణాళిక మరియు A.P. ఆర్థిక వ్యవస్థ అనే ఒక్క అంశం మాత్రమే ఉండేది, ఇప్పుడు కొత్త సిలబస్ లో భారత ఆర్థిక వ్యవస్థలో ప్రణాళిక మరియు A.P. ఆర్థిక వ్యవస్థ అనే అంశం తో పాటు రెండవ సెక్షన్ గా శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానాలు అనే అంశాన్ని చేర్చారు.
APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ కోసం ఇండియన్ సొసైటీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి
APPSC గ్రూప్ 2 సిలబస్ PDF
APPSC గ్రూప్-2 మెయిన్స్ పాత సిలబస్ మరియు కొత్త సిలబస్ మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అభ్యర్థి గ్రూప్ 2 పరీక్ష కోసం సిలబస్‌ను తనిఖీ చేయాలి. అభ్యర్థులు APPSC గ్రూప్ 2 సిలబస్‌తో పూర్తిగా తెలుసుకుని తద్వారా ప్రణాళిక చేసుకోవాలి. APPSC గ్రూప్ 2 కొత్త సిలబస్ ప్రకారం, ఏ అంశం నుండి ఎన్ని ప్రశ్నలు / మార్కులు ఉంటాయి అనే విషయం గమనించాలి. మేము ఇచ్చిన విశ్లేషణ చదివి, తద్వారా ప్రణాళికను సిద్ధం చేసుకోండి. ఇక్కడ మేము APPSC గ్రూప్ 2 పాత మరియు కొత్త సిలబస్ PDFను అందించాము, ఇది అభ్యర్ధులకు మంచి అవకాశం. దిగువన ఇచ్చిన లింక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మీరు APPSC గ్రూప్ 2 సిలబస్ PDFను డౌన్లోడ్ చేసుకోగలరు.
APPSC గ్రూప్-2 సిలబస్ PDF (కొత్త )
APPSC గ్రూప్-2 సిలబస్ PDF (పాత)