Telugu govt jobs   »   Latest Job Alert   »   BDL Recruitment Walk in interviews for...

BDL Recruitment Walk in interviews for 361 posts | బిడిఎల్ రిక్రూట్మెంట్ 361 ఖాళీలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ

BDL లేదా భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనేది మినీ రత్నా కేటగిరిలో ప్రభుత్వ రంగ సంస్థ. దీనిని 1970 లో స్థాపించారు ఇది ప్రధానంగా రక్షణ రంగానికి సంభందించిన యాంటీ టాంక్ గైడెడ్ మిసైల్స్ తో పాటు ఇతర పరికరాలని తయారుచేస్తుంది. BDL వాక్ ఇన్ ఇంటర్వ్యూ విధానంలో 361 ఖాళీలకు ఆసక్తి గల అభ్యర్ధులనుంచి దరఖాస్తులని ఆహ్వానిస్తోంది. ఈ కధనం లో BDL ప్రాజెక్టు ఇంజనీర్, ప్రాజెక్టు ఆఫీసర్, ప్రాజెక్టు డిప్లొమా అసిస్టెంట్, ప్రాజెక్టు ట్రేడ్ అసిస్టెంట్, ప్రాజెక్టు అసిస్టెంట్, ప్రాజెక్టు ఆఫీసు అసిస్టెంట్ ఖాళీలను పూరించనున్నారు. BDL వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా హైదరాబాద్, విశాఖపట్నం, సంగారెడ్డి, బెంగళూరు లో ఉన్న కార్యాలయాలో అభ్యర్ధులని నియమించనున్నారు.

 

TSPSC AE Syllabus 2022, Download Syllabus pdf |_70.1

APPSC/TSPSC Sure shot Selection Group

BDL వాక్ ఇన్ ఇంటర్వ్యూ అవలోకనం

BDL వాక్ ఇన్ ఇంటర్వ్యూ అవలోకనం
సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్
పోస్ట్ వివిధ పోస్ట్లు
ఖాళీలు 361
ఎంపిక విధానం ఇంటర్వ్యూ
అప్లికేషన్ ప్రారంభ తేదీ 24 జనవరి 2024
దరఖాస్తు చివరి తేదీ 14 ఫిబ్రవరి 2024
అధికారిక వెబ్ సైట్ https://bdl-india.in/

BDL రిక్రూట్మెంట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్

BDL వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా మొత్తం 361 ఖాళీలకు నోటిఫికేషన్ PDFని విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్ www.bdl-india.inలో 361ఖాళీలకు ప్రాజెక్టు ఇంజనీర్, ప్రాజెక్టు ఆఫీసర్, ప్రాజెక్టు డిప్లొమా అసిస్టెంట్, ప్రాజెక్టు ట్రేడ్ అసిస్టెంట్, ప్రాజెక్టు అసిస్టెంట్, ప్రాజెక్టు ఆఫీసు అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. BDL వాక్ఇన్ ఇంటర్వ్యూ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లో BDL రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, అర్హత ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియ, జీతం వంటి వివరాలు అందించారు. ఆసక్తిగల అభ్యర్థులు మొత్తం BDL రిక్రూట్‌మెంట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ 2024 ఖాళీలని తనిఖీ చేయండి. BDL వాక్ ఇన్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్ 2024 PDFని ఈ దిగువన లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

BDL రిక్రూట్మెంట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్ PDF

BDL రిక్రూట్మెంట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఖాళీలు

BDL రిక్రూట్మెంట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా మొత్తం 361 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రాజెక్టు ఇంజనీర్, ప్రాజెక్టు ఆఫీసర్, ప్రాజెక్టు డిప్లొమా అసిస్టెంట్, ప్రాజెక్టు ట్రేడ్ అసిస్టెంట్ విభాగాలలో మొత్తం 361 ఖాళీలను భర్తీ చేస్తారు. విభాగాల వారీగా ఖాళీలు ఈ కింద పట్టికలో తనిఖీ చేయండి.

పోస్ట్ పేరు  ఖాళీలు  వర్గాల వారీగా ఖాళీలు
ప్రాజెక్టు ఇంజనీర్/ ఆఫీసర్ 136 UR-57, EWS-14, OBC-32, SC-24, ST-9
ప్రాజెక్టు డిప్లొమా అసిస్టెంట్/ అసిస్టెంట్స్ 142 UR-58, EWS-14, OBC-39, SC-21, ST-10
ప్రాజెక్టు ట్రేడ్ అసిస్టెంట్స్/ ఆఫీసు అసిస్టెంట్స్ 83 UR-41, EWS-8, OBC-16, SC-12, ST-6

విభిన్న ప్రతిభా వంతులు లేదా PWBD లకి మొత్తం 23 ఖాళీలు కేటాయించారు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ తనిఖీ చేయండి.

