Telugu govt jobs   »   CM Revanth launched Rajiv Gandhi Civils...

CM Revanth launched Rajiv Gandhi Civils Abhayahastham Scheme | రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పధకం ప్రారంభించిన రేవంత్ రెడ్డి

తెలంగాణలో సివిల్స్ పరీక్షల కి సన్నద్దమయ్యే అభ్యర్ధులకి సిఎం రేవంత్ రెడ్డి ఒక శుభవార్త తెలిపారు. రాష్ట్రంలో సివిల్స్ పరీక్షలకి సన్నద్దమయ్యే అభ్యర్ధుల కోసం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పద్ధకాన్ని ప్రారంభించారు. ఈ పధకం ద్వారా రాష్ట్రం లో ఎంతో మంది నిరుద్యోగ యువతకి సివిల్స్ వంటి పరీక్షల ప్రిపరేషన్ మరింత సరళం అవుతుంది.

సివిల్స్ పరీక్షలో విజయం సాధించాలి అనేది రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలకి సన్నద్దమయ్యే ఆభ్యర్ధుల ఆశ. కానీ సివిల్స్ వంటి పరీక్షలకి సన్నద్దమవ్వడం అనేది ఆర్ధికంగా మరియు మానసికంగా కొంత ఇబ్బందిని కలిగిస్తుంది కావున ఈ సమస్యలని తగ్గించడానికి ప్రభుత్వం సివిల్స్ పరీక్షలకి తయారయ్యే అభ్యర్ధులకి సింగరేణి కోలోరీస్ ద్వారా ఆర్ధిక సహాయం అందించనున్నారు.

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పధకం

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం అనేది తెలంగాణలో సివిల్స్ కి సన్నద్దమయ్యే అభ్యర్ధులకి వారి ఆర్ధిక ఇబ్బందులని తగ్గించి పరీక్షలకి మరింత మెరుగుగా తయారయ్యేందుకు ఆర్ధిక సహాయం అందించడం. ఈ పధకం ద్వారా సివిల్స్ పరీక్షలో ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులకి మెయిన్స్ పరీక్షకి సన్నద్దమవ్వడం కోసం ఒక లక్ష రూపాయల వరకు ఆర్ధిక సహాయాన్ని SCCL ద్వారా అందించడం. త్వరలోనే విధి విధానాలు విడుదల చేయనున్నారు.

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం అర్హత ప్రమాణాలు:

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం నుండి లబ్ది పొందేందుకు, అభ్యర్థులు తప్పనిసరిగా కింది అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి:

  • కుల దృవీకరణ: జనరల్ (EWS), BC, SC, లేదా ST వర్గాలకు చెందినవారై ఉండాలి.
  • నివాసం: తెలంగాణ అభ్యర్ధులకి మాత్రమే.
  • UPSC సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత.
  • కుటుంబ వార్షిక ఆదాయం పై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
  • ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ సన్నద్దమయ్యే వారు అనర్హులు

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం యొక్క లక్ష్యాలు

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం యొక్క ముఖ్య లక్షణాలు:

  • తెలంగాణ నుండి ఎక్కువ అభ్యర్ధులు సివిల్స్ పరీక్షలో ఉత్తీర్ణులవ్వడం
  • అభ్యర్థులు ఆర్థిక ఇబ్బందులని తొలగించి వారిని సివిల్స్ మెయిన్స్ పరీక్ష ప్రిపరేషన్ ని విజయవంతం చేయడం
  • కేంద్ర సర్వీసులలోకి అధిక సంఖ్యలో తెలంగాణ అభ్యర్ధులకి అవకాశం అందించడం
  • నిరుద్యోగ సమస్యను కొంతవరకు అధిగమించడం
  • జాతీయ అభివృద్ధికి తోడ్పడగల నైపుణ్యం మరియు అంకితభావం కలిగిన పౌర సేవకులను తయారుచేయడం
  • పోటీ పరీక్షల సమయంలో కుటుంభ మరియు విద్యార్ధి ఆర్ధిక అవసరాలపై ఇబ్బందులని తగ్గించడం

Telangana Mega Pack

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TGPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు Youtube Official Channel ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!