బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్ మెంట్ 2021: బ్యాంక్ ఆఫ్ బరోడా (బిఒబి) తన అధికారిక వెబ్ సైట్ లో సీనియర్ రిలేషన్ షిప్ మేనేజర్, ఇ – రిలేషన్ షిప్ మేనేజర్, టెరిటరీ హెడ్, గ్రూప్ హెడ్, ప్రొడక్ట్ హెడ్ – ఇన్వెస్ట్ మెంట్ అండ్ రీసెర్చ్, హెడ్ – ఆపరేషన్స్ అండ్ టెక్నాలజీ, డిజిటల్ సేల్స్ మేనేజర్ మరియు ఐటి ఫంక్షనల్ ఎనలిస్ట్ – మేనేజర్ పోస్టుల కోసం దరఖాస్తులను విడుదల చేసింది.ఆసక్తి గల అభ్యర్థులకు దిగువ వ్యాసంలో ముఖ్యమైన తేదీలు, ఖాళీలు, అర్హత, ఎంపిక విధానం, ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ వంటి వివరాలు పేర్కొనబడినది.
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 29, 2021 వరకు అందుబాటులో ఉంటుంది.
Bank of Baroda Recruitment Notification 2021
పూర్తి వివరాలు
బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్మెంట్ 2021 | |
సంస్థ పేరు | బ్యాంక్ ఆఫ్ బరోడా |
పోస్టు పేరు | మేనేజర్ పోస్టు |
ఖాళీలు | 511 |
దరఖాస్తు ప్రారంభ తేదీ | 09 ఏప్రిల్ 2021 |
దరఖాస్తు చివరి తేదీ | 20 ఏప్రిల్ 2021 |
అప్లికేషన్ మోడ్ | ఆన్‌లైన్ |
వర్గం | బ్యాంక్ ఉద్యోగాలు |
ఎంపిక ప్రక్రియ | ఇంటర్వ్యూ |
అధికారిక సైట్ | bankofbaroda.in |
బ్యాంక్ ఆఫ్ బరోడా-ఖాళీల వివరాలు
- మొత్తం 511 మేనేజర్ మరియు హెడ్ పోస్టులను బ్యాంక్ ఆఫ్ బరోడా విడుదల చేసింది.
- పోస్టుల వారీగా ఖాళీ వివరాలు కింద పేర్కొనబడినవి.
పోస్ట్ పేరు | ఖాళీలు |
సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్స్ | 407 |
E-రిలేషన్ షిప్ మేనేజర్స్ | 50 |
టెరిటరీ హెడ్స్ | 44 |
గ్రూప్ హెడ్స్ | 06 |
ప్రోడక్ట్ హెడ్స్ | 01 |
హెడ్స్ | 01 |
డిజిటల్ సేల్స్ మేనేజర్ | 01 |
ఐటి ఫంక్షనల్ అనలిస్ట్ | 01 |
మొత్తం ఖాళీలు | 511 |
విద్య అర్హతలు
పోస్ట్ పేరు | విద్య అర్హతలు |
సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్స్
(Sr. Relationship Managers) |
భారత ప్రభుత్వం ద్వారా గుర్తించబడ్డ యూనివర్సిటీ నుంచి ఏదైనావిభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్)./ప్రభుత్వ సంబంధిత సంస్థలు /ఎఐసిటిఈ. పబ్లిక్ బ్యాంకులు/ప్రయివేట్ బ్యాంకులు/విదేశీ బ్యాంకులు/బ్రోకింగ్ ఫర్మ్ లు/సెక్యూరిటీ ఫర్మ్ లు/అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీలతో వెల్త్ మేనేజ్ మెంట్ లో రిలేషన్ షిప్ మేనేజర్ గా కనీసం 3 సంవత్సరాల అనుభవం. |
E-రిలేషన్ షిప్ మేనేజర్స్
(E-Relationship Managers) |
భారత ప్రభుత్వం ద్వారా గుర్తించబడ్డ యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్)./ప్రభుత్వ సంబంధిత సంస్థలు/ఎఐసిటిఈ. పబ్లిక్ బ్యాంకులు/ప్రయివేట్ బ్యాంకులు/విదేశీ బ్యాంకులు/బ్రోకింగ్ సంస్థలు /సెక్యూరిటీ సంస్థలు /అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీలతో వెల్త్ మేనేజ్మెంట్ లో రిలేషన్ షిప్ మేనేజర్ గా కనీసం 2 సంవత్సరాల అనుభవం లేదా డిజిటల్ మీడియ (టెలిఫోన్/వీడియో లేదా వెబ్) ద్వారా హైవాల్యూ ఫైనాన్షియల్ ప్రొడక్ట్ ల అమ్మకాలు/సేవల్లో 2 సంవత్సరాల అనుభవం. |
టెరిటరీ హెడ్స్
(Territory Heads) |
భారత ప్రభుత్వం ద్వారా గుర్తించబడ్డ యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్)./ప్రభుత్వ సంబంధిత సంస్థలు /ఎఐసిటిఈ. వెల్త్ మేనేజ్ మెంట్ లో రిలేషన్ షిప్ మేనేజ్ మెంట్ లో కనీసం 6సంవత్సరాల అనుభవం, దీనిలో టీమ్ లీడ్ గా కనీసం 2 సంవత్సరాలు |
గ్రూప్ హెడ్స్
(Group Heads) |
