Telugu govt jobs   »   Telugu Current Affairs   »   తెలంగాణ జాతీయ రహదారి అభివృద్ధిలో కేంద్రం కీలక...
Top Performing

తెలంగాణ జాతీయ రహదారి అభివృద్ధిలో కేంద్రం కీలక పాత్ర పోషించింది: నితిన్ గడ్కరీ

తెలంగాణ జాతీయ రహదారి అభివృద్ధిలో కేంద్రం కీలక పాత్ర పోషించింది: నితిన్ గడ్కరీ

జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో శంషాబాద్‌ విమానాశ్రయంలోని జీఎంఆర్‌ ఎరీనాలో నిర్వహించిన కార్యక్రమంలో 12 జాతీయ రహదారుల విస్తరణ పనులకు, కేంద్ర రహదారి సదుపాయాల నిధి (సీఆర్‌ఐఎఫ్‌) కింద చేపట్టిన 7 ప్రాజెక్టుల పనులను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ రిమోట్‌ ద్వారా ప్రారంభించారు. నిర్మాణం పూర్తయిన రెండు జాతీయ రహదారుల్ని జాతికి అంకితం చేశారు.

రాష్ట్రంలో 460 కి.మీ పొడవైన, రూ.ఎనిమిది వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు గడ్కరీ శంకుస్థాపన చేశారు. రాంసాన్‌పల్లె – మంగళూరు సెక్షన్‌ నాలుగు వరుసల రహదారి (47 కి.మీ), మంగళూరు – తెలంగాణ సరిహద్దు నాలుగు వరుసల రహదారు (49 కి.మీ)లను జాతికి అంకితం చేశారు.

నూతనంగా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు:

కళ్లకల్‌ – గుండ్లపోచంపల్లి (17 కి.మీ), గుండ్లపోచంపల్లి – బోయిన్‌పల్లి (10 కి.మీ), తొండుపల్లి – కొత్తూరు (46 కి.మీ), ఓఆర్‌ఆర్‌ టీఎస్‌పీఏ జంక్షన్‌ – మన్నెగూడ 46 కి.మీ, దుద్దెడ – జనగామ (40 కి.మీ), వలిగొండ – తొర్రూర్‌ 69 కి.మీ, ఎల్‌బీనగర్‌ – మల్కాపూర్‌ 23 కి.మీ, హనుమకొండ – ములుగు 30 కి.మీ, హైదరాబాద్‌ – భూపాలపట్నం మార్గంలో పేవ్డ్‌ సెక్షన్‌ (4 కి.మీ), బీహెచ్‌ఈఎల్‌ కూడలి వద్ద ఫ్లై ఓవర్‌ (2 కి.మీ) సీఆర్‌ఐఎఫ్‌ ప్రాజెక్టులు (106 కి.మీ): సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లాల్లో సీఆర్‌ఐఎఫ్‌ కింద ఏడు పనులు.

TSPSC Group 1 Notification 2022, Vacancies, Exam pattern, Age limit |_90.1

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

Opening of a radio station in Nellore

Download Adda247 App

 

Sharing is caring!

తెలంగాణ జాతీయ రహదారి అభివృద్ధిలో కేంద్రం కీలక పాత్ర పోషించింది: నితిన్ గడ్కరీ_5.1