అత్యంత పోటీతత్వంతో కూడిన APPSC గ్రూప్-2 పరీక్షకు సన్నద్ధమవుతున్నారా? ఈ పరీక్షలో విజయం సాధించడానికి వ్యూహాత్మక విధానం మరియు ప్రతి సబ్జెక్టులోని ముఖ్యమైన అంశాలపై లోతైన అవగాహన అవసరం. ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం 899 పోస్ట్ ఎగ్జిక్యూటివ్ మరియు నాన్- ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి APPSC గ్రూప్-2 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. APPSC గ్రూప్ 2 ఎంపిక ప్రక్రియ మూడు దశలుగా స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ పరీక్ష మరియు కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్ష విభజించబడింది. ఇందులో APPSC గ్రూప్-2 సంబంధించి తొలి దశ స్క్రీనింగ్ టెస్ట్/ప్రిలిమినరీ పరీక్ష 25 ఫిబ్రవరి 2024 న నిర్వహించనున్నారు. APPSC గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్/ప్రిలిమినరీ పరీక్ష మరియు మెయిన్స్ పరీక్ష రెండు పరీక్షలు కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే జరుగుతాయి. మెయిన్స్ లో మెరిట్ జాబితాలో అర్హత సాదించిన అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఇందులో అర్హత సాధిస్తేనే APPSC గ్రూప్ 2 అధికారి కావడానికి అర్హులు. ఈ కథనంలో, APPSC గ్రూప్ 2 పరీక్షలో మీ పనితీరును మెరుగుపరిచే కీలక అంశాలను మేము వివరిస్తాము.
APPSC Group 2 important topics | APPSC గ్రూప్ 2 ప్రతి సబ్జెక్ట్‌లో ముఖ్యమైన అంశాలు
స్క్రీనింగ్ టెస్ట్/ప్రిలిమినరీ పరీక్ష
- 150 మార్కులకు స్క్రీనింగ్ టెస్ట్/ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఇది APPSC గ్రూప్ 2 ఎంపిక ప్రక్రియ తొలి దశలో మొదటిది.
- స్క్రీనింగ్ టెస్ట్ ఒకే పేపర్ 150 మార్కులకు ఉంటుంది.
- ఈ పరీక్షను జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంశాలపై మొత్తం 150 ప్రశ్నలు-150 మార్కులకు నిర్వహిస్తారు.
- APPSC గ్రూప్ 2 25 ఫిబ్రవరి 2024 న జరగనుంది, అంటే దాదాపు 2.5 నెలల సమయం ఉంది. స్క్రీనింగ్ టెస్ట్ లో అర్హత సాదించిన అభ్యర్ధులు మాత్రమే మెయిన్స్ పరీక్ష కి పిలవబడతారు.
- కాబట్టి, ప్రిలిమినరీ పరీక్ష కు ఉన్న ఈ కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, ఒక పటిష్టమైన ప్రణాళికతో మీ ప్రీపరేషన్ మొదలు పెట్టడం చాలా ముఖ్యం.
APPSC గ్రూప్ 2 పరీక్ష కోసం దృష్టి పెట్టాల్సిన ముఖ్యమైన అంశాలు సబ్జెక్ట్ వారీగా
APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష విధానంలో జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ అనే విభాగం ఉంటుంది. ఈ పరీక్షలో భారతీయ చరిత్ర, భూగోళశాస్త్రం, భారతీయ సమాజం, కరెంట్ అఫైర్స్ మరియు మెంటల్ ఎబిలిటీ అనే ఐదు ఉప భాగాలు ఉన్నాయి. మొత్తం 150 మార్కులకు 150 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సబ్ సెక్షన్ నుండి 30 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి.
APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష విధానం రెండు పేపర్‌లను కలిగి ఉంటుంది, అనగా పేపర్ I మరియు పేపర్ II. పేపర్ I విభాగాలుగా విభజించబడింది, అనగా సెక్షన్ A (ఆంధ్రప్రదేశ్ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర) మరియు విభాగం B (భారత రాజ్యాంగం). పేపర్ II విభాగాలుగా విభజించబడింది, అనగా సెక్షన్ A (భారతీయ మరియు AP ఆర్థిక వ్యవస్థ) మరియు విభాగం B (సైన్స్ అండ్ టెక్నాలజీ). మెయిన్స్ పరీక్ష కోసం APPSC గ్రూప్ 2 పరీక్ష విధానం మొత్తం 300 మార్కులను కలిగి ఉంటుంది
ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కుల నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి, తెలిసిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చేయాలి. అయితే ఇక్కడ మేము ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ లో ప్రతి సబ్జెక్ట్ పై దృష్టి పెట్టాల్సిన ముఖ్యమైన అంశాల గురించి వివరించాము.
