Crime Rate in Andhra Pradesh Decreased by 8.13% | ఆంధ్రప్రదేశ్ లో 8.13 శాతం తగ్గిన నేరాల రేటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి 2022, 2021 సంవత్సరాలతో పోలిస్తే 2023లో రాష్ట్రంలో నేరాలు తగ్గాయని, రాష్ట్రంలో నేరాలను అరికట్టడానికి పోలీసు శాఖ చేపట్టిన విజిబుల్ పోలీసింగ్, అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చింది అని తెలిపారు. గురువారం రాష్ట్ర పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ రాష్ట్రంలో 2022లో 1,75,612 కేసులు నమోదు కాగా, 2023లో 1,61,334 నేరాలు నమోదయ్యాయి మరియు ఏడాదిలో 8.13 శాతం నేరాల రేటు తగ్గింది.
విభాగాల వారీగా ఉన్న వివరాలలో హత్యలు, హత్యాయత్నం కేసులు 10 శాతం, దోపిడీలు 28.57 శాతం, దొంగతనాలు 37.24 శాతం, పగటి దొంగతనాలు 13.41 శాతం, రాత్రి దొంగత నాలు 13.54 శాతం, రోడ్డు ప్రమాదాలు 7.83 శాతం, ఎస్సీ, ఎస్టీలపై నేరాలు 15.20 శాతం, సైబర్ నేరాలు 25.52 శాతం తగ్గాయని తెలిపారు.
Sharing is caring!