Daikin lays foundation stone for its AC plant in Sri City
డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నూతన పరిశ్రమ నిర్మాణానికి చిత్తూరు జిల్లా శ్రీసిటీలో శంకుస్థాపన చేశారు. ఆ సంస్థకు ఇది దేశంలో 3వ ఉత్పత్తి కేంద్రం కాగా దక్షిణ భారతదేశంలో మొదటిది. శ్రీసిటీలో ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రాన్ని భారత్‌లోని జపాన్ రాయబారి సతోషి సుజుకీ, చెన్నైలోని జపాన్ కాన్సుల్ జనరల్స్ మసయుకి టాగా, ప్యుజిత, సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ నయోకి నిషియొక, శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి సమక్షంలో డైకిన్ ఇండియా ఎండీ, సీఈవో కన్వాల్‌జీత్ జావా లాంఛనంగా శంకుస్థాపన నిర్వహించారు. శ్రీసిటీ డీటీజెడ్‌లో కేటాయించిన 75.5 ఎకరాల స్థలంలో రూ.1,000 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్లాంటులో 3వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. ఏటా 15లక్షల ఏసీ యూనిట్లతోపాటు కంప్రెషర్లు, కంట్రోలర్ బోర్డులు, ఇతర విడిభాగాలను తయారు చేస్తారు. 2023 జులై నాటికి ఉత్పత్తులను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎండీ కన్వాల్‌జీత్ తెలిపారు.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************