Telugu govt jobs   »   Latest Job Alert   »   CSIR ASO & AO Recruitment 2023

CSIR ASO మరియు SO నియామక నోటిఫికేషన్ 2023

CSIR ASO & SO Recruitment 2023: కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అధికారిక వెబ్‌సైట్ www.csir.res.inలో సెక్షన్ ఆఫీసర్ (SO) మరియు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO) పోస్టుల కోసం CSIR రిక్రూట్‌మెంట్ 2023ని విడుదల చేసింది. CSIR నోటిఫికేషన్ 2023లో మొత్తం 444 ఖాళీలు విడుదల చేసింది, ఇందులో సెక్షన్ ఆఫీసర్ స్థానానికి 76 పోస్టులు మరియు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ స్థానానికి 368 పోస్టులు కేటాయించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ 08 డిసెంబర్ 2023 నుండి ప్రారంభించారు మరియు ఇది 12 జనవరి 2024 వరకు కొనసాగుతుంది. స్టేజ్ I మరియు స్టేజ్ II పరీక్ష తేదీలు త్వరలో CSIR అధికారిక వెబ్‌సైట్‌లో తెలియజేస్తుంది. ఈ కథనంలో, మేము CSIR CASE (కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎగ్జామినేషన్) రిక్రూట్‌మెంట్ 2023కి సంబంధించిన అన్నీ వివరాలు, అర్హత ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియ, జీతం మరియు మరిన్నింటినీ అందించాము. బ్యాంకింగ్, SSC ఇతర పరీక్షలకి సన్నద్దమయ్యే అభ్యర్ధులకి ఇది ఒక గొప్ప అవకాశం బ్యాంకింగ్ పరీక్షా శైలికి దగ్గరగ్గా CSIR పరీక్షా శైలి ఉంది కావున అభ్యర్ధులు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

RBI అసిస్టెంట్ ఆన్‌లైన్‌ దరఖాస్తు 2023 చివరి తేదీ, దరఖాస్తు చేయడానికి డైరెక్ట్ లింక్_40.1

APPSC/TSPSC Sure shot Selection Group

CSIR SO మరియు ASO రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ విడుదల

CSIR SO మరియు ASO రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ PDFని అధికారిక వెబ్‌సైట్‌ www.csir.res.in లో అందుబాటులో ఉంచింది. సెక్షన్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కలిపి 444 ఖాళీల కోసం నోటిఫికేషన్ PDF విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు తప్పనిసరిగా CSIR నోటిఫికేషన్ PDFని తనిఖీ చేసి, వారు ఏ స్థానాలకు అర్హులా అని ధృవీకరించుకుని దానికి అనుగుణంగా అప్లై చేసుకోవాలి. నోటిఫికేషన్ PDF ద్వారా, అభ్యర్థులు అర్హత ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియ, ఖాళీల వివరాలు మరిన్నింటి గురించి తెలుసుకోండి. ఈ దిగువన CSIR SO ASO రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ PDF కోసం డైరెక్ట్ లింక్‌ను అందించాము, PDF ను డౌన్లోడ్ చేసుకోండి.

CSIR SO & ASO రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ PDF

CSIR రిక్రూట్‌మెంట్ 2023: అవలోకనం

CSIR రిక్రూట్‌మెంట్ 2023 అవలోకనంలో ASO మరియు AO నియామక ప్రక్రియ గురించి విలువైన సమాచారాన్ని తెలుసుకుంటారు. CSIR సెక్షన్ ఆఫీసర్లు మరియు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల 444 ఖాళీలకు సంబంధించిన సమాచారాన్ని ఈ దిగువన పట్టికలో అందించాము.

CSIR ASO మరియు AO రిక్రూట్మెంట్  2023

సంస్థ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్
పోస్ట్ సెక్షన్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
ఖాళీలు 444
విభాగం రిక్రూట్మెంట్ 
అప్లికేషన్ విధానం ఆన్లైన్
ముఖ్యమైన తేదీలు 08 డిసెంబర్ 2023- 12 జనవరి 2024
ఎంపిక విధానం
  • ఆన్లైన్ పరీక్ష
  • ఇంటర్వ్యూ
  • కంప్యూటరు ప్రొఫీషియన్సీ టెస్ట్
అధికారిక వెబ్సైట్ www.csir.res.in

CSIR SO ASO రిక్రూట్‌మెంట్ 2023: ముఖ్యమైన తేదీలు

CSIR ASO మరియు SO రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలి అనుకున్న అభ్యర్ధులు నియామక ప్రక్రియకి సంబంధించిన ముఖ్యమైన తేదీల గురించి తెలుసుకోవాలి. పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన దరఖాస్తు తేదీ, దరఖాస్తు చివరి తేదీ పరీక్షా తేదీ వంటి కీలకమైన తేదీలు ఈ దిగువన పట్టిక లో అందించాము.

