Telugu govt jobs   »   Daily Quizzes   »   Current Affairs MCQS Questions And Answers...

Current Affairs MCQS Questions And Answers In Telugu 24th June 2023, For APPSC And TSPSC Groups, TS And AP Police

Current Affairs MCQS Questions And Answers in Telugu: If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions,  Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

Current Affairs MCQS Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 మరియు4, అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Current Affairs MCQS Questions And Answers in Telugu

APPSC/TSPSC Sure shot Selection Group

Current Affairs MCQs Questions and Answers In Telugu

Current Affairs Questions – ప్రశ్నలు

Q1. అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం, ______న జరుపుకుంటారు, తరచుగా పేదరికంలో ఉన్న లెక్కలేనంత మంది వితంతువులు ఎదుర్కొంటున్న సవాలు పరిస్థితుల గురించి అవగాహన పెంచడం దీని లక్ష్యం.

(a) జూన్ 21

(b) జూన్ 22

(c) జూన్ 23

(d) జూన్ 24

Q2. ప్రపంచంలోని అతిపెద్ద ఆన్‌లైన్ వాణిజ్య సంస్థలలో ఒకటైన అలీబాబా యొక్క కొత్త ముఖ్య కార్యనిర్వాహకాధికారిగా ఎవరు నియమితులయ్యారు?

(a) జాక్ మా

(b) ఎడ్డీ వు

(c) జోసెఫ్ త్సాయ్

(d) డేనియల్ జాంగ్

Q3. ఇటీవల బ్రిక్స్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఉమెన్స్ వెర్టికల్ (BRICS CCI WE) అధ్యక్షురాలిగా మూడేళ్ల కాలానికి ఎవరు నియమితులయ్యారు?

(a) రూబీ సిన్హా

(b) అనితా గుప్తా

(c) సోఫియా చెన్

(d) ప్రియా శర్మ

Q4. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో మైక్రోన్ టెక్నాలజీ తన సెమీకండక్టర్(అర్ధవాహకం) పరిశీలన మరియు ప్యాకేజింగ్ విభాగంను ఏర్పాటు చేస్తుంది?

(a) గుజరాత్

(b) మహారాష్ట్ర

(c) తమిళనాడు

(d) కర్ణాటక

Q5. జ్ఞానాన్ని పంచుకునే ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించే బాధ్యత ఏ సంస్థకు ఉంది?

(a) భారతీయ రోడ్డు రవాణా సంస్థ

(b) భారత జాతీయ హైవే అథారిటీ

(c) రోడ్డు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

(d) భారతీయ రహదారుల పరిశోధన మరియు శిక్షణ సంస్థ

Q6. యోగా దినోత్సవం రోజున అత్యధిక మంది ప్రజలు సమావేశమై గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన నగరం ఏది?

(a) ముంబై

(b) సూరత్

(c) ఢిల్లీ

(d) కోల్‌కతా

Q7. 1,200 మెగావాట్ల అణు విద్యుత్ ప్లాంట్‌ను స్థాపించడానికి నగదు కొరత ఉన్న పాకిస్థాన్‌తో ఇటీవల ఏ దేశం $4.8 బిలియన్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది?

(a) చైనా

(b) యునైటెడ్ స్టేట్స్

(c) రష్యా

(d) జపాన్

Q8. భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య రక్షణ సహకారాన్ని వేగవంతం చేసే లక్ష్యంతో వాషింగ్టన్ DC లో ఒక కార్యక్రమంలో ప్రారంభించబడిన నూతన ప్రారంభం పేరు ఏమిటి?

(a) DEFCON USA

(b) INDUS X

(c) iDEX-DoD

(d) US- ఇండియా డిఫెన్స్ కనెక్ట్

Q9. ప్రపంచ ఆర్ధిక నివేదిక విడుదల చేసిన ప్రపంచ లింగ అంతర నివేదిక 2023లో, 146 దేశాలలో భారతదేశం ఏ స్థానంలో ఉంది?

(a) 89

(b) 105

(c) 127

(d) 140

Q10. 2023 సంవత్సరానికి, అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం కోసం నివేదించబడిన నేపథ్యం”_________________.”

