Telugu govt jobs   »   Budgeted vs Actual Expenditure of Telangana

Budgeted vs Actual Expenditure of Telangana, Download PDF | తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అంచనాలు-వాస్తవ వ్యయం

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అంచనాలు-వాస్తవ వ్యయం

రాష్ట్ర ప్రభుత్వము యొక్క బడ్జెట్ అంచనాల ఆధారంగా ప్రణాళికా బద్దమైన ఖర్చులు గత ఆర్థిక సంవత్సరములో చేయబడుతాయి. ప్రభుత్వం వాస్తవానికి ఒక ఆర్ధిక సంవత్సరంలో అంటే ప్రస్తుత సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుండి వచ్చే సంవత్సరపు మార్చి 31 వరకు ఆ లక్ష్యాలను సాధించడం కోసం ఖర్చు చేసిన మొత్తాన్ని సూచిస్తుంది. బడ్జెట్ అంచనాలకు వాస్తవ వ్యయం నిష్పత్తి, బడ్జెట్ విశ్వసనీయత యొక్క కొలమానం అని కూడా పిలుస్తారు. ఇది ప్రణాళిక ప్రక్రియ యొక్క నాణ్యతను మరియు బడ్జెట్ క్రమశిక్షణకు కట్టుబడి ఉండడాన్ని సూచిస్తుంది.

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

బడ్జెట్ అంచనాలు Vs వాస్తవ వ్యయం

S.no Year Budget Estimates (Rs. crore) Actual Exp as % of Budgeted Exp Expenditure (Rs. crore)
1 2014-15 1,00,638 62,306 61.9%
2 2015-16 1,15,689 97,811 84.5%
3 2016-17 1,30,416 1,21,735 93.3%
4 2017-18 1,49,646 1,20,211 80.3%
5 2018-19 1,74,454 1,35,328 77.6%
6 2019-20 1,46,492 1,42,857 97.5%
7 2020-21 1,82,914 1,57,547 86.1%
8 2021-22 2,30,726 1,82,998 79.3%
9 2022-23 (Prov.) 2,56,859 2,04,085 79.5%
Total 14,87,834 12,24,877 82.3%
10 2023-24 (BE) 2,90,396 1,48,0531 51.0%

2014-15 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి, రాష్ట్ర బడ్జెట్ అంచనాలు మరియు వాస్తవ వ్యయ గణాంకాలు పైన చూపబడ్డాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ₹1,00,638 కోట్లతో ప్రారంభమైన బడ్జెట్ అంచనాలు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ₹2,56,859 కోట్లకు పెరిగాయి.

వాస్తవ వ్యయ గణాంకాలు కూడా 2014-15 ఆర్ధిక సంవత్సరంలో ₹62,306 కోట్ల నుండి 2022-23 ఆర్థిక సంవత్సరంలో ₹2,04,085 కోట్లకు పెరిగాయి.

అయితే మొత్తం బడ్జెట్ అంచనాలలో వాస్తవ వ్యయ శాతం వాటా ఆందోళనకరంగా ఉంది. బడ్జెట్ అంచనాల శాతంలో వాస్తవ వ్యయం 2014-15 ఆర్థిక సంవత్సరంలో కనిష్ట స్థాయి (61.9% ) వద్ద ఉంది. 2014-23 మధ్య కాలంలో సగటున తెలంగాణ బడ్జెట్ వ్యయంలో 82.3% మాత్రమే ఖర్చు చేసింది.

సాధారణ కేటగిరీ రాష్ట్రాలు: మొత్తం వ్యయ బడ్జెట్ అంచనాలు vs. వాస్తవ వ్యయం (2021-22)

Sl.No. State Budget Estimates (Rs. crore) Actual Expenditure (Rs. crore) Actual Exp as % of Budgeted Exp
1 Rajasthan 2,50,247 2,91,191 116.4%
2 Karnataka 2,31,642 2,61,932 113.1%
3 Madhya Pradesh 2,17,123 2,40,186 110.6%
4 Kerala 1,62,032 1,63,226 100.7%
5 Maharashtra 4,37,961 4,34,825 99.3%
6 Gujarat 2,23,333 2,14,113 95.9%
7 Tamil Nadu 3,29,035 3,14,419 95.6%
8 West Bengal 2,78,727 2,60,092 93.3%
9 Odisha 1,70,000 1,53,797 90.5%
10 Goa 21,644 19,530 90.2%
11 Chhattisgarh 1,05,213 94,683 90.0%
12 Bihar 2,18,303 1,93,123 88.5%
13 Haryana 1,27,484 1,10,437 86.6%
14 Jharkhand 91,277 77,865 85.3%
15 Andhra Pradesh 2,29,779 1,91,594 83.4%
16 Uttar Pradesh 5,50,271 4,39,963 80.0%
17 Telangana 2,30,726 1,82,998 79.3%
18 Punjab 1,68,015 1,25,501 74.7%

Note:సాధారణ రాష్ట్రాలు అనగా దేశంలోని 92% జనాభాకు ప్రాతినిద్యం వహిస్తున్న 18 రాష్ట్రాలు. ఈ రాష్ట్రాలు భారత ప్రభుత్వం నుండి ఏ విధమైన ప్రత్యేక నిధులు పొందవు

  • 2021-22 ఆర్థిక సంవత్సరంలో అంచనా బడ్జెట్ వ్యయంలో 79.3% మాత్రమే ఖర్చు చేయడంతో, తెలంగాణ రాష్ట్ర పనితీరు దేశంలో చివరి నుండి రెండవ స్థానంలో ఉంది. తెలంగాణ కంటే పంజాబ్ మాత్రమే బడ్జెట్ అంచనాలకు (74.7% వద్ద) వాస్తవ వ్యయంలో తక్కువ నిష్పత్తిని కలిగి ఉంది.
  • నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అంచనాలు మరియు ఖర్చుల మధ్య అంతరం 20% గా ఉంది. ఇది ఇతర రాష్ట్రాలలో కేవలం 5% మాత్రమే.
  • వాస్తవానికి, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్ మరియు రాజస్ధాన్ వంటి కొన్ని రాష్ట్రాలలో, బడ్జెట్ అంచనాల కంటే ఎక్కవ వ్యయం చేయడం జరిగింది. అందువల్ల, ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో లోపభూయిష్టమైన మరియు వాస్తవ విరుధ్ధమైన అంచనాలతో బడ్జెట్ ను రూపొందించడం జరిగింది.
  • 2004-2014 మధ్య 10 సంవత్సరాల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ అంచనాలకు వాస్తవ వ్యయానికి మధ్య సరాసరి వ్యత్యాసం కేవలం 13% మాత్రమే.

తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ఖర్చులను సాధించలేకపోవడానికి కారణం బడ్జెట్ రాబడి అంచనాల కంటే వాస్తవ రాబడులలో లోటు కారణంగా చెప్పవచ్చు. బడ్జెట్ తయారీ దశలోనే నిర్దేశించబడిన ప్రతిష్టాత్మక వ్యయ లక్ష్యాలు ఎన్నడూ సాధించబడలేదు. బడ్జెట్ వ్యయాలు మరియు వాస్తవ రాబడుల మధ్య అంతరాన్ని తగ్గించే వాస్తవిక బడ్జెట్ పద్ధతులను రూపొందించడంపై దృష్టి సారించి, రాష్ట్రంలో బడ్జెట్ అంచనా విధానాలను హేతుబద్ధీకరించాల్సిన అవసరాన్ని ఈ నివేదిక తెలియజేస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్ర శాసనసభకు సమర్పించిన అన్ని ఆడిట్ నివేదికలలో కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు C&AG చే చేయబడ్డాయి.

TSPSC GROUP-2, GROUP-3 General Studies Online Test Series in Telugu and English By Adda247

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు Youtube Official Channel ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!