CSIR SO ASO రిక్రూట్‌మెంట్ 2023: ముఖ్యమైన తేదీలు

CSIR 2023 రిక్రూట్మెంట్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 08 డిసెంబర్ 2023
CSIR 2023 రిక్రూట్మెంట్ అప్లికేషన్ చివరి తేదీ 12 జనవరి 2024
అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 14 జనవరి 2024
స్టేజ్ I పరీక్షా తేదీ ఫిబ్రవరి , 2024
స్టేజ్ II పరీక్షా తేదీ త్వరలో తెలియజేస్తారు
అడ్మిట్ కార్డు విడుదల తేదీ త్వరలో తెలియజేస్తారు

CSIR CASE రిక్రూట్‌మెంట్ 2023 ఆన్లైన్ అప్లికేషన్ లింకు

CSIR రిక్రూట్‌మెంట్ 2023 అప్లికేషన్ లింక్ అధికారిక వెబ్‌సైట్ www.csir.res.inలో యాక్టివేట్ చేయబడింది. దరఖాస్తు ప్రక్రియ 08 డిసెంబర్ 2023న ప్రారంభించారు మరియు ఇది 12 జనవరి 2024 వరకు అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు గడువు తేదీ లోపు పరీక్షకి దరఖాస్తు చేసుకోవాలి. CSIR రిక్రూట్‌మెంట్ 2023 అప్లికేషన్ నమోదు చేయడానికి ఈ దిగువన లింకు అందించాము.

CSIR CASE రిక్రూట్‌మెంట్ 2023 ఆన్లైన్ అప్లికేషన్ లింకు

CSIR SO మరియు ASO ఖాళీలు

CSIR ASO మరియు AO నోటిఫికేషన్ లో మొత్తం 444 ఖాళీలను పేర్కొంది. మొత్తం 444 ఖాళీల్లో 76 ఖాళీలలు CSIR రిక్రూట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుకు, 368 ఖాళీలు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుకు కేటాయించారు. ఈ ఖాళీలగురించి పూర్తి వివరాలకు దిగువన పట్టిక తనిఖీ చెయ్యండి.

CSIR SO మరియు ASO ఖాళీలు 

పోస్ట్  ఖాళీలు 
సెక్షన్ ఆఫీసర్ 76
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 368
మొత్తం  444

సెక్షన్ ఆఫీసర్ (SO) పోస్టుల కోసం కేటగిరీ వారీగా ఖాళీల వివరాలు:

సెక్షన్ ఆఫీసర్ (SO) పోస్టుల కోసం కేటగిరీ వారీగా ఖాళీల వివరాలు:

పోస్ట్ పేరు UR EWS OBC SC ST మొత్తం ఖాళీలు
SO (Gen) 13 2 7 4 2 28
SO (F&A) 13 2 7 3 1 26
SO (S&P) 11 2 5 3 1 22
మొత్తం 37 06 19 10 4 76

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO) పోస్టుల కోసం కేటగిరీ వారీగా ఖాళీల వివరాలు:

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO) పోస్టుల కోసం కేటగిరీ వారీగా ఖాళీల వివరాలు

పోస్ట్ పేరు UR EWS OBC SC ST మొత్తం ఖాళీలు
ASO (Gen) 96 23 66 35 17 237
ASO (F&A) 35 8 22 12 6 83
ASO (S&P) 20 4 14 7 3 48
మొత్తం ఖాళీలు  151 35 102 54 26 368

CSIR రిక్రూట్‌మెంట్ 2023 అర్హత ప్రమాణాలు

CSIR రిక్రూట్‌మెంట్ 2023 అర్హత ప్రమాణాలు నోటిఫికేషన్ PDFలో వెలువదించారు. అభ్యర్థులు వారు అప్లై చేస్తున్న స్థానానికి అర్హులో కాదో తెలుసుకోడానికి CSIR రిక్రూట్‌మెంట్ సెక్షన్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 2023 అర్హత ప్రమాణాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలి.

CSIR SO ASO వయో పరిమితి

CSIR రిక్రూట్‌మెంట్ 2023 వయో పరిమితి రెండు పోస్టులకు 33 ఏళ్లకు మించకూడదు. 12/01/2024 తేదీని కట్ఆఫ్ తేదీగా నిర్ణయించారు. SO మరియు ASO పోస్ట్లకు వయోపరిమితి 33 సంవత్సరాలు.

