Telugu govt jobs   »   Article   »   APPSC గ్రూప్ 2 అర్హత ప్రమాణాలు
Top Performing

APPSC గ్రూప్ 2 అర్హత ప్రమాణాలు 2023 – విద్యార్హతలు మరియు వయో పరిమితి వివరాలు

APPSC గ్రూప్ 2 అర్హత ప్రమాణాలు 2023

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన అధికారిక వెబ్‌సైట్‌లో 07 డిసెంబర్ 2023 న APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది, ఆంధ్రప్రదేశ్ APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ ద్వారా 897 ఖాళీలను ప్రకటించింది. APPSC గ్రూప్ 2  నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్ధులు కొన్ని అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి. నోటిఫికేషన్ లో నిర్దేశించిన అర్హతలు కలిగి ఉన్నవారే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ కధనంలో APPSC గ్రూప్ 2 పోస్ట్ ల వారీగా, అర్హత ప్రమాణాలు వివరించాము. మరిన్ని వివరాల కోసం ఈ కధనాన్ని చదవండి.

APPSC గ్రూప్ 2 జీత భత్యాలు మరియు అలవెన్స్ వివరాలు_70.1

APPSC/TSPSC Sure shot Selection Group

APPSC గ్రూప్ 2 అర్హత ప్రమాణాలు 2023 అవలోకనం

APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్‌ 07 డిసెంబర్ 2023 న విడుదలైంది. APPSC గ్రూప్ 2 అర్హత ప్రమాణాలు 2023 యొక్క అవలోకనం దిగువ పట్టికలో అందించాము.

APPSC గ్రూప్ 2 అర్హత ప్రమాణాలు 2023 అవలోకనం 
సంస్థ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్ట్ పేరు గ్రూప్ 2
ఖాళీలు 897
వర్గం అర్హత ప్రమాణాలు
నోటిఫికేషన్ విడుదల 07 డిసెంబర్ 2023
ఎంపిక పక్రియ ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ
ఉద్యోగ ప్రదేశం ఆంధ్ర ప్రదేశ్
అధికారిక వెబ్సైట్ https://psc.ap.gov.in

APPSC గ్రూప్ 2 అర్హత ప్రమాణాలు 2023 – విద్యార్హతలు

ఏ పరీక్షకి దరఖస్తు చేసుకోవాలన్న అభ్యర్ధులు నోటిఫికేషన్ లో నిర్దేశించిన విధంగా అర్హతలు కలిగి ఉండాలి. APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్  ప్రకారం మేము ఈ కధనంలో APPSC గ్రూప్ 2 అర్హత ప్రమాణాలు 2023 వివరించాము. APPSC గ్రూప్ 2 అర్హత ప్రమాణాలు ఒక్కో పోస్ట్ కి ఒక్కో విధంగా ఉంటుంది. ఇక్కడ మేము పోస్ట్ ల వారీగా వివరాలు అందించాము.

APPSC గ్రూప్ 2 అర్హత ప్రమాణాలు 2023 
పోస్ట్  విద్యార్హతలు 
మున్సిపల్ కమీషనర్ గ్రేడ్-III B.Sc. లేదా B.A. డిగ్రీ లేదా ఏదైనా ఇతర సమానమైన అర్హతలు
అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హతలు
డిప్యూటీ తహశీల్దార్ బ్యాచిలర్ డిగ్రీ
అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హతలు
సహాయ అభివృద్ధి అధికారులు బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హతలు
లేదా
హ్యాండ్లూమ్ టెక్నాలజీ లేదా టెక్స్‌టైల్ టెక్నాలజీలో డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హత
ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ కామర్స్ లేదా ఆర్ట్స్ లేదా సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ
ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హతలు
అసిస్టెంట్ రిజిస్టర్ బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హతలు
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-I బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హతలు
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (GAD) బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హతలు
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్) కామర్స్ లేదా ఎకనామిక్స్ లేదా మ్యాథమెటిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హతల
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లా డిపార్ట్‌మెంట్.) న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హతలు
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లెజిస్లేచర్ డిపార్ట్‌మెంట్.)  ఏదయినా బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి
సీనియర్ ఆడిటర్ బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హతలు
A.P. ట్రెజరీస్ & అకౌంట్స్ సబ్ సర్వీస్‌లో బ్రాంచ్-I (కేటగిరీ-I) (HOD)లో సీనియర్ అకౌంటెంట్

