Chinta Ravi Balakrishna Receives Potti Sriramulu Telugu University Merit Award | పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మెరిట్ అవార్డును అందుకున్న చింతా రవి బాలకృష్ణ
ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు, సిద్దేంద్రయోగి కూచిపూడి నాట్య కళాపీఠం ప్రిన్సిపాల్ డాక్టర్ చింతా రవి బాలకృష్ణను సెప్టెంబర్ 12 న హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మక మెరిట్ అవార్డుతో సత్కరించింది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య తంగెడ కిషన్‌రావు సమక్షంలో కళాపీఠం ప్రిన్సిపాల్ డాక్టర్ వేదాంతం రామలింగశాస్త్రి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.
హైదరాబాదు లోని తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో డాక్టర్ నందమూరి తారకరామారావు కళామందిరంలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వపు ఉప కులపతి, ప్రస్తుత కంచి విశ్వవిద్యాలయం ఛాన్స్లర్ ఆచార్య ఎస్.జయరామిరెడ్డి, విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ పర్యవేక్షణలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 45 మంది వివిధ రంగాల నిష్ణాతులకు 2021 సంవత్సరానికి ఈ పురస్కారాలు అందించినట్లు చెప్పారు. డాక్టర్ చింతాను ప్రిన్సిపల్తోపాటు ఆచార్య బృందం తదితరులు అభినందించారు.
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |