Table of Contents
ToggleTGPSC నిర్ణయం: బ్యాక్‌లాగ్‌ల నివారణ కోసం అవరోహణ క్రమం
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్స్ పరీక్షల ఫలితాల విడుదల మరియు పోస్టుల భర్తీ ప్రక్రియలో అవరోహణ క్రమం పాటించనున్నట్లు తెలిపింది. TGPSC గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగినప్పటికీ, గ్రూప్-3 పరీక్షలు నవంబర్ 17, 18 తేదీల్లో పూర్తి అయ్యాయి. TGPSC గ్రూప్-2 పరీక్షలు డిసెంబర్ 15, 16 తేదీల్లో జరగనున్నాయి. కానీ ఫలితాల విడుదలకు సంబంధించిన క్రమాన్ని TGPSC మార్చినట్లు తెలుస్తోంది.
గ్రూప్-1, 2 తరువాతే గ్రూప్-3: TGPSC అవరోహణ క్రమానికి పట్టం
అవరోహణ క్రమంలో పోస్టుల భర్తీ నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అవరోహణ క్రమాన్ని అనుసరించాలని TGPSC బోర్డు నిర్ణయించింది. గ్రూప్-1, 2, 3 పరీక్షల ఫలితాల విడుదల, పోస్టుల భర్తీ ప్రక్రియలో స్పష్టమైన క్రమాన్ని పాటించడం ద్వారా బ్యాక్‌లాగ్‌లను నివారించడమే ఈ విధానానికి ప్రధాన ఉద్దేశ్యం.
పరీక్షల తేదీలు మరియు ప్రాధాన్యత
- గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 27 వరకూ జరిగినవి.
- గ్రూప్-3 పరీక్షలు నవంబర్ 17, 18 తేదీల్లో పూర్తయ్యాయి.
- గ్రూప్-2 పరీక్షలు ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్నాయి.
Adda247 APP
మొదట గ్రూప్-1, తరువాత గ్రూప్-2, చివరగా గ్రూప్-3
TGPSC నిర్ణయం ప్రకారం, ఫలితాల విడుదలలో మొదటగా గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల చేసి, ఆ పోస్టుల భర్తీ పూర్తి చేసిన తర్వాతే గ్రూప్-2 ఫలితాలను ప్రకటించనుంది. ఆ తరువాత గ్రూప్-3 ఫలితాలు విడుదల చేయడం జరుగుతుంది.
మెరిట్ అభ్యర్థులకు సమాన అవకాశాలు
గ్రూప్-1 లాంటి ఉన్నత కేటగిరీ పోస్టుల భర్తీ పూర్తయిన తర్వాతే కింది కేటగిరీల భర్తీ చేపట్టడం ద్వారా మెరిట్ ఉన్న నిరుద్యోగులు తగిన అవకాశాలు పొందేలా చూడాలని TGPSC భావిస్తోంది. రీలింక్విష్‌మెంట్ విధానం లేనందున, ఈ విధానం సరైన పరిష్కారంగా కనిపిస్తోంది. అలాగే ఉన్నత కేటగిరీ పోస్టుల భర్తీ తర్వాత కింది స్థాయి పోస్టుల భర్తీ చేయడం ద్వారా బ్యాక్‌లాగ్‌ల సమస్యలను నివారించవచ్చని కమిషన్ భావన.
ఫిబ్రవరిలో TGPSC గ్రూప్-1 ఫలితాలు
TGPSC గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ఫిబ్రవరిలోగా ప్రధాన పరీక్షల ఫలితాలు ప్రకటించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అనంతరం ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరిపి మార్చి 2025 నాటికి నియామక ప్రక్రియ పూర్తిచేయాలని కమిషన్ భావిస్తోంది. ఆ తరువాత పెట్టుకుంది గ్రూప్-2 ఫలితాలు విడుదల చేసి, ఆ పోస్టుల భర్తీ చేపట్టనుంది. నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించిన గ్రూప్-3 పరీక్షల ద్వారా 1,388 పోస్టులు భర్తీ చేయడానికి TGPSC సిద్ధమైంది. ఈ పరీక్షల మూల్యాంకన త్వరలో ప్రారంభం కానుంది. మొత్తం గ్రూప్ పోస్టుల భర్తీ ప్రక్రియను వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని TGPSC అభిప్రాయపడుతోంది.
ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక నంబర్
గ్రూప్స్ ఉద్యోగాలకు సంబంధించిన దళారుల సంప్రదింపుల గురించి ఫిర్యాదు చేయడానికి TGPSC ప్రత్యేక విజిలెన్స్ సెల్ నంబర్ 99667 00339ను అందుబాటులో ఉంచింది. దళారులు తప్పుడు హామీలు ఇస్తూ అభ్యర్థులను సంప్రదిస్తే వెంటనే ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. అలాగే vigilance@tspsc.gov.in ఈ-మెయిల్ లోనూ ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చని TGPSC కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు.
దళారులపై అప్రమత్తంగా ఉండండి
- విజిలెన్స్ సెల్ నంబర్: 99667 00339
- ఫిర్యాదుల కోసం ఈ-మెయిల్: vigilance@tspsc.gov.in
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు Youtube Official Channel | ఇక్కడ క్లిక్ చేయండి |
Sharing is caring!