Telugu govt jobs   »   Telangana Movement   »   Telangana Movement
Top Performing

Telangana Movement – Desire for Telangana identity, Download PDF | తెలంగాణ గుర్తింపుకై ఆరాటం 

1956లో తెలుగు మాట్లాడే ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడినప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌కు మూలాలు ఉన్నాయి. అయితే, కొన్నేళ్లుగా, ఆంధ్రప్రదేశ్‌లోని 23 జిల్లాలలో 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రజలు రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థికాభివృద్ధి మరియు సామాజిక న్యాయం పరంగా అట్టడుగున ఉన్నారని భావించడంతో తెలంగాణ గుర్తింపు కై  ఆరాటం కలిగింది. తెలంగాణా ఉద్యమానికి ఆజ్యం పోసిన విషయాలలో ఒకటి ఆర్థికాభివృద్ధి విషయంలో తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యానికి గురవుతోందనే భావన. ఆంధ్ర ప్రాంతంలో అభివృద్ధి ప్రాజెక్టుల కేంద్రీకరణతో వనరులను అసమానంగా కేటాయించారనే వాదనలు ఉన్నాయి.

AP State GK MCQs Questions And Answers in Telugu ,19 January 2022, For APPSC Group 4 And APPSC Endowment Officer |_70.1APPSC/TSPSC Sure shot Selection Group

Telangana Movement & State Formation  తెలంగాణ గుర్తింపుకై ఆరాటం

  • 1973 నుండి 1983 మధ్యకాలంలో ఒక దశాబ్ద కాలంపాటు తెలంగాణ ఉద్యమకారులు కొంతమేరకు స్తబ్దంగా ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన అనంతరం ప్రత్యేక తెలంగాణవాదులలో కదలిక వచ్చింది.
  • ” ఆర్థికంగా వెనుకబడిపోతే మళ్ళీ నిలదొక్కుకోవచ్చు. రాజకీయంగా నిర్లక్ష్యానికి గురి అయితే మళ్లి తెప్పరిల్లుకోవచ్చు. కానీ సాంస్కృతిక గుర్తింపు చెరిగిపోతే అస్తిత్వాన్ని కోల్పోతామని” కాళోజీ హెచ్చరించారు.
  • 1984-94 వరకు వివిధ సదస్సులు, సమావేశాలు, కరపత్రాలు, పత్రికా వ్యాసాలు, రచనలు మొదలగు వాటి ద్వారా తెలంగాణ ఉద్యమ భావవ్యాప్తిని ప్రచారం చేశాడు.

1. హిమాయత్ నగర్ ఉప ఎన్నిక

  • హిమాయత్ నగర్ శాసనసభ్యుడు (టి.డి.పి.) నారాయణరావు గౌడ్ గుండెపోటుతో మరణించడంతో హిమాయత్ నగర్ ఉపఎన్నిక అనివార్యమైంది.
  • అటువంటి సమయంలో 1983 హిమాయత్ నగర్ ఉపఎన్నికలో టి.డి.పి. పార్టీ తరపున ఆంధ్రప్రాంత నాయకుడు అయిన పి.ఉపేంద్ర పోటీచేశారు
  • . తెలంగాణ ఆత్మ అయిన హైద్రాబాద్ నగరంలో ఒక ఆంధ్రప్రాంత నాయకుడు పోటీ చేయడం వలన ఇతనికి వ్యతిరేకంగా తెలంగాణవాదులు విస్తృతంగా ప్రచారం చేశారు.
  • ఆంధ్రప్రాంత నాయకుడు పి. ఉపేంద్రకు వ్యతిరేకంగా మరియు బి.జె.పి అభ్యర్థి స్థానిక నాయకుడు అయిన ఎ.నరేంద్రకు అనుకూలంగా తెలంగాణవాదులు ప్రచారం చేయడంతో బి.జె.పి అభ్యర్థి ఎ.నరేంద్ర ఈ ఎన్నికలలో విజయం సాధించాడు.

2. తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్

  • హిమాయత్ నగర్ ఎన్నికలలో పి.ఉపేంద్ర ఓటమి పొందడం వలన సంతోషించిన తెలంగాణవాదులు వై.ఎమ్.సి.ఎ హాల్ లో సదస్సును నిర్వహించారు.
  • ఈ సదస్సు నిర్వహణలో కీలకపాత్ర పోషించినవారు: సత్యనారాయణ (స్టేట్ ఎడ్వయిజర్ పత్రికా సంపాదకుడు)
  • ఈ సదస్సులోనే ఉద్యమ నిర్వహణ కొరకు తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ ను ఏర్పాటు చేశారు.
  • తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ యొక్క కన్వీనర్‌గా సత్యనారాయణ ఎన్నికయ్యాడు.

3. తెలంగాణ జనసభ

  • సత్యనారాయణ అధ్యక్షతన తెలంగాణ జనసభ ఏర్పడింది.
  • తెలంగాణ జనసభ 1985 ఫిబ్రవరి 27న ఆంధ్ర సారస్వత పరిషత్తు హాలులో పెద్ద సదస్సును నిర్వహించింది.
  • ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన అఖిల భారత ఆర్యసమాజ నాయకుడు – వందేమాతరం రామచంద్రరావు.

4. ప్రతాప్ కిశోర్ ఢిల్లీ పాదయాత్ర

  •  జర్నలిస్ట్ ప్రతాప్ కిశోర్ ప్రత్యేక తెలంగాణ అంశంనకు దేశవ్యాప్త మద్దతు కోసం హైద్రాబాద్ నుండి ఢిల్లీకి 1987 జూన్ 6 వ తేదీన తన పాదయాత్రను చార్మినార్ నుండి ప్రారంభించాడు.
  • ఇతనితో పాటు బయలుదేరిన ఇతని మిత్రులు : షేర్ ఖాన్, సయ్యద్ షహబుద్దిన్ “
  • నాగ్ పూర్ లో విదర్భ జర్నలిస్టు సంఘం వీరికి ఆతిధ్యం ఇచ్చి విదర్భ నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసింది
  • నాగ్ పూర్ వరకు వీరి పాదయాత్ర చేరేసరికే ఇతని పాదాలు పూర్తిగా వాచి కదలలేని పరిస్థితి ఏర్పడింది.
  • దీంతో పాదయాత్ర కొనసాగించే అవకాశం లేకపోవడంతో ఈ ప్రతినిధి వర్గం రైలు ప్రయాణం చేసి ప్రధానమంత్రికి మరియు ఇతర కేంద్రమంత్రులకు తెలంగాణ ఆవశ్యకత పైన వినతి పత్రాలు సమర్పించారు.

5. మళ్ళీ ఆవిర్భవించిన తెలంగాణ ప్రజాసమితి

  • ఢిల్లీ నుండి తిరిగివచ్చిన అనంతరం ప్రతాప్ కిషోర్, మరికొందరు తెలంగాణ వాదులతో కలిసి 1987లో తెలంగాణ ప్రజాసమితిని పునరుద్ధరించారు
  • ఈ పునరుద్ధరించబడిన తెలంగాణ ప్రజాసమితి యొక్క అధ్యక్షుడుగా భూపతి కృష్ణమూర్తి (తెలంగాణ గాంధీ) ఎన్నికయ్యాడు.

6. సార్వదేశిక్ ఆర్యప్రతినిధి సభ కమిషన్

  • సార్వదేశిక్ ఆర్యప్రతినిధి సభకు ఉపాధ్యక్షుడిగా ఉన్న వందేమాతరం రామచంద్రరావు తెలంగాణ డిమాండుపై కమిషన్ ఏర్పాటు చేయవలసిందిగా కోరడంతో సార్వదేశిక్ ఆర్యప్రతినిధి సభ ద్విసభ్య కమిషన్‌ను నియమించింది.
  • ఈ కమిషన్ సభ్యులు: 1. ఓంప్రకాశ్ త్యాగి  2.హెచ్.కె.ఎస్. మాలిక్
  • ఈ కమిషన్ 1985 నవంబర్ లో తన నివేదికను వెలువరిస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్ న్యాయపరమైనదేనని పేర్కొంది.
  • అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న రాజీవ్ గాంధీకి తెలంగాణ రాష్ట్రమును ఏర్పాటు చేయమని ఒక లేఖ రాస్తూ ఆ లేఖతో పాటు ఈ కమిషన్ నివేదికను కూడా జతపరచింది.