భారత ప్రభుత్వం ద్వారా గుర్తించబడ్డ యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్)./ప్రభుత్వ సంబంధిత సంస్థలు…/ఎఐసిటిఈ. ·ఫైనాన్షియల్ సర్వీస్ ఇండస్ట్రీలో వెల్త్ మేనేజ్ మెంట్/రిటైల్ బ్యాంకింగ్/ఇన్వెస్ట్ మెంట్ ల్లో అమ్మకాలనిర్వహణలో కనీసం 10 సంవత్సరాల అనుభవం. · కనీసం 5 సంవత్సరాల పాటు రీజనల్ లెవల్ వద్ద రిలేషన్ షిప్ మేనేజర్ లు మరియు టీమ్ లీడ్ స్ యొక్క పెద్ద టీమ్ ని నిర్వహించాలి. |
ప్రోడక్ట్ హెడ్స్
(Product Heads) |
ఇన్వెస్ట్ మెంట్ అండ్ రీసెర్చ్ – భారత ప్రభుత్వం ద్వారా గుర్తించబడ్డ యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్)./ప్రభుత్వ సంబంధిత సంస్థలు/ఎఐసిటిఈ. ఇన్వెస్ట్ మెంట్స్ ప్రొడక్ట్/అడ్వైజరీ/స్ట్రాటజీ మేనేజర్ గా కనీసం 7 సంవత్సరాల అనుభవం |
హెడ్స్
(Head) |
ఆపరేషన్స్ అండ్ టెక్నాలజీ – భారత ప్రభుత్వం ద్వారా గుర్తించబడ్డ యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్)./ప్రభుత్వ సంబంధిత సంస్థలు /ఎఐసిటిఈ. ఆర్థిక సేవలు, పెట్టుబడి మరియు ప్రైవేట్ బ్యాంకింగ్ లో కనీసం 10 సంవత్సరాల అనుభవం, దీనిలో మిడ్ ఆఫీస్, బ్యాక్ ఆఫీస్ మరియు బ్రాంచీ ఆపరేషన్స్ ఆఫ్ వెల్త్ మేనేజ్ మెంట్ ఏర్పాటు చేయడం మరియు నిర్వహించడంలో కనీసం 8 సంవత్సరాల అనుభవం. |
డిజిటల్ సేల్స్ మేనేజర్
(Digital Sales Manager) |
భారత ప్రభుత్వం ద్వారా గుర్తించబడ్డ యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్)./ప్రభుత్వ సంబంధిత సంస్థలు /ఎఐసిటిఈ. డిజిటల్ ఛానల్ ద్వారా పెట్టుబడి ఉత్పత్తుల అమ్మకాలను నడపడంలో కనీసం 5 సంవత్సరాల అనుభవం. |
ఐటి ఫంక్షనల్ అనలిస్ట్
(IT Functional Analyst) |
భారత ప్రభుత్వం ద్వారా గుర్తించబడ్డ యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్)./ప్రభుత్వ సంబంధిత సంస్థలు /ఎఐసిటిఈ. సంపద నిర్వహణలో సాంకేతిక వేదిక మరియు మౌలిక సదుపాయాలను నిర్మించడం మరియు నిర్వహించడంలో కనీసం 5 సంవత్సరాల అనుభవం. |
వయోపరిమితి (01/04/2021 నాటికి)
పోస్ట్ పేరు | వయో పరిమితి |
సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్స్ | 24 నుండి 35 సంవత్సరాలు |
E-రిలేషన్ షిప్ మేనేజర్స్ | 23 నుండి 35 సంవత్సరాలు |
టెరిటరీ హెడ్స్ | 27 నుండి 40 సంవత్సరాలు |
గ్రూప్ హెడ్స్ | 31 నుండి 45 సంవత్సరాలు |
ప్రోడక్ట్ హెడ్స్ | 28 నుండి 45 సంవత్సరాలు |
హెడ్స్ | 31 నుండి 45 సంవత్సరాలు |
డిజిటల్ సేల్స్ మేనేజర్ | 26 నుండి 40 సంవత్సరాలు |
ఐటి ఫంక్షనల్ అనలిస్ట్ | 26 నుండి 35 సంవత్సరాలు |
దరఖాస్తు ఫీజు
- జనరల్, ఓబిసి అభ్యర్థులు – రూ. 600 / – (అదనంగా వర్తించే GST & లావాదేవీ ఛార్జీలు)
- ఎస్సీ / ఎస్టీ / పిడబ్ల్యుడి / మహిళా అభ్యర్థులు – రూ. 100 / – (ఇన్టిమేషన్ ఛార్జీలు మాత్రమే – తిరిగి చెల్లించబడవు) మరియు వర్తించే GST & లావాదేవీ ఛార్జీలు.
బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్మెంట్ 2021 దరఖాస్తు విధానం
- అధికారిక వెబ్‌సైట్ @ bankofbaroda.in కు వెళ్లండి
- హోమ్‌పేజీలో, స్క్రీన్ పైభాగంలో కనిపించే “Careers” పై క్లిక్ చేయండి.
- తరువాత Recruitment Process>> Current Openings >> Know More.
- మేనేజర్ మరియు ఇతర పోస్టుల నియామకం కోసం Apply Online పై క్లిక్ చేయండి
- అన్ని వివరాలను సరిగ్గా సమర్పించి, submit బటన్ను క్లిక్ చేయండి.
- మీరు దిగువ ఉన్న ప్రత్యక్ష లింక్ నుండి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకోవడానికి లింక్
Click to Apply For Bank of Baroda Recruitment 2021
ఎంపిక విధానం
- షార్ట్ లిస్టింగ్ మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ మరియు/లేదా గ్రూపు డిస్కషన్ మరియు/లేదా ఏదైనా ఇతర ఎంపిక విధానం ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.