Telugu govt jobs   »   Upcoming exams in March 2024
Top Performing

APPSC, TSPSC and other exams to be held in March 2024 | మార్చి 2024లో జరిగే APPSC, TSPSC మరియు ఇతర పరీక్షలు

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వం, బ్యాంకింగ్ నుండి ఇటీవల అనేక ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. సంబంధింత ఉద్యోగ నోటిఫికేషన్ లకు మార్చి 2024లో పరీక్షలు నిర్వహించనున్నాయి. APPSC గ్రూప్ 1, AP DSC 2024 పరీక్ష. SSC GD, NIACL అసిస్టెంట్, NICL AO, SBI క్లర్క్ మెయిన్స్  వంటి పరిక్షలకు మార్చి నెలలో పరీక్షలు జరగబోతున్నాయి. పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు పరీక్ష తేదీలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది అభ్యర్ధులు సమయాభావం కారణంగా పూర్తి సిలబస్‌ను కవర్ చేయడంలో విఫలమవుతున్నారు. రాబోయే పరీక్ష తేదీలను తెలుసుకోవడం ద్వారా, అభ్యర్ధులు ఒక అధ్యయన ప్రణాళికను సిద్ధం చేయవచ్చు మరియు పూర్తి సిలబస్‌ను సకాలంలో కవర్ చేయవచ్చు. ఈ కధనంలో ఏ పరీక్షా ఏ తేదిలో జరగబోతుందో పరీక్షా షెడ్యూల్ ని తనిఖి చేయండి.

మార్చి 2024లో జరగబోయే APPSC, TSPSC మరియు ఇతర పరీక్షలు

APPSC, TSPSC, SSC, Banking  వంటి వివిధ ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించనున్న పరీక్ష తేదీలు వరుసగా వస్తున్నాయి. ఇప్పటికే ఒకేరోజు రెండు, మూడు పరీక్షలను నిర్వహిస్తున్నారని అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఏ రోజు ఏ పరీక్షా జరగబోతుంది అని అభ్యర్ధులకు ఒక అవగాహన కోసం మేము ఆగష్టు నెలలో జరగబోయే అన్ని పరీక్షల తేదీలను ఇక్కడ పేర్కొన్నాము. ఈ పేజి ని బుక్ మార్కు చేసుకుని, సంబంధిత పరీక్షా కోసం ఎటువంటి ఆందోళన చెందకుండా అభ్యర్ధులు పరిక్షలకు ప్రిపేర్ కావాలి అని మేము ఆశిస్తున్నాము.

APTET ఏపీ టెట్ 2024 హాల్‌టికెట్లు విడుదల_30.1

Adda247 APP

మార్చి 2024లో జరగబోయే పరీక్షల షెడ్యూల్

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభత్వ మరియు రాష్ట్ర ప్రభత్వ సంస్థలు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అర్హులైన అభ్యర్థులు ఇప్పటికే దరఖాస్తు చేసుకుని పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. పలు ఉద్యోగ, ప్రవేశ ప్రకటనలకు సంబంధించి పరీక్షలు మార్చి 2024 నెలలో జరగనున్నాయి. ఇక్కడ మేము మార్చి 2024 లో జరిగే APPSC, TSPSC మరియు ఇతర పరీక్షలు తేదీలను అందించాము.

APPSC గ్రూప్ 1 17 మార్చి 2024
AP DSC 2024 పరీక్ష 15 – 30 మార్చి 2024
AP TET 2024 27 ఫిబ్రవరి 2024 నుండి 9 మార్చి 2024 వరకు
SSC GD 7 మార్చి 2024 వరకు
NIACL అసిస్టెంట్ 2 మార్చి 2024
NICL AO 4 మార్చి 2024
SBI క్లర్క్ మెయిన్స్ 4 మార్చి 2024

AP DSC SGT 2024 | Online Test Series (Telugu) By Adda247 Telugu

మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

APPSC, TSPSC and other exams to be held in March 2024_5.1