ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు వేగం పెంచింది. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనవరి 12న APPSC ద్వారా జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది. ఈ సందర్భంలో కొత్తగా 866 పోస్టుల భర్తీకి సంబంధించి 18 నోటిఫికేషన్లు విడుదల చేయడంతో పాటు, పాత నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్షల తేదీలు ప్రకటించనున్నారు.
అటవీ శాఖలో అత్యధిక పోస్టులు
ఈ సారి ప్రభుత్వం విడుదల చేయనున్న నోటిఫికేషన్లలో అత్యధికంగా అటవీ శాఖకు చెందిన 814 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఈ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Adda247 APP
ఇతర శాఖలలో పోస్టుల వివరాలు
మిగతా పోస్టుల్లో దివ్యాంగుల సంక్షేమశాఖలో వార్డెన్, గనుల శాఖలో రాయల్టీ ఇన్‌స్పెక్టర్, ఫ్యాక్టరీ సర్వీసెస్‌లో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, బీసీ వెల్ఫేర్‌లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, జైళ్ల శాఖలో జూనియర్ అసిస్టెంట్-టైపిస్టు, రవాణా శాఖలో ఏఎంవీఐ (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు.
APPSC గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను 2025 ఏప్రిల్ తర్వాత నిర్వహించే అవకాశముండగా, గ్రూప్-2 ప్రధాన పరీక్షలను 2025 ఫిబ్రవరి 23న నిర్వహిస్తారు. ప్రభుత్వ పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ పోస్టుల రాత పరీక్షలను 2025 జూన్‌లో నిర్వహించనున్నారు.
ఇతర ముఖ్యమైన పోస్టులు
- పాఠశాల విద్యాశాఖలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్
- పర్యావరణ శాఖలో ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్, ఎనలిస్టు గ్రేడ్-2
- ఎన్టీఆర్ వర్సిటీలో అసిస్టెంట్ లైబ్రేరియన్, జూనియర్ అసిస్టెంట్
- ఫారెస్ట్ రేంజి ఆఫీసర్, ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్
- ఆరోగ్యశాఖలో లైబ్రేరియన్, దివ్యాంగుల సంక్షేమశాఖలో అసిస్టెంట్ డైరెక్టర్
- ఏపీ భూగర్భ నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ కెమిస్ట్
- ఏపీ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టరేట్ సర్వీసెస్‌లో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్
- ఆర్థిక గణాంకాల శాఖలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్
- ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్
శాఖ | పోస్ట్ టైటిల్‌లు | ఖాళీలు |
అటవీశాఖ | సెక్షన్ ఆఫీసర్ |
100 (30 contractual)
|
బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్
|
691 (క్యారీఫార్వర్డ్: 141 | |
డ్రాఫ్ట్స్‌మన్ (గ్రేడ్-2–టెక్నికల్ అసిస్టెంట్) | 13 | |
ఠాణేదార్ | 10 | |
మున్సిపల్ శాఖ | జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ- 2, సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ-3, జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ-4 | 11 |
వ్యవసాయ శాఖ | అగ్రికల్చరల్ ఆఫీసర్ | 10 |
దేవాదాయ | ఎక్సైజ్ ఆఫీసర్ | 7 |
జిల్లా సైన్స్ ఆఫీసర్ | 7 | |
ఇంటర్ విద్య
|
గ్రంథ పాలకులు | 2 |
ఉద్యానవనం | హార్టికల్చర్ ఆఫీసర్ | 2 |
మత్స్యశాఖ | అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ | 3 |
భూగర్భ నీటిపారుదల | టెక్నికల్ అసిస్టెంట్ | 4 |
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు Youtube Official Channel | ఇక్కడ క్లిక్ చేయండి |