CSIR SO ASO విద్యా అర్హత

CSIR రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ PDF ప్రకారం, అభ్యర్థులు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేయడానికి కనీస అర్హత డిగ్రీ పూర్తి చేయాలి. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలి.

CSIR రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు రుసుము

CSIR SO ASO రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు రుసుము UR మరియు EWS కేటగిరీలకు రూ.500/- మరియు మహిళలు/SC/ST/PwBD/Ex-Servicemen/CSIR డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు రుసుము లేదు.

 

CSIR SO ASO 2023 పరీక్షా సరళి

CSIR SO ASO 2023 పరీక్షా సరళి మూడు పేపర్లు గా విభజించారు. పేపర్ Iలో అభ్యర్థులు జనరల్ అవేర్‌నెస్ మరియు ఇంగ్లిష్ లాంగ్వేజ్ మరియు కాంప్రహెన్షన్ వంటి సబ్జెక్టులు ఉంటాయి. పేపర్ I ఆబ్జెక్టివ్ విధానంలో 150 మార్కులకి ఉంటుంది ఇందులో జనరల్ ఆవేర్నేసస్ నుండి 100 ప్రశ్నలు మరియు ఇంగ్షీషు నుంచి 50 ప్రశ్నలు వస్తాయి. పేపర్ II 200 మార్కులను కలిగి ఉంటుంది, దీనిలో 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ మరియు మెంటల్ ఎబిలిటీ వంటి సబ్జెక్టులు ఉంటాయి 1/3 వంతు నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంది. పేపర్ III ఇంగ్లీష్/హిందీ సబ్జెక్టులకు డిస్క్రిప్టివ్‌ విధానంలో 150 మార్కులకు ఉంటుంది.

CSIR SO ASO 2023 పరీక్షా సరళి

పేపర్  సబ్జెక్టు  గరిష్ట మార్కులు  సమయం
పేపర్ -I General Awareness and English Language and Comprehension

General Awareness: 100 Objective Type Questions of one mark each.

English Language and Comprehension: 50 Objective Type Questions of one mark each

150 marks 02.00 Hours (120 Mins)
పేపర్ -II General Intelligence, Reasoning, and Mental Ability

(200 Objective Type Questions of one mark each with a negative marking @

0.33 marks for every wrong answer)

200 02:30 Hours

(150 Minutes)

పేపర్ -III English/Hindi – Descriptive Paper- Descriptive Paper

Essay, Precis and Letter/Application Writing

150 02 Hours
ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ కి 100 మకులు ఉంటాయి సెక్షన్ ఆఫీసర్ (Gen/F&A/S&P) పోస్ట్లకు మాత్రమే

 

CPT కంప్యూటరు ప్రొఫీషియన్సీ టెస్ట్ 100 మార్కులకు ఉంటుంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (Gen/F&A/S&P) పోస్ట్లకు మాత్రమే. ఇది తప్పనిసరిగా క్వాలిఫై అవ్వాలి

CSIR SO ASO 2023 జీతం

CSIR 2023 జీతం సెక్షన్ ఆఫీసర్ పోస్టుకు, పే స్కేల్ సుమారు రూ. (రూ. 47,600 –రూ. 1,51,100). అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పదవికి, పే స్కేల్ (రూ. 44,900 –1,42,400) ఉంటుంది.

RBI అసిస్టెంట్ ఆన్‌లైన్‌ దరఖాస్తు 2023 చివరి తేదీ, దరఖాస్తు చేయడానికి డైరెక్ట్ లింక్_50.1

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

CSIR SO మరియు ASO రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ PDF ఎక్కడ లభిస్తుంది?

CSIR SO మరియు ASO రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ ఈ కధనంలో అందించాము, ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి.

CSIR SO మరియు ASO రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ అప్లికేషన్ లింకు ఎక్కడ లభిస్తుంది?

CSIR SO మరియు ASO రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ అప్లికేషన్ లింకు ఈ కధనం లో అందించాము.

CSIR SO మరియు ASO రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి

CSIR SO మరియు ASO రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ లో మొత్తం 444 ఖాళీలు ఉన్నాయి పూర్తి ఖాళీలు తనిఖీ చెయ్యండి.

About the Author

Hi, I’m Venkat! Welcome to the ADDA247Exams blog. With 2 years of experience, including 1 year in EdTech, I create content on National and State-level exams, covering everything from notifications to results. My focus includes State PSCs, Banking, Insurance, SSC, and other exams. Having appeared for exams like APPSC Groups, IBPS, SBI, and SSC CHSL DV 2020, I bring hands-on expertise to guide you through your exam prep journey.