Art & Culture of Telangana MCQS Questions And Answers in Telugu: Art & Culture of Telangana is an important topic in every competitive exam. here we are giving the Art & Culture of Telangana Section which provides you with the best compilation of Art & Culture of Telangana. Art & Culture of Telangana is a major part of the exams like TSPSC Group 2 & TSPSC Group 3. Many aspirants for government exams have benefited from our website now it’s your turn.
This is the best site to find recent updates on Art & Culture of Telangana not only for competitive exams but also for interviews.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
Art & Culture of Telangana MCQs Questions And Answers in Telugu (తెలుగులో)
Q1. ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం ఫణిగిరి ఏ జిల్లాకు చెందినది?
(a) సూర్యాపేట
(b) నల్గొండ
(c) మహబూబ్ నగర్
(d) నిర్మల్
Q2. కింది వాటిలో తెలంగాణ ప్రాంతంలో కోయ తెగలు ఏ జాతరను జరుపుకుంటారు?
(a) సల్లేశ్వరం జాతర
(b) మల్లెల్ల తీర్ధం జాతర
(c) సమ్మక్క సారక్క
(d) మన్ననూరు జాతర
Q3. తెలంగాణలో గాజుల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది?
(a) చందంపేట
(b) లాడ్ బజార్
(c) సిరిసిల్ల
(d) సిద్దిపేట
Q4. “హైదరాబాద్ ఇన్ రెట్రోస్పెక్ట్” అనే పుస్తకాన్ని ఎవరు రాశారు?
(a) మౌల్వీ సయ్యద్ మెహదీ
(b) మౌల్వీ చిరాగ్ అలీ
(c) A.G. నురాణి
(d) అలీ యావర్ జంగ్
Q5. తెలంగాణ కాలాపానీ అని ఏ జైలును పిలుస్తారు?
(a) మన్ననూరు జైలు
(b) చంచల్గూడ జైలు
(c) చర్లపల్లి జైలు
(d) పరకాల జైలు
Q6. ఆర్యసమాజ్ హైదరాబాద్ శాఖ ఏ సంవత్సరంలో స్థాపించబడింది?
(a) 1875
(b) 1892
(c) 1895
(d) 1889
Q7. తెలంగాణలోని క్రింది ఏ జిల్లాలో ఆర్యసమాజ్ నాయకుడు బొలుసుగోడు ఆచారి “సాధనగండి” అనే వ్యాయామశాలను స్థాపించారు?
(a) కరీంనగర్
(b) హైదరాబాద్
(c) నల్గొండ
(d) వరంగల్
Q8. దాశరథి రంగాచార్య కింది వాటిలో ఏ రచనకి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు?
(a) చిల్లరదేవుళ్లు
(b) మోదుగుపూలు
(c) తిమిరంతో సమరం
(d) జనపదం
Q9. ఆదిలాబాద్ జిల్లా యొక్క పురాతన పేరు ఏమిటి?
(a) ఎలగందుల
(b) ఎదులాపురం
(c) మానుకోట
(d) బిక్కవోలు
Q10. బోనాలు పండుగ సందర్భంగా క్రింది ఏ నృత్యం చేస్తారు?
(a) గుస్సాడి నృత్యం
(b) కోయ నృత్యం
(c) గరిగ నృత్యం
(d) పేరిణి శివ తాండవం
Solutions:
S1. Ans(a)
Sol. ఫణిగిరి తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో ఉన్న బౌద్ధ క్షేత్రం.
S2. Ans(c)
Sol. సమ్మక్క సారక్క జాతరను కోయ తెగవారు జరుపుకుంటారు, మిగిలిన మూడు జాతరలను చెంచు తెగవారు జరుపుకుంటారు.
S3. Ans(b)
Sol. లాడ్ బజార్ లేదా చూడి బజార్ హైదరాబాద్లో ఉన్న మార్కెట్, ఇది గాజుల తయారీకి ప్రసిద్ధి చెందింది. లాడ్ అంటే లక్క, దీనిని గాజులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు, దానిపై కృత్రిమ వజ్రాలు పొదిగి ఉంటాయి.
S4. Ans(d)
Sol . “హైదరాబాద్ ఇన్ రెట్రోస్పెక్ట్” పుస్తకాన్ని అలీ యావర్ జంగ్ రాశారు.
S5. Ans(d)
Sol. మన్ననూరు జైలును తెలంగాణ కాలాపాణి అని పిలుస్తారు. ఇది నల్లమల అడవుల్లో అమ్రాబాద్ సమీపంలో ఉంది.
S6. Ans(b)
Sol. 1892లో హైదరాబాద్ ఆర్యసమాజ్ శాఖ సుల్తాన్ బజార్లో స్థాపించబడింది.
S7. Ans(d)
Sol. “సాధనగండి” వ్యాయామశాలను వరంగల్లో ఆర్యసమాజ్ నాయకుడు బొలుసుగోడు ఆచారి స్థాపించారు మరియు దీనిని బత్తిని మొగిలయ్య గౌడ్ అభివృద్ధి చేశారు.
S8. Ans(b)
Sol. మోదుగుపూలు పుస్తకానికి గాను దాశరథి రంగాచార్యకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
మరియు “చిల్లర దేవుళ్ళు” పుస్తకానికి జాతీయ సాహిత్య పురస్కారం లభించింది.
రంగాచార్య గారి ఆత్మకథ: జీవనయానం
S9. Ans(b)
Sol. కుతుబ్ షాహీల పాలనలో ఆదిలాబాద్ యొక్క పురాతన పేరు ఎదులాబాద్. బీజాపూర్ పూర్వపు పాలకుడు మహమ్మద్ యూసుఫ్ ఆదిల్ షా నుండి ఆదిలాబాద్ అనే పేరు వచ్చింది.
S10. Ans(c)
Sol. బోనాల పండుగ సందర్భంగా గరిగ నృత్యం చేస్తారు. గరగ అంటే మట్టిపాత్ర. మట్టితో తయారుచేసిన కుండను ఘటం అంటారు. తలపై కుండ ఉంచి చేసే నృత్యాన్ని గరగ నృత్యం అంటారు.
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |