Telugu govt jobs   »   Telugu Current Affairs   »   Country's  first Procter & Gamble’s Liquid Detergent...
Top Performing

దేశంలోనే మొదటి ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ లిక్విడ్‌ డిటర్జెంట్‌ పరిశ్రమను తెలంగాణలో నెలకొల్పారు

దేశంలోనే మొదటి ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ లిక్విడ్‌ డిటర్జెంట్‌ పరిశ్రమను తెలంగాణలో నెలకొల్పారు Country’s  first Procter & Gamble’s Liquid Detergent Industry Established in Telangana

తెలంగాణ విఖ్యాత సంస్థలకు నిలయంగా మారిందని, అన్ని రంగాల్లోని ప్రసిద్ధ బ్రాండ్లన్నీ ఇక్కడే తయారవుతున్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ కొత్తూరులో నిర్మించిన రూ.200 కోట్ల లిక్విడ్‌ డిటర్జెంట్‌ పరిశ్రమను ఆయన ప్రారంభించారు. దేశంలో ఇది మొదటి లిక్విడ్‌ డిటర్జెంట్‌ పరిశ్రమ. దీని ద్వారా లిక్విడ్‌ అందుబాటులోకి రానుంది. దీని ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ తెలంగాణను కేంద్రస్థానంగా చేసుకొని రూ.1700 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలను స్థాపించింది. కొత్తూరులోని 170 ఎకరాల స్థలంలో ఏరియల్, టైడ్, బేబీకేర్, విష్పర్, ఓలే, జిలెట్‌ వంటి బ్రాండ్లను ఉత్పత్తి చేస్తోంది. దేశంలోని మొదటి లిక్విడ్‌ డిటర్జెంట్‌ పరిశ్రమ ఏర్పాటు కావడం రాష్ట్రానికి గర్వకారణం. 2014లో సీఎం కేసీఆర్‌ సంస్థకు శంకుస్థాపన చేయగా ఎనిమిదేళ్లలో అది పెద్దఎత్తున అభివృద్ధిని సాధించిందని తెలిపారు.

 

TSPSC Group 1 Notification 2022, Vacancies, Exam pattern, Age limit |_90.1

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

Opening of a radio station in Nellore

Download Adda247 App

 

Sharing is caring!

Country's  first Procter & Gamble's Liquid Detergent Industry Established in Telangana_5.1