CWC ఫలితాలు 2024
సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ (CWC) అసిస్టెంట్ ఇంజనీర్ పోస్ట్ కి సంబంధించిన ఫలితాలని CWC విడుదల చేసింది. CWC 2024 ఫలితాలలో అకౌంటెంట్, సూపరింటెండెంట్ మరియు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వంటి ఇతర పోస్ట్‌లను త్వరలో విడుదల చేయనుంది. CWC 2024 ఫలితాలని అధికారిక వెబ్‌సైట్, @ewacor.nic.in. లో అందుబాటులో ఉంచింది. వ్రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులు వివిధ పోస్ట్ ల కోసం CWC 2024 ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. అభ్యర్థుల సౌలభ్యం కోసం ఈ కథనంలో CWC 2024 ఫలితాల లింకు ని అందించాము తద్వారా ఫలితాలని తనిఖీ చేసుకోవచ్చు. CWC ఫలితం 2024 గురించిన పూర్తి సమాచారం ఈ కధనంలో అందించాము.
Adda247 APP
CWC ఫలితాలు 2024 అవలోకనం
CWC ఫలితాలు 2024 అభ్యర్థి పేరు, రోల్ నంబర్, వివిధ విభాగాలలో పొందిన స్కోర్లు, మొత్తం మార్కులు మరియు అర్హత స్థితి వంటి వివరాలను అందిస్తుంది. CWC ఫలితాలు 2024 అవలోకనం ఈ దిగువన పట్టికలో అందించాము.
CWC ఫలితాలు 2024 అవలోకనం | |
సంస్థ | సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ |
పోస్ట్ | అసిస్టెంట్ ఇంజనీర్, అకౌంటెంట్, సూపరింటెండెంట్, మరియు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ |
ఖాళీలు | 153 |
ఎంపిక విధానం | రాత పరీక్ష, ఇంటర్వ్యూ |
అధికారిక వెబ్ సైటు | https://cewacor.nic.in/ |
CWC ఫలితాల తేదీ 2024
సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ (CWC) ఇటీవల 153 ఖాళీల కోసం వ్రాత పరీక్షలను నిర్వహించింది. పరీక్ష రాసిన అభ్యర్ధులు CWC ఫలితం 2024 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. అభ్యర్థులు ఇక్కడ ఫలితాల ముఖ్య తేదీల గురించి తెలుసుకోండి. అసిస్టెంట్ ఇంజనీర్-సివిల్ కోసం CWC ఫలితాలను విడుదల చేసింది, మిగిలిన పోస్ట్ ల ఫలితాలను త్వరలో వెల్లడించనున్నారు.
CWC ఫలితం 2024 డౌన్‌లోడ్ లింక్
CWC ఫలితం 2024 డౌన్‌లోడ్ లింక్ దాని అధికారిక రిక్రూట్‌మెంట్ పోర్టల్ @cewacor.nic.inలో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్ట్‌ల కు అందుబాటులో ఉంది. అభ్యర్థులు తమ వ్రాత పరీక్ష ఫలితాలను సరిచూసుకుని, నోటిఫై చేసిన షెడ్యూల్ ప్రకారం తుది ఎంపిక కోసం ఇంటర్వ్యూకు హాజరు కావాలి. CWC ఫలితం 2024 PDFని అభ్యర్ధులు ఈ దిగువన లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
CWC ఫలితం 2024 డౌన్‌లోడ్ లింకు
CWC ఫలితాలు 2024 డౌన్‌లోడ్ చేయడానికి దశలు
వివిధ స్థానాల కోసం సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ నిర్వహించిన పరీక్షా ఫలితాలని విడుదల చేసింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభ్యర్థులు తమ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ కింది దశలను అనుసరించండి:
- అభ్యర్ధులు ముందుగా CWC అధికారిక వెబ్ సైటు లేదా ఈ ewacor.nic.in లింకు ద్వారా సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- హోమ్‌పేజీలో “ఫలితాలు,” “రిక్రూట్‌మెంట్” విభాగం కోసం చూడండి. దానిపై క్లిక్ చేయండి.
- ఫలితాలు లేదా రిక్రూట్‌మెంట్ విభాగంలో, మీరు దరఖాస్తు చేసుకున్న స్థానాల కోసం CWC ఫలితం 2024 లింక్ ని కనుగొనండి.
- అందించిన సూచనల ప్రకారం రిజిస్ట్రేషన్ నంబర్/రోల్ నంబర్ మరియు పుట్టిన తేదీ/పాస్‌వర్డ్ వంటి మీ ఆధారాలను నమోదు చేయండి.
- సరైన వివరాలను నమోదు చేసి, లాగిన్ అయిన తర్వాత, CWC ఫలితం 2024 మీ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.
CWC ఫలితాలు 2024 PDFని డౌన్‌లోడ్ చేసుకొండి
వ్యక్తిగత సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ ఫలితాలతో పాటు, మెరిట్ జాబితాను తనిఖీ చేయండి. మెరిట్ జాబితా లో అర్హత పొందిన అభ్యర్ధుల పేరు/ రిజిస్ట్రేషన్ సంఖ్య వంటి వివరాలు ఉంటాయి. పైన అందించిన లింకు ద్వారా అభ్యర్ధులు తమ పరీక్షా ఫలితాల PDF ని డౌన్లోడ్ చేసుకోండి.
CWC కట్-ఆఫ్ 2024
CWC కట్ ఆఫ్ 2024 ఎంపిక ప్రక్రియ యొక్క తదుపరి దశకు వెళ్లడానికి అభ్యర్థులు అవసరమైన కనీస అర్హత మార్కులను సూచిస్తుంది. సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ (CWC) ఖాళీల సంఖ్య, పరీక్ష క్లిష్టత స్థాయి మరియు అభ్యర్థుల మొత్తం పనితీరు వంటి వివిధ అంశాల ఆధారంగా కట్-ఆఫ్ మార్కులు ఆధారపడి ఉంటాయి. దిగువ అందించిన లింక్ ద్వారా CWC కట్-ఆఫ్ 2024ని డౌన్‌లోడ్ చేయండి. అన్నీ విభాగాల పరీక్షా ఫలితాలు విడుదల చేసిన తర్వాత కట్-ఆఫ్ మార్కులు విడుదల చేయబడతాయి.
CWC కట్-ఆఫ్ 2024 (ఇంకా అందుబాటులో లేదు)
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |