APPSC & TSPSC,SI,Banking,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా Adda247 ద్వారా అందించబడుతుంది.
C.R.రావు గోల్డ్ మెడల్ అవార్డు విజేతలను ప్రకటించబడింది : ఇండియన్ ఎకానోమెట్రిక్ సొసైటీ (TIES) ట్రస్ట్, ప్రొఫెసర్ C.R. రావు సెంటినరీ గోల్డ్ మెడల్ అవార్డుకు ఇద్దరు ప్రఖ్యాత ఆర్థికవేత్తలను ఎంపిక చేసింది. ప్రఖ్యాత ఆర్థికవేత్తలు జగదీష్ భగవతి మరియు సి.రంగరాజన్ లకు ప్రొఫెసర్ సి.ఆర్ రావు సెంటినరీ గోల్డ్ మెడల్ (CGM) లభించింది. భగవతి కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్, లా మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రొఫెసర్ కాగా, సి రంగరాజన్ మాజీ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ మాజీ ఛైర్మన్ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్.
అవార్డు గురించి :
TIES ట్రస్ట్ అవార్డు గ్రహీతలను షార్ట్ లిస్ట్ చేయడానికి జ్యూరీని ఏర్పాటు చేసింది. జ్యూరీ సిఫార్సుల ఆధారంగా, ఇద్దరు విశిష్ట పండితులకు ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ అవార్డు రెండు సంవత్సరాలకు ఒకసారి భారతీయ లేదా భారతీయ సంతతికి చెందిన పండితుడికి అందజేస్తారు.
ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి: