Telugu govt jobs   »   Current Affairs   »   Bhumana Karunakar Reddy took oath as...

Bhumana Karunakar Reddy took oath as the Chairman of TTD | టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు

Bhumana Karunakar Reddy took oath as the Chairman of TTD | టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు

ఆగస్టు 10వ తేదీ ఉదయం శ్రీవారి ఆలయంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ ప్రాంగణంలో గరుడాళ్వార్ సన్నిధిలో టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి ఆయన చేత ప్రమాణం చేయించారు.

వైయస్‌ఆర్‌ జిల్లా నందలూరు మండలం ఈదరపల్లెలో జన్మించిన భూమన కరుణాకర్‌రెడ్డి. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివారు. వామపక్ష భావజాలంతో ఉన్న ఆయన తర్వాత అధ్యాత్మికత వైపుకు మళ్లారు. గతంలోనూ 2006 నుంచి 2008 వరకు టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా పనిచేశారు.

దీంతో ఆయన కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు.ప్రమాణ స్వీకారం అనంతరం అన్నమయ్య భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకే మొదటి ప్రాధాన్యం ఇస్తానని, ఎట్టిపరిస్థితుల్లోనూ ధనవంతులకు ఊడిగం చేయబోనని భూమన అన్నారు.

తన నియమాకానికి సహకరించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి భూమన కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకల్లో ప్రముఖులు మంత్రులు రోజా, అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆరణి శ్రీనివాసులు, జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

APPSC GROUP-2 2023 Prelims and Mains Chapter wise and Subject Wise Practice Tests Online Test Series in Telugu and English By Adda247

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

తిరుమల పాత పేరు ఏమిటి?

అందువల్ల ఈ ప్రదేశానికి కలియుగ వైకుంఠ అని పేరు వచ్చింది మరియు ఇక్కడి దేవతను కలియుగ ప్రత్యక్ష దైవం అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని తిరుమల ఆలయం, తిరుపతి ఆలయం మరియు తిరుపతి బాలాజీ ఆలయం వంటి ఇతర పేర్లతో కూడా పిలుస్తారు. వెంకటేశ్వరుని అనేక ఇతర పేర్లతో పిలుస్తారు: బాలాజీ, గోవింద మరియు శ్రీనివాస.