BDL రిక్రూట్మెంట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అర్హతా ప్రమాణాలు

విద్యార్హతలు

పోస్ట్  విద్యార్హతలు
ప్రాజెక్టు ఇంజనీర్ (మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలెక్ట్రికల్, కంప్యూటరు సైన్స్, సివిల్, కెమికల్, ఎన్విరాన్మెంట్, మెటలర్జి) AICTE గుర్తింపు పొందిన కళాశాల నుంచి 60% మార్కులతో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి
ప్రాజెక్టు ఆఫీసర్ (బిజినెస్ డెవలప్మెంట్) గుర్తింపు పొందిన కళాశాల నుంచి MBA 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి
ప్రాజెక్టు ఆఫీసర్ (HR) గుర్తింపు పొందిన కళాశాల నుంచి MBA HR/PM&IR వంటి కోర్సులలో 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి
ప్రాజెక్టు ఆఫీసర్ (ఫైనాన్స్) CA/ICWA లేదా MBA ఫైనాన్స్ లో 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి
ప్రాజెక్టు డిప్లొమా అసిస్టెంట్ (మెకానికల్, ఎలక్ట్రానిక్స్ , ఎలెక్ట్రికల్, కంప్యూటర్స్, సివిల్, కెమికల్, మెటలర్జి) గుర్తింపు పొందిన కళాశాల నుండి డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి
ప్రాజెక్టు అసిస్టెంట్ (ఫైనాన్స్) కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి
ప్రాజెక్టు అసిస్టెంట్ (HR) బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ వెల్ఫేర్, HR, లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి
ప్రాజెక్టు ట్రేడ్ అసిస్టెంట్ సంభందిత ITI ట్రేడ్ లో ఉత్తీర్ణులై ఉండాలి
ప్రాజెక్టు ఆఫీసు అసిస్టెంట్ DCCP లేదా DCP కోర్సు పూర్తి చేసి ఉండాలి

వయోపరిమితి

  • జనరల్ లేదా EWS అభ్యర్ధులకి 14 జనవరి 2024 నాటికి 28 సంవత్సరాల లోపు ఉండాలి.
  • SC, ST, OBC, PWBD అభ్యర్ధులకి వయో సడలింపు ఉంది.

BDL రిక్రూట్మెంట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అప్లికేషన్ లింకు

BDL రిక్రూట్మెంట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ పోస్ట్ లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు అధికారిక వెబ్ సైటు https://bdl-india.in/ లో కెరీర్స్ పేజీని తనిఖీ చేయండి లేదా కింద అందించిన లింకు ద్వారా తమ దరఖాస్తు ని సమర్పించండి.

BDL రిక్రూట్మెంట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అప్లికేషన్ లింకు

BDL రిక్రూట్మెంట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ దరఖాస్తు రుసుము

BDL రిక్రూట్మెంట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు దరఖాస్తు రుసుము తప్పనిసరిగా చెల్లించాలి వివిద పోస్ట్ లకు దరఖాస్తు రుసుము ఈ దిగువన పట్టిక లో అందించాము తనిఖీ చేయండి.

ప్రాజెక్టు ఇంజనీర్/ ప్రాజెక్టు ఆఫీసర్  ప్రాజెక్టు డిప్లొమా అసిస్టెంట్, ప్రాజెక్టు ట్రేడ్ అసిస్టెంట్, ప్రాజెక్టు అసిస్టెంట్, ప్రాజెక్టు ఆఫీసు అసిస్టెంట్,
Gen/UR, EWS, OBC 300 200
ఇతరులు

BDL రిక్రూట్మెంట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూకి కావలసిన సర్టిఫికేట్లు 

BDL వాక్ ఇన్ ఇంటర్వ్యూకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు తగిన సర్టిఫికేట్లను జిరాక్స్ తో పాటు సంభందిత తేదీన హాజరు కావలసి ఉంటుంది.

  • రిజిస్ట్రేషన్ స్లీప్
  • బయో డేటా
  • ఆధార్ కార్డు
  • SSC/ 10 వ తరగతి మేమో
  • ఇంటర్/ డిప్లొమా/ ITI లేదా తత్సమాన విద్యార్హత సర్టిఫికేట్
  • NAC (నేషనల్ అప్రెంటీస్షిప్ సర్టిఫికేట్)
  • డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణత సర్టిఫికేట్లు
  • ఎక్స్పీరియన్స్ లెటర్, సేలరీ పే స్లీప్

అనుభవం

ఒక సంవత్సరం సంభందిత విభాగంలో పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి, అప్రెంటిస్షిప్ ని కూడా అనుభవంగా పరిగణిస్తారు.

ఉపాధి పదవీకాలం

సంభందిత విభాగంలో ఎంపికైనా అభ్యర్ధులు గరిష్టంగా 4 సంవత్సరాల వరకు పోస్ట్ లో ఉంటారు.

BDL రిక్రూట్మెంట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ప్రదేశాలు

BDL వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు సంబందిత తేదీన BDL ఆఫీసు కి వెళ్ళాల్సి ఉంటుంది. హైదరాబాద్, కర్ణాటక, విశాఖపట్నం లలో 17 నుంచి 25 వరకు BDL ఇంటర్వ్యూ లు జరుగుతాయి పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ తనిఖీ చేయండి.

APPSC Group 2 Prelims Quick Revision MCQs Batch | Online Live Classes by Adda 247

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు  క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!