(a) కనిపించని స్త్రీలు, అదృశ్య సమస్యలు

(b) వితంతువుల ఆర్థిక స్వాతంత్ర్యం కోసం స్థిరమైన పరిష్కారాలు

(c) లింగ సమానత్వం కోసం ఆవిష్కరణ మరియు సాంకేతికత

(d) నేను తరాల సమానత్వంని: మహిళల హక్కులను గ్రహిస్తున్నాను

Solutions

S1. Ans.(c)

Sol. అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం జూన్ 23న నిర్వహించబడుతుంది, తరచుగా పేదరికంలో ఉన్న అసంఖ్యాక వితంతువులు ఎదుర్కొంటున్న సవాలు పరిస్థితుల గురించి అవగాహన కల్పించడం దీని లక్ష్యం.

S2. Ans.(b)

Sol. $240 బిలియన్ల మార్కెట్ విలువ కలిగిన సంస్థకి ముఖ్య కార్యనిర్వాహకాధికారిగా అలీబాబా కోర్ టావోబావో మరియు Tmall ఆన్‌లైన్ కామర్స్ విభాగాల అధ్యక్షుడు ఎడ్డీ వు బాధ్యతలు స్వీకరించనున్నారు.

S3. Ans.(a)

Sol. రూబీ సిన్హా బ్రిక్స్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఉమెన్స్ వెర్టికల్ (BRICS CCI WE) అధ్యక్షురాలిగా మూడేళ్ల కాలానికి నియమితులయ్యారు.

S4. Ans.(a)

Sol. గుజరాత్‌లో సెమీకండక్టర్ (అర్ధ వాహకం) పరిశీలన మరియు ప్యాకేజింగ్ విభాగంను నెలకొల్పడానికి US చిప్‌మేకర్ మైక్రోన్ టెక్నాలజీ $2.7 బిలియన్ల పెట్టుబడికి భారత మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

S5. Ans.(b)

Sol. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ భారత జాతీయ హైవే అథారిటీ ద్వారా నాలెడ్జ్-షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది.

S6. Ans.(b)

Sol. గుజరాత్‌లోని సూరత్ నగరంలో నిర్వహించిన యోగా దినోత్సవం సందర్భంగా 1.53 లక్షల మంది ప్రజలు ఒకే చోట యోగా సమావేశం కోసం అతిపెద్ద సమావేశానికి హాజరై కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించారు.

S7. Ans.(a)

Sol. చైనా జూన్ 20న రెండు ఆల్-వెదర్ మిత్రదేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక సహకారానికి సంకేతంగా 1,200 మెగావాట్ల అణు విద్యుత్ క్షేత్రంను ఏర్పాటు చేయడానికి నగదు కొరత ఉన్న పాకిస్తాన్‌తో $4.8 బిలియన్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

S8. Ans.(b)

Sol. ఇండియా-యునైటెడ్ స్టేట్స్ డిఫెన్స్ యాక్సిలరేషన్ ఎకోసిస్టమ్ (INDUS X)ని USAలోని వాషింగ్టన్ DCలో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. INDUS X కార్యక్రమంను ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ (iDEX), మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మరియు US డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ (DoD) సహ-ఆర్గనైజ్ చేసింది మరియు US-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (USIBC) నిర్వహించింది.

S9. Ans.(c)

Sol. ప్రపంచ ఆర్ధిక నివేదిక విడుదల చేసిన ప్రపంచ లింగ అంతర నివేదిక 2023లో 146 దేశాలలో భారతదేశం 127వ స్థానంలో నిలిచింది.

S10. Ans.(c)

Sol. 2023 సంవత్సరానికి, అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం కోసం నివేదించబడిన నేపథ్యం “లింగ సమానత్వం కోసం ఆవిష్కరణ మరియు సాంకేతికత.”

SSC Complete Preparation Kit | Live Classes | Test Series | eBooks | Printed Books | By Adda247

మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు  క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

FAQs

where can i found daily quizzes?

You can found different quizzes at adda 247 telugu website