APPSC New changes in the selection process: Andhra Pradesh public service commission(APPSC) has made many changes with New Changes to APPSC Group-1 and Also Cancelled the prelims examination for most of the exams depending up on the number of application received against the notifications released.
APPSC New changes in the selection process ఎంపిక ప్రక్రియలో APPSC కొత్త మార్పులు: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) APPSC గ్రూప్-1కి కొత్త మార్పులతో అనేక మార్పులు చేసింది మరియు నోటిఫికేషన్‌లకు వచ్చిన దరఖాస్తుల సంఖ్యను బట్టి చాలా పరీక్షలకు ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసింది.
APPSC New changes in the selection process | APPSC పరీక్షా విధానంలో మార్పులు
APPSC పోస్టుల భర్తీలో వివిధ మార్పులు: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(APPSC) ఉద్యోగాల భర్తీకి సంబంధించి వివిధ మార్పులను చేయడం జరిగింది. APPSC 2022 కి గాను మరిన్ని పోస్టుల భర్తీ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించినది. దీనితో పాటు గ్రూప్-1 మినహా మిగిలిన అన్ని పోస్టులకు ప్రిలిమ్స్ పరీక్షను మొదటిలో రద్దు చేసింది. కాని తరువాత పోస్టుల సంఖ్యను ఆధారంగా చేసుకొని ఆయా ఉద్యోగాల భర్తీకి ప్రిలిమ్స్ మరియు మెయిన్ పరీక్షలను నిర్వహించే విధంగా APPSC సంస్కరణలు తీసుకువచ్చింది.
Read More: APPSC Group Exam Date and No of Applications Received
Is APPSC Conducts both prelims and mains? | APPSC ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తుందా?
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ -1 పోస్టులకు మినహా మిగతా అన్ని కేటగిరీల పోస్టులకు ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది .అయితే కొన్ని పోస్టులకు లక్షల్లో దరఖాస్తులు రావడం ,మెరిట్ అభ్యర్థులను నిర్ణయించడంలో సమస్యలు తలెత్తడంతో కొన్ని మినహాయింపులు చేపట్టింది .అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు అందే పోస్టులకు మినహా మిగతా వాటికీ ప్రిలిమ్స్ లేకుండా ఒకే పరీక్షా ద్వారా ఎంపిక చేయనున్నారు.దీనితో పాటు గ్రూప్ 1 సహా అన్ని పోస్టులకు ఇంటర్వ్యూలను పూర్తిగా తొలగించారు.
Read More: APPSC Group-4 Exam Pattern and Syllabus
What is the APPSC Mains Selection Ratio?, APPSC ఏ నిష్పత్తిలో మెయిన్స్ కు ఎంపిక చేస్తుంది?
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ కొన్ని పరీక్షలకు ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.అయితే ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన అభ్యర్థులను మాత్రమే మెయిన్స్ పరీక్షకు పిలుస్తారు.ప్రిలిమ్స్ లో అర్హత మార్కులు అనేవి పరీక్షలో పాల్గొనే అభ్యర్థుల సంఖ్యను పట్టి,మరియు పరీక్ష కఠినత స్థాయిని పట్టి బోర్డు నిర్ణయిస్తుంది.అయితే ప్రిలిమ్స్ పరీక్ష కు హాసరు అయిన అభ్యర్థులనుండి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్ కు ఎంపిక చేస్తుంది. అంటే ఒక్క పోస్టు కు 50 మంది అభ్యర్థులు మెయిన్స్ లో పోటీపడవలసి ఉంటుంది,దీనిని పట్టి చుస్తే పోటీ స్థాయి ఎక్కువ ఉంటుంది అన్న విషయం మనం గ్రహించాల్సిన ప్రధాన విషయం.కావున అభ్యర్థులు ఇప్పటి నుండే మీ ప్రిపరేషన్ ని మొదలు పెట్టాలి. మీ ప్రిపరేషన్ కి adda 247 తెలుగు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. మీకు కావాల్సిన సమాచారాన్ని , పరీక్ష విధానాన్ని మరియు సిలబస్ ని అందిస్తుంది
Read More: APPSC Revised Syllabus and Exam Pattern
Is Negative making is there for APPSC Exams? | APPSC పరీక్షలలో నెగిటివ్ మార్కింగ్ ఉందా?
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఇంతకు ముందు కొన్ని పరీక్షలకు ప్రతి తప్పు సమాధానాలకి కోత విధించేది. నెగటివ్ మార్కింగ్ అంటే అభ్యర్థులకు వచ్చిన మార్కుల నుండి కోత విధిస్తారు.దీని వల్ల మార్కులు తగ్గి మెరిట్ లిస్ట్ లో అర్హత సాధించే ఛాన్స్ పోతుంది, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) నిర్వహించే డిపార్టుమెంట్ పరీక్షలలో నెగటివ్ మార్కింగ్ రద్దు చేసింది.ఒక రకంగా చెప్పాలి అంటే ఇది అభ్యర్థులకు మంచి విషయమే,దీనిని సద్వినియోగం చేస్కోవడం మనకు చాల ముఖ్యం.
Read More: TSPSC Group-4 Selection Process
What is the maximum age limit for SC, ST, BC? | SC, ST, BC గరిష్ఠ వయోపరిమితి ఎంత?
చాల మంది అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగం ఒక కళ.కానీ ఒక్కొక్కరికి ఒక్కో కారణం వల్ల ఆ కళ అలాగే ఉండిపోతుంది.అందులో వయోపరిమితి కూడా ఒకటి.కొన్ని సంవస్త్సరాల తరపడి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు చాల మంది ఉన్నారు.అందులో కొందరికి వయోపరిమితి కూడా అయిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి నిబంధనల నుంచి SC,ST,BC అభ్యర్థులకు కల్పిస్తున్న ఐదేళ్ల సడలింపును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ వర్గాలకు కల్పిస్తున్న సడలింపు కాల పరిమితి 2021 మే నెలతో ముగిసింది .కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు వెలుబడడంతో ఈ అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా వయోపరిమితి సడలింపు 2026 మే 31 వరకు పొడిగించారు.
IS EWS reservation applicable for APPSC Recruitment? | APPSC పరీక్షలకు EWS రిజర్వేషన్ వర్తిస్తుందా?
ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలో ఇంతకుముందు EWS అభ్యర్థులకు రిజర్వేషన్స్ లేవు,వారు జనరల్ కేటగిరీ అభ్యర్థుల జాబితాలో ఉండేవారు ,కాని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) EWS అభ్యర్థులకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తుంది.ఇది వారికీ ఎంతగానో సహాయ పడుతుంది.దీని EWS అభ్యర్థులు సమగ్రంగా వాడుకోవాలి.
APPSC New Changes in Selection Process -FAQs
Q1: APPSC ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తుందా?
జ : అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు అందే పోస్టులకు మినహా మిగతా వాటికీ ప్రిలిమ్స్ లేకుండా ఒకే పరీక్షా ద్వారా ఎంపిక చేయనున్నారు.
Q2: APPSC ఏ నిష్పత్తిలో మెయిన్స్ కు ఎంపిక చేస్తుంది?
జ :1:50 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్ కు ఎంపిక చేస్తుంది.
Q3: APPSC పరీక్షలలో నెగిటివ్ మార్కింగ్ ఉందా?
జ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) నిర్వహించే పరీక్షలలో నెగటివ్ మార్కింగ్ రద్దు చేసింది.
********************************************************************************************
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************