Telugu govt jobs   »   Current Affairs   »   Arab companies are going to invest...

Arab companies are going to invest in Telangana state | తెలంగాణ రాష్ట్రంలో అరబ్ కంపెనీలు పెట్టుబడులు పెట్టబోతున్నాయి

Arab companies are going to invest in Telangana state | తెలంగాణ రాష్ట్రంలో అరబ్ కంపెనీలు పెట్టుబడులు పెట్టబోతున్నాయి

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దుబాయ్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా కేటీఆర్ దుబాయ్ టూర్ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ మేరకు కేటీఆర్ టీం సెప్టెంబర్ 5 న పలు వ్యాపార వాణిజ్య సంస్థ ప్రతినిధి బృందాలతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యాపార, వాణిజ్య అనుకూలతలను వారికి కేటీఆర్ వివరించారు. ఇక్కడి పెట్టుబడుల స్నేహపూర్వక వాతావరణాన్ని గురించి తెలియజెప్పారు. టీఎస్ బీపాస్ లాంటి ప్రభుత్వ కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా పలు సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు, తమ కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు ముందుకు వచ్చాయి. సెప్టెంబర్ 5 న రూ.1,040 కోట్ల పెట్టుబడులు రావడం విశేషం.

ప్రముఖ అగ్నిమాపక పరికరాల తయారీ సంస్థ NAFFCO తెలంగాణలో రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడం గమనార్హం. NAFFCO యొక్క CEO, ఖలీద్ అల్ ఖతీబ్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ భాగస్వామ్యంతో అంతర్జాతీయ స్థాయి ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ అకాడమీని స్థాపించడంలో సహకరించడానికి కూడా అంగీకరించారు.

గ్లోబల్ పోర్ట్ ఆపరేటర్ అయిన డిపి వరల్డ్ తెలంగాణలో తన కార్యకలాపాలను విస్తరించడానికి రూ.215 కోట్ల పెట్టుబడి పెట్టింది. హైదరాబాద్‌లోని ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపో కోసం డిపి వరల్డ్ గతంలో రూ.165 కోట్లు కేటాయించింది. మేడ్చల్ ప్రాంతంలో రూ.50 కోట్లతో 5000 ప్యాలెట్ కెపాసిటీ కలిగిన కోల్డ్ స్టోరేజ్ వేర్ హౌజ్ ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేస్తామన్నారు.

తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్, షాపింగ్ మాల్స్, రిటైల్ రంగాల్లో తమ కంపెనీ కార్యకలాపాలపై మంత్రి కేటీఆర్‌తో లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ చర్చించారు. సిరిసిల్లలో రానున్న ఆక్వా క్లాస్టర్‌లో పెట్టుబడులు పెడతామని లూలూ సంస్థ ప్రకటించింది. ఈ ఆక్వా క్లాస్టర్ ద్వారా ఏటా రూ.100 కోట్ల విలువైన ఆక్వా ఉత్పత్తులను సేకరిస్తామని ప్రకటించింది.

చివరగా, తెలంగాణలో గోల్డ్ రిఫైనరీ పెట్టుబడికి పేరుగాంచిన మలబార్ గ్రూప్ రూ.125 కోట్లతో ఫర్నీచర్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, వెయ్యి మందికి పైగా ఉపాధి అవకాశాలను కల్పించనుంది.

Telangana Mega Pack (Validity 12 Months)

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

***************************************************************************

Sharing is caring!

FAQs

తెలంగాణలో పెట్టుబడులు ఎందుకు?

వ్యాపారం చేయడానికి ఉత్తమ రాష్ట్రం. వ్యాపార వెంచర్లు మరియు పెట్టుబడులను ప్రోత్సహించడానికి వినూత్న విధాన కార్యక్రమాలతో తెలంగాణ అభివృద్ధిలో ముందంజలో ఉంది. 2016 నుండి 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'లో తెలంగాణా టాప్-3 రాష్ట్రాలలో స్థిరంగా ఉంది. '