Telugu govt jobs   »   Current Affairs   »   తెలంగాణ రాష్ట్రంలోని నిర్మాణాలకు 5 అంతర్జాతీయ అవార్డులు...

తెలంగాణ రాష్ట్రంలోని నిర్మాణాలకు 5 అంతర్జాతీయ అవార్డులు లభించాయి

తెలంగాణ రాష్ట్రంలోని నిర్మాణాలకు 5 అంతర్జాతీయ అవార్డులు లభించాయి

తెలంగాణ రాష్ట్రంలోని నిర్మాణాలకు ఐదు అంతర్జాతీయ అవార్డులు లభించాయి. లండన్‌లోని గ్రీన్ ఆర్గనైజేషన్ 2023 సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో ప్రకటించిన గ్రీన్ యాపిల్ అవార్డులను యాదాద్రి ఆలయంతో సహా ఐదు నిర్మాణాలకు దక్కాయి. దేశంలోనే ఈ నిర్మాణాలు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకోవడం ఇదే తొలిసారి కాగా, ఐదు విభాగాల్లో అవార్డులు అందుకోవడం తెలంగాణకు మరో విశేషం. జూన్ 16న లండన్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఈ అవార్డులను అందుకోనున్నారు.

అవార్డులకు ఎంపికైన వాటిలో యాదాద్రి ఆలయం, దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి, సచివాలయం, పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూం, మోజంజాహీ మార్కెట్‌ ఉన్నాయి. ఈ అవార్డులు భవనాల డిజైన్, ఆర్కిటెక్చర్ ప్రతిభను ప్రతిబింబిస్తున్నాయని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు (2022), ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ అవార్డు (2021), లివింగ్, ఇన్‌క్లూజన్ అవార్డు-స్మార్ట్‌సిటీ ఎక్స్‌పో వరల్డ్ కాంగ్రెస్ (2021) వంటి ప్రపంచ స్థాయి అవార్డులను రాష్ట్రం ఇప్పటికే గెలుచుకుంది.

అవార్డులు దక్కిన నిర్మాణాలు

  • మోజంజాహీ మార్కెట్‌ (హెరిటేజ్‌ విభాగంలో- అద్భుతమైన పునరుద్ధరణ, పునర్వినియోగం కోసం)
  • దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి (వంతెనల శ్రేణిలో- ప్రత్యేక డిజైన్‌ కోసం)
  • డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనం(కార్యస్థల భవనాల విభాగంలో-సౌందర్యపరంగా రూపొందించిన కార్యాలయం)
  • ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ప్రత్యేకమైన ఆఫీస్‌ కేటగిరీలో)
  • యాదాద్రి ఆలయం(అద్భుతమైన మతపరమైన నిర్మాణాల విభాగంలో)

 గ్రీన్‌ ఆర్గనైజేషన్‌ అంటే ఏమిటి

గ్రీన్ ఆర్గనైజేషన్, 1994 లండన్‌లో స్థాపించబడింది, ఇది ప్రపంచవ్యాప్త స్థాయిని కలిగి ఉన్న స్వతంత్ర లాభాపేక్షలేని సంస్థ. ఇది ప్రపంచవ్యాప్తంగా పర్యావరణహిత కార్యక్రమాలను ప్రోత్సహించడంతోపాటు పాటు ఇందుకు కృషి చేస్తున్న వారిని ఇది గుర్తించి అవార్డులు అందిస్తుంది. గ్రీన్‌ యాపిల్‌ అవార్డుల పేరుతో 2016 నుంచి ప్రతి ఏటా ప్రముఖ సంస్థలు, కౌన్సిళ్లు, కమ్యూనిటీలను గుర్తిస్తూ వాటికి అవార్డులను ప్రదానం చేస్తోంది. ఇంటర్నేషనల్‌ బ్యూటిఫుల్‌ బిల్డింగ్‌ గ్రీన్‌ యాపిల్‌ అవార్డుల కోసం నిర్ధారిత ప్రమాణాలతోపాటు విశాలమైన, సానుకూల ఆకర్షణీయ దృశ్య ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. నివాస భవనాల నుంచి కోటల వరకు, మ్యూజియంలు, వంతెనలు, మతపరమైన స్మారక కట్టడాలు, వారసత్వ నిర్మాణాలు తదితర మరెన్నో నిర్మాణాలకు అవార్డులను అందిస్తారు. గతంలో లండన్‌లోని బ్రిటిష్‌ అకాడమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌(BAFTA), నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఖతార్‌, మలేషియా క్వాంటన్‌లోని జలన్‌మహాకోట్‌ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులను గెలుచుకున్నాయి.

adda247

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

***************************************************************************

Sharing is caring!

FAQs

తెలంగాణలో అతి పురాతన ప్రాంతం ఏది?

క్రీ.శ. 950లో ప్రారంభించబడి 1000 సంవత్సరం నాటికి పూర్తి అయిన ఈ కోట శక్తిలో చాలా మార్పులకు గురైంది. ముస్లిం మరియు హిందూ పాలనల శిల్పకళను వర్ణిస్తూ, ఖమ్మం కోట ఇటీవల 1000 సంవత్సరాల ఉనికిని పూర్తి చేసుకుంది మరియు తెలంగాణ యొక్క ప్రధాన చారిత్రక ప్రదేశం.