 

వెబ్ డిజైనింగ్ లేదా PC మెయింటెనెన్స్ మరియు ట్రబుల్ షూటింగ్ లేదా ఆఫీస్ ఆటోమేషన్‌లో సర్టిఫికేట్‌తో పాటు వాణిజ్యం లేదా ఆర్థికశాస్త్రం లేదా గణితంలో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. ఈ సర్టిఫికేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, A.P, హైదరాబాద్ నుండి పొందాలి
లేదా
బి.టెక్ /బి.ఇ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా B.A. (Com.) లేదా B.Com.(comp.) లేదా B.Sc.(comp.) లేదా B.C.A డిగ్రీ కలిగి ఉండాలి
A.P. వర్క్స్ & అకౌంట్స్ (జోన్ వారీగా) సబ్ సర్వీస్‌లో సీనియర్ అకౌంటెంట్ APPSC / DSC యొక్క బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హతలు మరియు అర్హత పరీక్ష “కంప్యూటర్ మరియు అనుబంధ సాఫ్ట్‌వేర్ వినియోగంతో ఆఫీస్ ఆటోమేషన్‌లో ప్రావీణ్యం” కలిగి ఉండాలి
బ్రాంచ్-II (కేటగిరీ-I) A.P. ట్రెజరీస్ & అకౌంట్స్ (జిల్లా) సబ్ సర్వీస్‌లో సీనియర్ అకౌంటెంట్

 

వెబ్ డిజైనింగ్ లేదా PC మెయింటెనెన్స్ మరియు ట్రబుల్ షూటింగ్ లేదా ఆఫీస్ ఆటోమేషన్‌లో సర్టిఫికేట్‌తో పాటు వాణిజ్యం లేదా ఆర్థికశాస్త్రం లేదా గణితంలో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. ఈ సర్టిఫికేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, A.P., హైదరాబాద్ నుండి పొందాలి
లేదా
బి.టెక్ /బి.ఇ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా B.A. (Com.) లేదా B.Com.(comp.) లేదా B.Sc.(comp.) లేదా B.C.A. డిగ్రీ కలిగి ఉండాలి
బీమా A.P. G.L.I సబ్ సర్వీస్‌లో సీనియర్ అకౌంటెంట్ బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హతలు
జూనియర్ అసిస్టెంట్ (బ్రాంచ్ I అంటే ఇతర విభాగాలు మినహా) బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హతలు
A.P. ట్రెజరీస్ మరియు అకౌంట్స్ సబ్-సర్వీస్‌లోని వివిధ విభాగాలలో (బ్రాంచ్-I) జూనియర్ అకౌంటెంట్ బ్యాచిలర్ డిగ్రీ; ఎకనామిక్స్ లేదా మ్యాథమెటిక్స్ లేదా కామర్స్‌లో డిగ్రీ ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది

మరియు

బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, A.P., హైదరాబాద్ యొక్క వెబ్ డిజైనింగ్ లేదా PC మెయింటెనెన్స్ మరియు ట్రబుల్ షూటింగ్ లేదా ఆఫీస్ ఆటోమేషన్‌లో సర్టిఫికేట్ కలిగి ఉండాలి
లేదా
బి.టెక్ /బి.ఇ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా B.A. (Com.) లేదా B.Com.(comp.) లేదా B.Sc.(comp.) లేదా B.C.A. డిగ్రీ కలిగి ఉండాలి

