Telugu govt jobs   »   Banking Awareness   »   difference-between-banking-and-nbfc

Banking Awarness in Telugu | బ్యాంకులు మరియు NBFC ల మధ్య వ్యత్యాసం | For All Bank Exams

Banking Awareness in Telugu : Overview

Banking Awareness in Telugu : SBI,IBPS RRB,IBPS & RBI వంటి అన్ని బ్యాంకింగ్ పరీక్షలలో స్టాటిక్ అంశాలు,కంప్యూటర్ అవేర్నెస్,బ్యాంకింగ్ అవేర్నెస్ అనే మూడు విభాగాలు ఎంతో ప్రత్యేకమైనది.SBI,IBPS RRB,IBPS & RBI పరీక్షల తుది ఎంపికకు అవసరమైన అదనపు మార్కులను పెంచడంలో సహాయపడుతుంది.SBI,IBPS RRB,IBPS & RBI మెయిన్స్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ రౌండ్లో బ్యాంకింగ్ అవగాహన ప్రశ్నలు అడుగుతారు.ఈ వ్యాసంలో, SBI,IBPS RRB,IBPS & RBI  మరియు అన్ని బ్యాంకు పరీక్షలకు ఉపయోగ పడే విధంగా బ్యాంకింగ్ అవేర్నెస్ విభాగాలలోని ప్రతి అంశాలను మేము అందిస్తున్నాము.

  1. స్టాటిక్ అంశాలు
  2. బ్యాంకుల అవగాహన మరియు
  3. కంప్యూటర్  అవగాహన

Banking Awareness వ్యాసం లో భాగంగా బ్యాంకింగ్ కు సంబంధించిన అంశాలపై పూర్తి విశ్లేషణ మరియు అవగాహన చాల అవసరం. SBI,IBPS RRB,IBPS & RBI వంటి అన్ని పరీక్షలలో Banking Awareness చాలా కీలకం కానున్నది. బ్యాంకు పరీక్షలకు సిద్ధమయ్యే ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ అంశం మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలి. మేము అందించే Banking Awareness వ్యాసం లో మీకు చాప్టర్ ప్రకారం పూర్తి సమాచారం ఇక్కడ మీరు పొందగలరు.

Banking Awareness in Telugu : బ్యాంకులు మరియు NBFC ల మధ్య వ్యత్యాసం

బ్యాంకింగ్ మరియు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC లు) ల మధ్య వ్యత్యాసం : బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు లేదా NBFC లు చాలా కాలం నుండి ఉన్నాయి. డిపాజిటర్లు, రుణగ్రహీతలు మరియు ఇతరులకు ఇవి ఆర్ధికంగా మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. ఇవి అందించే సేవలకు బదులుగా బ్యాంకులు ప్రయోజనం పొందుతాయి మరియు కమీషన్ రేట్లను కూడా పొందడం జరుగుతుంది. ఇవి రుణగ్రహీత నుండి వడ్డీని వసూలు చేస్తాయి మరియు ఇవి పొదుపుదారులకు తక్కువ వడ్డీ రేటు వద్ద నగదును అందిస్తాయి. వీటి మధ్య వ్యత్యాసమే బ్యాంక్ యొక్క సంపాదన అవుతుంది.

బ్యాంకింగ్ మరియు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల మధ్య వ్యత్యాసం (NBFC లు)

బ్యాంకులు అందిస్తున్న వివిధ రకాల సేవలు

  • పొదుపు ఖాతాలు
  • ఫిక్స్డ్ డిపాజిట్ల కోసం కేటాయింపులు
  • వాణిజ్య ఖాతాలు
  • వ్యక్తిగత మరియు వ్యాపార రుణాలు
  • తనఖాలు
  • క్రెడిట్ మరియు డెబిట్ కార్డులు

ఇతర ఆర్థిక సంస్థలు లేదా బ్యాంకింగ్ యేతర ఫైనాన్స్ కంపెనీలుగా ప్రసిద్ది చెందిన NBFC లు ఇలాంటి బ్యాంకింగ్ సేవలను అందిస్తాయి కానీ బ్యాంక్ యొక్క చట్టపరమైన అంశాల కిందకు రావు. వీటిని బ్యాంకింగ్ యేతర ఆర్థిక సంస్థలు అంటారు. ఇవి కూడా ద్రవ్య వ్యవస్థను  మరియు ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నడపడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇవి లైసెన్స్ లేకుండా కూడా పనిచేయవచ్చు. వాటిలో కొన్ని దిగువ జాబితా చేయబడ్డాయి

  • Payday రుణదాతలు
  • భీమా సంస్థలు
  • కరెన్సీ మార్పిడులు
  • చెక్-క్యాషింగ్ సేవలు
  • హెడ్జ్ ఫండ్స్
  • తాకట్టు దుకాణాలు

బ్యాంకింగ్ యేతర ఆర్థిక సంస్థలు మరింత సమగ్రమైన కస్టమర్ పరిధిని కలిగి ఉన్నాయి. కొన్నిసార్లు కొంతమంది కస్టమర్లు వారి ప్రమాణ పరిధిలినికి రాకపోవచ్చు. అందువల్ల ఈ ఆర్థిక సంస్థలు అటువంటి వినియోగదారుల కోసం పరిష్కారాలను అందించే మంచి అవకాశాన్ని కలిగి ఉన్నాయి.

ఉదాహరణలు

  • కస్టమర్ కనీస బ్యాలెన్స్‌ని నిర్వహించడానికి సరిపడా నిధులను కలిగి ఉండకపోవచ్చు కనుక సంప్రదాయ బ్యాంకులో ఖాతా తెరవలేరు.
  • రుణాలు పొందడం కష్టంగా భావించే అల్పాదాయ వర్గంలోని వ్యక్తులు బ్యాంకింగ్ యేతర ఆర్థిక సంస్థలను ఎంచుకుంటారు.
  • తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తులు బ్యాంకుల నుండి క్రెడిట్ పొందడం కూడా కష్టంగా ఉంటుంది. అందువల్ల నాన్-బ్యాంకింగ్ సంస్థలు గొప్ప ప్రత్యామ్నాయాన్ని అందిస్తాయి.
  • హెడ్జ్ ఫండ్స్ పెట్టుబడి ప్రమాదం మీద కంటే వాటి పై వచ్చే  సంభావ్య రాబడిపై ఎక్కువ దృష్టి పెడతాయి. బ్యాంకేతర సంస్థలపై నియంత్రణ లేని కారణంగా  వాటి నిర్వాహకులు బ్యాంక్ కంటే అధిక చెల్లింపును పొందే అవకాశాలను ప్రోత్సహించడానికి అనుమతిస్తుంది.
బ్యాంకులు NBFC
నిర్వచనం బ్యాంకులు ప్రభుత్వం యొక్క అన్ని రకాల బ్యాంకింగ్ సేవలను ప్రజలకు అందించే అధీకృత ఆర్థిక మధ్యవర్తి. NBFC బ్యాంకు లైసెన్స్‌ను కలిగి లేదు కానీ ప్రజలకు ఆర్థిక సేవలను అందించగలదు.
RBI’s  Click Here Click Here
డిమాండ్ డిపాజిట్ అనుమతిస్తుంది అనుమతించదు
విదేశీ పెట్టుబడి ప్రైవేట్ రంగ బ్యాంకులకు 74% వరకు అనుమతించబడింది 100% అనుమతించబడింది
రిజర్వ్ నిష్పత్తుల నిర్వహణ తప్పనిసరి తప్పనిసరి కాదు
క్రెడిట్ సృష్టి బ్యాంకులు క్రెడిట్‌ని సృష్టిస్తాయి NBFC లు క్రెడిట్‌ని సృష్టించవు.

సాంప్రదాయ బ్యాంకింగ్ నుండి మీరు ఏమి ఆశించవచ్చు?

ఈ బ్యాంకులు నియంత్రించబడతాయి మరియు దేశంలోని అగ్ర బ్యాంకులు జాతీయం చేయబడ్డాయి, అంటే ఇవి  ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి. బ్యాంకులు పెట్టుబడులు పెట్టేటప్పుడు లేదా రుణాలు ఇచ్చేటప్పుడు ప్రమాదాల సంఖ్యతో పాటు ఎదుర్కొనే  ప్రమాదాల స్థాయిపై కూడా  నిబంధనలు విధిస్తుంది. మనీ మార్కెట్‌లో అవకాశం వచ్చినప్పుడు వారి పాలసీలు నిబంధనలను ఉల్లంఘించడానికి లేదా విభిన్నంగా పని చేసే సౌలభ్యాన్ని కల్పించవు.

పేలవమైన క్రెడిట్ ఉన్న వ్యక్తులు అధిక వడ్డీకి కూడా ఏదైనా బ్యాంకు డబ్బును అప్పుగా తీసుకోవడం చాలా కష్టం. బ్యాంకులు రుణాల కోసం నిర్ణీత రేట్లు మరియు రుణం ఇవ్వాల్సిన మొత్తాన్ని కలిగి ఉంటాయి మరియు మూలధన అవసరాల కారణంగా వారు అంతకు మించి అప్పు ఇవ్వలేరు.

కరెన్సీ మార్కెట్‌లో తరచుగా హెచ్చుతగ్గులు ఉన్నందున, విదేశాలలో వ్యాపారం చేసే బ్యాంకులు నిబంధనల కారణంగా గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి, మరియు చాలా కరెన్సీలకు డాలర్ బలమైన పోటీగా ఉండటం వలన చాల బ్యాంకులను తమ పోటీ స్థాయి కంటే తక్కువ స్థానాన్ని పొందడం జరుగుతుంది. కాలక్రమేణా సేవా ఛార్జీలు కూడా  పెరిగాయి, ఇది సాంప్రదాయ బ్యాంకులకు ఖరీదైన వ్యవహారం.

బ్యాంకింగ్ యేతర ఆర్థిక సంస్థలు ఏమి అందిస్తున్నాయి?