Geography | భూగోళ శాస్త్రం
- భౌతిక భౌగోళిక శాస్త్రం: నదులు, పర్వతాలు,భౌగోళిక వనరులు, అడవులు, జీవ సంపద, వ్యవసాయ వనరులు మరియు వాతావరణంతో సహా భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక లక్షణాలను చదవాలి.
- జనాభా: ఆంధ్రప్రదేశ్‌లో జనాభా పోకడలు, పంపిణీ మరియు వలస విధానాలను అధ్యయనం చేయాలి.
- ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన వ్యవసాయ, నీటి పారుదల ప్రాజెక్ట్ లు మరియు వాటి ద్వారా లబ్ధి చేకూరే ప్రాంతాలు వంటి వాటిపై దృష్టి పెట్టాలి.
APPSC గ్రూప్ 2 మరియు ఇతర పరీక్షలకు భౌగోళిక శాస్త్రం ఎలా ప్రిపేర్ అవ్వాలి?
History | చరిత్ర
- ప్రాచీన మరియు మధ్యయుగ చరిత్ర: ప్రాచీన కాలం నుండి మధ్యయుగ కాలం వరకు రాజవంశాలు, కళలు మరియు సంస్కృతితో సహా ఆంధ్ర ప్రదేశ్ యొక్క గొప్ప వారసత్వ అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
- ఆధునిక చరిత్ర: బ్రిటిష్ పాలన మరియు స్వాతంత్య్రానంతర కాలంలో సామాజిక-సాంస్కృతిక మరియు రాజకీయ మార్పులను అర్థం చేసుకోండి.
- జాతీయోద్యమంలో ఆంధ్రప్రదేశ్ పాత్ర, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం:2014 మరియు భారతదేశ చరిత్రకు సంబంధించిన అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి.
APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కోసం చరిత్రను ఎలా ప్రిపేర్ అవ్వాలి?
Polity | భారత రాజ్యాంగం
- మెయిన్స్ లో పేపర్ 1 లో సెక్షన్ -B : భారత రాజ్యాంగం నుండి 75 మార్కులు ఉంటాయి.
- ప్రాథమిక హక్కులు మరియు విధులు: భారత రాజ్యాంగం ద్వారా హామీ ఇవ్వబడిన ప్రాథమిక హక్కులు మరియు పౌరుల సంబంధిత విధుల గురించి క్లుప్తంగా తెలుసుకోవాలి.
- రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు: పాలసీల రూపకల్పనలో రాష్ట్రానికి మార్గనిర్దేశం చేసే సూత్రాలను అర్థం చేసుకోండి.
- రాజనీతి శాస్త్రం, రాజ్యాంగానికి సంబంధించి ప్రాథమిక అంశాలు, రాజ్యాంగ సవరణలు, వాటి ప్రభావం తెలుసుకోవాలి
- సివిల్, క్రిమినల్ లా, కార్మిక చట్టాలు, సైబర్ చట్టాలు, ట్యాక్స్ చట్టాల గురించి తెలుసుకోవాలి.
Economy | ఎకానమీ
- మెయిన్స్ లో పేపర్ 2 లో సెక్షన్ -A భారతీయ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ నుండి 75 మార్కులు ఉంటాయి.
- భారతదేశంలో ఆర్థిక ప్రణాళిక: భారతదేశంలోని ప్రణాళిక ప్రక్రియను మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధిపై దాని ప్రభావాలను అర్థం చేసుకోవాలి.
- పారిశ్రామిక మరియు ఆర్థిక విధానాలు: రాష్ట్ర పారిశ్రామిక విధానాలు, వృద్ధి రంగాలు మరియు ఆర్థిక సవాళ్లపై అప్‌డేట్‌గా ఉండండి.
- ఇటీవల కాలంలో చేపట్టిన ప్రధాన ఆర్థిక సంస్కరణలు, వాటిద్వారా లబ్ది చేకూరే వర్గాలు; జాతీయ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా తీసుకొచ్చిన విధానాలపై పట్టు సాధించాలి.
- ఈ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లు, ఎకనామిక్ సర్వేలపై అవగాహన పొందాలి.
Science and Technology | సైన్స్ అండ్ టెక్నాలజీ
- ఇటీవలి పరిణామాలు: సైన్స్ అండ్ టెక్నాలజీలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యక్ష సంబంధం ఉన్న తాజా పురోగతుల గురించి తెలుసుకోండి.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో అమలవుతున్న కొత్త విధానాలు
- ప్రధాన సంస్థలు, రాష్ట్ర స్థాయిలో ICT విధానాలు, ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ మరియు ఇంధన వనరులు గురించి తెలుసుకోవాలి.
- పర్యావరణ సమస్యలు: రాష్ట్రం ఎదుర్కొంటున్న పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణకు అనుసరిస్తున్న సాంకేతిక విధానాలు మరియు స్థిరమైన అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలు తదితర అంశాలపై పట్టు సాధించాలి.
APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలకు నోట్స్ ఎలా సిద్ధం చేసుకోవాలి?
Environmental | పర్యావరణ
- పర్యావరణ వ్యవస్థ మరియు జీవవైవిధ్యం, భారతీయ వన్యప్రాణులు ఇటీవలి కాలంలో పరిరక్షణ ప్రయత్నాలు, ప్రాజెక్ట్‌లు, చర్యలు మరియు కార్యక్రమాల గురించి తెలుసుకోవాలి.
- పర్యావరణ పరిరక్షణకు సంబంధించి జాతీయ, రాష్ట్ర స్థాయిలో అమలు చేస్తున్న చట్టాలు, విధానాలపై అవగాహన పొందాలి.
- ఇటీవల జరిగిన అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలు గురించి తెలుసుకోవాలి
Indian Society | భారతీయ సమాజం
- భారతదేశంలో సామాజిక నిర్మాణం – కుల వ్యవస్థ, గిరిజన సంఘాలు.
- మహిళా సాధికారత – చట్టపరమైన నిబంధనలు మరియు సామాజిక కార్యక్రమాలు.
- విద్య మరియు ఆరోగ్య సూచికలు – అసమానతలు మరియు సవాళ్లు.
APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ కోసం ఇండియన్ సొసైటీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి?
current affairs | కరెంట్ అఫైర్స్
APPSC గ్రూప్ 2 పరీక్ష తేదీకి ముందు గత 6 లేదా 8 నెలల కరెంట్ అఫైర్స్ పై గట్టి అపట్టు సాదించాలి.
- అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్
- జాతీయ కరెంట్ అఫైర్స్
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ చదవాలి
Some Important Tips for Preparation | కొన్ని ముఖ్యమైన ప్రీపరేషన్ చిట్కాలు:
- సిలబస్ ను పూర్తిగా అర్థం చేసుకోవాలి: APPSC గ్రూప్ 2 పరీక్షలో ఏ అంశాలను అడుగుతారో తెలుసుకోవడానికి సిలబస్ ను పూర్తిగా చదవండి.
- APPSC గ్రూప్ 2 పరీక్షకు సంబంధించిన అన్ని అంశాలను కవర్ చేసే పుస్తకాలను ఎంచుకోండి, మరియు ఉత్తమైన ఆన్లైన్ తరగతలను ఎంచుకోండి. adda247 APPSC Group 2 Target Prelims Batch
- ప్రతి అంశానికి ఎంత సమయం కేటాయించాలి, ఎంత సమయంలో పరిష్కారించాలి అని నిర్ణయించుకోండి. మీ ప్రీపరేషన్ని ఎప్పటికపుడు ట్రాక్ చేయడానికి మరియు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది.
- చదివేటప్పుడు ముఖ్యమైన అంశాలను గుర్తించి వాటిని సొంతంగా నోట్స్ లో రాసుకోండి. ఇది మీకు పునశ్చరణ సమయంలో సహాయపడుతుంది.
- పరీక్షా విధానం మరియు ప్రశ్నల స్థాయిని అర్ధం చేసుకోవడానికి గత సంవత్సర ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయండి మరియు మాక్ టెస్టులను ప్రాక్టీస్ చేయండి (APPSC GROUP-2 2023 Prelims and Mains Chapter wise and Subject Wise Practice Tests)
- మీ సమయ నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరచడానికి సమయ పరిమితితో పరీక్షలు రాయండి.నిజమైన పరీక్ష అనుభవం కోసం APPSC Group 2 Prelims 2024 Online Test Series లను ప్రయత్నించండి