APPSC గ్రూప్ 2 అర్హత ప్రమాణాలు 2023 – వయో పరిమితి

APPSC గ్రూప్ 2 కింద ఉన్న వివిధ పోస్ట్‌లకు నిర్దిష్ట వయో పరిమితి వర్తిస్తుంది.  APPSC గ్రూప్ 2 వయో పరిమితి క్రింద ఇవ్వబడిన వివిధ పోస్ట్‌ల ఆధారంగా విభిన్నంగా ఉంటుంది. APPSC గ్రూప్ 2  అన్నీ పోస్ట్ లకు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఒక్క ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్ట్ కి మాత్రం 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

Adda’s Study Mate APPSC Group 2 Prelims 2024 by Adda247 Telugu

APPSC గ్రూప్ 2 అర్హత ప్రమాణాలు 2023: వయో సడలింపు

APPSC గ్రూప్ 2 వయోపరిమితి APPSCలో నిర్దిష్ట వర్గాల అభ్యర్థులకు వయో సడలింపులు అందించబడ్డాయి. దీనిలో ఏదైనా మార్పు అధికారిక వెబ్‌సైట్‌లో తెలియజేయబడుతుంది. రిజర్వ్డ్ కేటగిరీలకు వయోపరిమితి సడలింపు క్రింద పట్టిక రూపంలో అందించాము.

వర్గం వయోసడలింపు
SC/ST/BC 5 సంవత్సరాలు
AP రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 5 సంవత్సరాలు
PH 10 సంవత్సరాలు
Ex -సర్వీస్ మెన్ 3 సంవత్సరాలు
NCC 3 సంవత్సరాలు
కాంట్రాక్ట్ ఉద్యోగులు (రాష్ట్ర జనాభా లెక్కల విభాగం) 3 సంవత్సరాలు

APPSC గ్రూప్ 2 కి సంబంధించిన ఆర్టికల్స్ 

APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023 APPSC గ్రూప్ 2 మరియు ఇతర పరీక్షలకు భౌగోళిక శాస్త్రం ఎలా ప్రిపేర్ అవ్వాలి?
APPSC గ్రూప్ 2 మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు
APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలకు నోట్స్ ఎలా సిద్ధం చేసుకోవాలి?
APPSC గ్రూప్ 2 పరీక్షా సరళి
కొత్త సిలబస్‌తో APPSC గ్రూప్ 2 పరీక్షకు ఎలా సిద్ధం కావాలి?
APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల కానుంది APPSC గ్రూప్ 2 పరీక్ష పుస్తకాల జాబితా (కొత్త సిలబస్)
APPSC గ్రూప్ 2 జీతం APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కోసం చరిత్రను ఎలా ప్రిపేర్ అవ్వాలి?
APPSC గ్రూప్ 2 సిలబస్ APPSC గ్రూప్ 2 మునుపటి సంవత్సరం కట్ ఆఫ్
APPSC గ్రూప్ 2 ఉద్యోగ వివరాలు APPSC గ్రూప్ 2 ఖాళీలు 2023
APPSC గ్రూప్ 2 అర్హత ప్రమాణాలు APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ కోసం ఇండియన్ సొసైటీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి?

APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023, 720 ఖాళీలు మరియు మరిన్ని వివరాలు_80.1

 

మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

APPSC గ్రూప్ 2 అర్హత ప్రమాణాలు 2023 - విద్యార్హతలు మరియు వయో పరిమితి_6.1

FAQs

గ్రూప్ 2 2023 పోస్టులన్నింటికీ అర్హత ప్రమాణాలు ఒకటేనా?

లేదు, వివిధ పోస్టులకు అర్హత ప్రమాణాలు భిన్నంగా ఉంటాయి. మరిన్ని వివరాల కోసం ఈ కధనాన్ని తనిఖీ చేయండి.

ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు వయో సడలింపు ఏమైనా ఉందా?

లేదు, ఆంధ్రప్రదేశ్ మినహా ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు ఎలాంటి సడలింపులు అందించబడవు.