బ్యాంకింగ్ యేతర సంస్థలు బ్యాంక్‌తో పోలిస్తే ఎక్కువ రిస్క్ కలిగివున్నాయి. 

  • తక్కువ లేదా సున్నా క్రెడిట్ స్కోరు ఉన్న వ్యక్తులకు రుణాలు ఇవ్వడం
  • వారు ఇచ్చే కొన్ని రకాల రుణాలకు తనఖా అవసరం కాకపోవచ్చు
  • సౌకర్యవంతమైన వడ్డీ రేట్లు మరియు వాయిదాలను అందించడం 
  • ప్రతి రుణానికి సంబంధించి తిరిగి చెల్లించవలసిన కాల వ్యవధిని కూడా చర్చించవచ్చు

బ్యాంకింగ్ యేతర సంస్థలు రుణాలు మరియు ఇతర బ్యాంకింగ్  సౌకర్యాలను అందించడానికి అనేక స్థాయిలలో సడలించినప్పుడు, అవి కూడా మరల తిరిగి పుంజుకోవలసిన అవసరం కూడా ఉంటుంది. ఇవి అధిక వడ్డీని వసూలు చేయడం ద్వారా అలా చేస్తారు. కొన్నిసార్లు ఈ వడ్డీ మితిమీరినదిగా అనిపించవచ్చు, కానీ కొన్నిసార్లు బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా లేనప్పుడు వినియోగదారులకు అవకాసం ఉండదు, ఏదో ఒక రకమైన ఉపశమనం కోసం ఈ బ్యాంకింగ్ యేతర సంస్థలను తనిఖీ చేయడం వారికి ఉన్న ఏకైక మార్గం. ఇటువంటి సంస్థలలో ఎకౌంటులు  బీమా చేయబడాలని మీరు తెలుసుకోవాలి మరియు చెల్లింపు చెక్ ద్వార డబ్బును పొందేటప్పుడు వీటికి ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

To download ChapterWise BankingAwareness PDF in Telugu-Click Here

Banking Awareness in Telugu : Conclusion

Banking Awareness మెయిన్స్ పరీక్షలో చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే Banking Awareness కోసం ఒక ప్రత్యేక విభాగం ఉన్న SBI,IBPS RRB,IBPS,RBI & SEBI వంటి అనేక పరీక్షలు ఉన్నాయి. ఇంటర్వ్యూలో ఈ విభాగం మీకు మరింత ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇంటర్వ్యూ మొత్తం Banking Awareness ఆధారంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ అంశంపై బాగా ప్రావీణ్యం కలిగి ఉంటే SBI,IBPS RRB,IBPS,RBI & SEBI వంటి అనేక పరీక్షలలో రాణించవచ్చు.

Banking Awareness in Telugu : FAQs

Q 1. Banking Awareness కోసం ఉత్తమమైన సమాచారం ఎక్కడ లభిస్తుంది?

జ. Adda247 అందించే Banking Awareness సమాచారం చాలా ఉత్తమమైనది. ఇది adda247 APPలో మీకు లభిస్తుంది.

Q 2. Banking Awareness విభాగం కోసం ఎలా సిద్ధం కావాలి?

. అప్‌డేట్-సోర్స్(తాజా వార్తలు) మరియు ఆర్‌బిఐ అధికారిక వెబ్‌సైట్ నుండి బ్యాంకింగ్ అవగాహన కై సిద్ధం కావాలి, తద్వారా మీకు తాజా వాస్తవాలు,సమాచారాలు  తెలుస్తాయి.

Q 3. బ్యాంకింగ్ అవగాహన మరియు ఆర్థిక అవగాహన భిన్నంగా ఉంటుందా?

. అవి భిన్నంగా ఉంటాయి కాని పరీక్షా కోణం కై బ్యాంకింగ్‌లో భాగంగా ఆర్థిక అవగాహనను అధ్యయనం చేయాల్సి ఉంటుంది.

Q 4. బ్యాంకింగ్ అవగాహనకు సిద్ధం కావాల్సిన  ముఖ్యమైన అంశాలు ఏమిటి?

. బ్యాంకింగ్ చరిత్ర మరియు బ్యాంకింగ్, ఆర్‌బిఐ నిర్మాణం మరియు విధులు,భారత దేశంలోని కరెన్సీ సర్క్యులేషన్ అండ్ మేనేజ్‌మెంట్ – లెండింగ్ రేట్లు, భారతదేశంలో బ్యాంకుల జాతీయికరణ, ద్రవ్య విధానం, భారతదేశంలో బ్యాంకు ఖాతాల రకాలు, ఆర్థిక చేరికలు, MCLR, NPA-నాన్-పెర్ఫార్మింగ్ అసెట్స్(ఆస్తులు), సెక్యూరిటైజేషన్ అండ్ ఫైనాన్షియల్ అసెట్స్ల (ఆస్తుల)పునర్నిర్మాణం మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్, సెక్యూరిటీ ఇంటరెస్ట్ (SARFAESI) చట్టం, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC).

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

 

Sharing is caring!

Banking Awarness in Telugu | బ్యాంకులు మరియు NBFC ల మధ్య వ్యత్యాసం_3.1