7. తెలంగాణ ముక్తి మోర్చ

  • తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన ప్రజా సంఘాలలో తెలంగాణ ముక్తి మోర్చ కూడా కీలకమైనది. 
  • తెలంగాణ ముక్తి మోర్చ ఏర్పాటులో కీలక పాత్ర పోషించినవారు :
  •  మేచినేని కిషన్‌రావు (కన్వీనర్)
  • పురుషోత్తం రెడ్డి
  • మదన్మో హన్
  • సి. హెచ్.లక్ష్మయ్య
  • తెలంగాణతో పాటు భారతదేశాన్ని చిన్న రాష్ట్రాలుగా విభజించాలని తెలంగాణ ముక్తి మోర్చ కోరింది.
  • తెలంగాణ ముక్తి మోర్చ నిర్వహించే ఉద్యమానికి ఆంధ్రప్రాంతానికి చెందిన జస్టిస్ శ్రీ టి.ఎల్.ఎన్.రెడ్డి వంటి నాయకులు కూడా మద్దతిచ్చారు.

8. నీటిపారుదల రంగంపై వెలిచాల జగపతిరావు నివేదిక

  • తెలంగాణకు జరిగిన అన్యాయాలపై అవగాహనాసదస్సును 1989లో కరీంనగర్‌లో వెలిచాల జగపతిరావు నిర్వహించగా ప్రజలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.
  • దుశ్చర్ల సత్యనారాయణ నేతృత్వంలో జరిగిన జలసాధన సమితి పాదయాత్రలో (నల్గొండ నుండి శ్రీశైలం వరకు) వెలిచాల జగపతిరావు పాల్గొన్నాడు.
  • 1991-1992 ప్రాంతంలో తెలంగాణ ప్రముఖ రాజకీయ నాయకుడు మాజీ శాసన సభ్యుడు జగపతిరావు నీటిపారుదల రంగంపై నివేదికను ప్రచురించాడు.
  • శ్రీశైలం ప్రాజెక్టు వద్ద జరిగిన సదస్సులో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిచేయకపోవడం వలన తెలంగాణకు జరిగిన అన్యాయాలను ప్రజలకు వివరించడం జరిగింది.

Desire for Telangana identity, Download PDF

తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు ఆర్టికల్స్ 

తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు – జై ఆంధ్ర ఉద్యమం- అనంతర సంఘటనలు 
తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు- 1969 ఉద్యమం-వివిధ వర్గాల పాత్ర
తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు – 1969 ఉద్యమానికి కారణాలు
తెలంగాణ ఉద్యమం-పెద్ద మనుషుల ఒప్పందం 1956
1948 నుండి 2014 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమం యొక్క సంక్షిప్త చరిత్ర
తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు- కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష
తెలంగాణ ఉద్యమం- తెలంగాణ భావజాల వ్యాప్తి.
తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు | తెలంగాణ సంస్కృతి పునరుజ్జీవనం
తెలంగాణ ఉద్యమం – వివిధ నిరసన కార్యక్రమాలు.

pdpCourseImg

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

Telangana Movement - Desire for Telangana identity, Download PDF_5.1

FAQs

What is the Telangana movement?

The Telangana movement refers to the prolonged agitation and demand for a separate state of Telangana within the larger state of Andhra Pradesh in India.

What economic factors contributed to the Telangana movement?

Economic disparities played a significant role in the movement. There were claims that resources and development projects were disproportionately allocated, with a perceived concentration in the Andhra region. This led to a sense of neglect and fuelled the demand for a separate state.