APPSC Group 3 Syllabus 2023: The APPSC Group 3 exam is held in two stages: the screening/preliminary test and the main exam. The Group 3 syllabus APPSC Pdf and exam pattern for both stages will be available separately. The candidates need to go through the entire APPSC Group 3 syllabus and exam pattern 2023 to understand each and every topic thoroughly.
Check out the latest APPSC Group 3 Syllabus and exam pattern in Telugu. Get the download link for the APPSC Group 1 Syllabus pdf and Exam Pattern here.
APPSC Group 3 Syllabus 2023, APPSC గ్రూప్ 3 సిలబస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ APPSC GROUP-3 భర్తీ చేసే అంత్యంత ప్రతిష్టాత్మక ఉద్యోగాలలో APPSC GROUP-3 (పంచాయతి సెక్రటేరియట్-గ్రేడ్-IV) ఉద్యోగాలు ఒకటి. రాష్ట్రంలోని వివిధ పంచాయతీలలో ఉన్న ఖాళీల ఆధారంగా APPSC GROUP-3 భర్తీ చేయడం జరుగుతుంది. సచివాలయం పోస్టుల మాదిరి కాకుండా వీటి కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్-APPSC నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఇటీవల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలోని వివిధ శాఖలలో ఉన్న ఖాళీలపై నివేదిక సమర్పించమని అధికారులను ఆదేశించిన విషయం విదితమే. APPSC GROUP-3 పరీక్ష యొక్క సిలబస్ పై పూర్తి విశ్లేషణతో కూడిన వ్యాసం ఈ కథనంలో అందించడం జరిగింది.
APPSC/TSPSC Sure shot Selection Group
APPSC Group 3 Syllabus 2023 – Overview
Andhra Pradesh PSC Group 3 Services Syllabus 2023 – Overview |
|
Description | APPSC Group 3 Syllabus Details |
Organization Name | Andhra Pradesh Public Service Commission |
No.of Vacant Posts | to be notified soon |
Name of Posts | Panchayat Secretary ( Grade-IV) |
Category | Syllabus |
Selection Process | Screening Test, Mains Examination, Certificates Verification |
Job Location | Andhra Pradesh |
Qualification | Graduates |
Official Website | www.psc.ap.gov.in |
తెలంగాణా DCCB అపెక్స్ బ్యాంకు నోటిఫికేషన్ విడుదల
APPSC Group 3 Syllabus 2023- Exam Pattern
ఈ పరీక్ష రెండు దశలో జరుగుతుంది.
- ప్రిలిమ్స్
- మెయిన్స్
APPSC Group 3 Exam Pattern- Prelims
గ్రూప్-3 పరీక్షా విధానం – ప్రిలిమ్స్
- స్క్రీనింగ్ టెస్ట్ అనేవి పార్ట్-A & పార్ట్-B అనే రెండు విభాగాలను కలిగి ఉంటాయి
- స్క్రీనింగ్ పరీక్షలకు మొత్తం మార్కులు 150, 150 నిమిషాల వ్యవధి.
- ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.
- నిబంధనల ప్రకారం ప్రతి తప్పు సమాధాన ప్రశ్నకు 0.33 నెగెటివ్ మార్క్ ఉంటుంది.
ప్రిలిమ్స్ కేవలం అర్హత పరీక్ష మాత్రమే ఈ మార్కులు తుది ఎంపికకు పరిగణించబడవు.
రాతపరీక్ష (బహులైచ్చిక విధానం) | మార్కులు | సమయం | అత్యధిక మార్కులు |
పార్ట్-A : జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ | 75 | 75 |
150 |
పార్ట్-B : గ్రామీణ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి గ్రామీనాభివృద్ది సమస్యలు | 75 | 75 |
APPSC Group 3 Exam Pattern-Mains
గ్రూప్-3 పరీక్షా విధానం – మెయిన్స్
- మెయిన్స్ పేపర్‌లో పేపర్ I & పేపర్ II అనే రెండు పేపర్‌లు కూడా ఉంటాయి
- మెయిన్స్ పరీక్ష యొక్క మొత్తం వ్యవధి 300 నిమిషాలు మరియు ప్రతి ప్రశ్న ఒక మార్కును కలిగి ఉంటుంది.
- ప్రతి తప్పు సమాధానానికి 0.33 చొప్పున నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
దీనిలో వచ్చిన మార్కుల ఆదరంగా అభ్యర్ధులను తుది ఎంపిక చేస్తారు.
రాతపరీక్ష (బహులైచ్చిక విధానం) | మార్కులు | సమయం | అత్యధిక మార్కులు |
Paper-1 : జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ | 150 | 150 | 300 |
Paper-2: గ్రామీణ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి గ్రామీనాభివృద్ది సమస్యలు | 150 | 150 |
APPSC Group 2 Cut off 2022 ,Check Previous Year Cut off
APPSC Group 3 Syllabus 2023
గ్రూప్-3 ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ యొక్క సిలబస్ ఒక్కటే ఇవ్వడం జరిగింది. క్రింది సిలబస్ ను పరిశీలించగలరు.
PART – A ( GENERAL STUDIES AND MENTAL ABILITY )
పార్ట్-A (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటి)(75 ప్రశ్నలు)(75 మార్కులు )
- జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన సంఘటనలు.
- అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వర్తమాన అంశాలు.
- జనరల్ సైన్స్, శాస్త్ర సాంకేతిక రంగాలు, సమాచార సాంకేతీకతలో సమకాలీన అభివృద్ధి, దైనందిన జీవితంలో అనువర్తనాలు.
- భారత జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో భారతదేశంలో సామాజిక, ఆర్ధిక, రాజకీయ చరిత్ర.
- భారత రాజకీయ వ్యవస్థ పాలనసమస్యలు, రాజ్యాంగ ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు.
- స్వతంత్రం అనంతరం భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి.
- భారతదేశం భూగోళ శాస్త్రం, భౌతిక, సాంస్కృతిక, జనాభా, ఆర్థిక, సాంఘిక మరియు మౌలిక అంశాల దృష్ట్యా,ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం.
- విపత్తు నిర్వహణ ప్రాంతాలు, సంభవించే విపత్తులు, నష్ట నివారణ, ఉపశమన చర్యలు, రిమోట్ సెన్సింగ్, జి.ఐ.ఎస్ సహాయంతో విపత్తు అంచనా.
- సుస్థిరమైన అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ.
- తార్కిక వివరణ,విశ్లేషణాత్మక సామర్ధ్యాలు,తార్కిక అన్వయం.
- దత్తాంశ విశదీకరణరూపం టేబుల్ దత్తాంశానికి, దత్తాంశ ధ్రువీకరణ, అన్వయం, ప్రాథమిక విశ్లేషణ అంకగణితం, మధ్యగతం బహుళకం.
- ఆంధ్రప్రదేశ్ విభజన,పరిపాలన, ఆర్ధిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ, చట్టపరమైన సమస్యలు.
APPSC Group 4 Model papers With Answers PDF, APPSC గ్రూప్ 4 మోడల్ పేపర్స్
PART-B (Rural Development and Problems in Rural Areas with special reference to Andhra Pradesh)
పార్ట్-B: (గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ అభివృద్ధి మరియు సమస్యలు, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక సూచనలు)
- రాజ్యాంగ సవరణలు మరియు వివిధ కమిటీల పునరావాసాలతో సహా భారతదేశంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ యొక్క పరిణామం.
- ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ రాజ్ వ్యవస్థ పరిణామం.
- పంచాయతీ కార్యదర్శి, విధులు, బాధ్యతలు.
- గ్రామీణ సమాజం, గ్రామీణ పేదల అభివృద్ధి కొరకు ప్రవేశపెట్టిన పథకాలు చరిత్ర మరియు పరిణామక్రమం.
- కేంద్ర రాష్ట్ర గ్రామీణాభివృధి శాఖలు, ప్రధాన గ్రామీణాభివృధి పథకాలు.
- పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య పథకాలు.
- ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ – వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు.
- ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పరపతి విధానం (Rural క్రెడిట్ Scenario)- బ్యాంకులు, సహకార సంఘాలు సూక్ష్మ విత్త సంస్థల పాత్ర.
- సమాజ ఆధారిత సంస్థలు మరియు సంక్షేమ పథకాల కేంద్రీకరణ.
- స్వయం సహాయక బృందాల ద్వారా మహిళా సాధికారత మరియు ఆర్ధికాభివృధి.
- స్థానిక సంస్థల ఆదాయ మరియు వ్యయాల నిర్వహణ.
- వివిధ పథకాల నిధులు, గ్రాంట్ల నిర్వహణ.
APPSC Group 3 Syllabus 2023- FAQs
Q1.APPSC GROUP-III లో ఇంటర్వ్యూ ఉంటుందా?
జ: APPSC GROUP-III పరిక్ష లో ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ మాత్రమే ఉంటుంది.దీనిలో వచ్చిన మార్కుల ఆదరంగా అభ్యర్ధులను తుది ఎంపిక చేస్తారు.
Q2.APPSC GROUP-III పరిక్షలో నెగటివ్ మార్కింగ్(కోత) విధించబడుతుందా?
జ: ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు కోత విధించబడుతుంది.
Q3.APPSC GROUP-III పరీక్ష లో చదవాల్సిన ముఖ్యమైన సబ్జెక్టు లు ఏమిటి ?
జ: APPSC GROUP-III పరీక్ష లో చదవాల్సిన ముఖ్యమైన సబ్జెక్టు లు జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీ,చరిత్ర, పాలిటీ మరియు సొసైటీ,ఎకానమీ అండ్ డెవలప్ మెంట్,సమకాలిన అంశాలు(కరెంటు అఫైర్స్).
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************