Telugu govt jobs   »   Notification   »   DPS DAE రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్
Top Performing

DPS DAE రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్, డౌన్లోడ్ నోటిఫికేషన్ PDF

DPS DAE రిక్రూట్‌మెంట్ 2023

డైరెక్టరేట్ ఆఫ్ పర్చేజ్ & స్టోర్స్ తన అధికారిక వెబ్‌సైట్ @https://dpsdae.gov.inలో 16 ఏప్రిల్ 2023న DPS DAE రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్/జూనియర్ స్టోర్ కీపర్ వంటి పోస్టుల కోసం మొత్తం 65 ఖాళీలు విడుదల చేసింది. DPS DAE రిక్రూట్‌మెంట్ 2023 ఆన్‌లైన్‌ దరఖాస్తు 22 ఏప్రిల్ 2023 నుండి ప్రారంభమైనది మరియు దరఖాస్తు చివరి తేదీ 15 మే 2023 వరకు దరఖాస్తు పక్రియ అందుబాటులో ఉంటుంది. ఈ కధనంలో, DPS DAE రిక్రూట్‌మెంట్ 2023కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించాము. అభ్యర్థులు DPS DAE రిక్రూట్‌మెంట్ 2023 కోసం అన్ని వివరాలను ఈ కధనంలో చదవగలరు.

DPS DAE రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ అవలోకనం

అభ్యర్థులు DPS AE రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ యొక్క అవలోకనాన్ని క్రింద ఇవ్వబడిన పట్టికలో పొందగలరు.

DPS DAE రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ అవలోకనం
సంస్థ డైరెక్టరేట్ ఆఫ్ పర్చేజ్ & స్టోర్స్
పరీక్షా పేరు DPS పరీక్షా 2023
పోస్ట్ జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్ / జూనియర్ స్టోర్ కీపర్
ఖాళీలు 65
వర్గం ప్రభుత్వ ఉద్యోగాలు
దరఖాస్తు పక్రియ ఆన్ లైన్
ఎంపిక పక్రియ లెవల్ 1 మరియు లెవెల్ 2 పరీక్ష
అధికారిక వెబ్సైట్ @https://dpsdae.gov.in

DPS రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ PDF

DPS DAE రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ 16 ఏప్రిల్ 2023న విడుదల చేయబడింది. అభ్యర్థులు తమ ఆన్‌లైన్ దరఖాస్తును 22 ఏప్రిల్ 2023 నుండి 15 మే 2023 వరకు అధికారిక వెబ్సైట్ లో సమర్పించవచ్చు. లెవల్ 1 మరియు లెవల్ 2 పరీక్షలకు అర్హత సాధించిన తర్వాత అభ్యర్ధుల తుది ఎంపిక ఉంటుంది. ఇక్కడ, మేము అన్ని ముఖ్యమైన సమాచారంతో కూడిన DPS రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ PDFని డౌన్‌లోడ్ చేయడానికి ప్రత్యక్ష లింక్‌ను అందించాము. దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా మీరు DPS రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ PDF ను డౌన్లోడ్ చేసుకోగలరు.

DPS రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ PDF

DPS DAE రిక్రూట్‌మెంట్ 2023 ముఖ్యమైన తేదీలు

DPS DAE రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ కి సంబంధించిన అన్ని ముఖ్యమైన తేదీలు క్రింది పట్టికలో  చర్చించబడ్డాయి.

DPS DAE రిక్రూట్‌మెంట్ 2023 ముఖ్యమైన తేదీలు
ఈవెంట్స్ తేదీలు 
DPS DAE రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ 16 ఏప్రిల్ 2023
DPS DAE రిక్రూట్‌మెంట్ 2023 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేదీ 22 ఏప్రిల్ 2023
DPS DAE రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 15 మే 2023
DPS DAE రిక్రూట్‌మెంట్ 2023 ఆన్‌లైన్ పరీక్ష జూన్ 2వ వారం 2023

DPS DAE రిక్రూట్‌మెంట్ 2023 ఆన్‌లైన్ దరఖాస్తు లింక్‌

భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ పర్చేజ్ & స్టోర్స్ జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్/జూనియర్ స్టోర్ కీపర్ పోస్టుల కోసం తమ ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి అర్హులైన దరఖాస్తుదారులను ఆహ్వానించింది. అభ్యర్థులు తమ ఆన్‌లైన్ దరఖాస్తును 22 ఏప్రిల్ 2023 నుండి 15 మే 2023 వరకు అధికారిక వెబ్సైట్ లో సమర్పించవచ్చు. ఇక్కడ, మేము DPS DAE రిక్రూట్‌మెంట్ 2023 ఆన్‌లైన్‌లో దరఖాస్తు లింక్‌ని అందించాము.దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా మీరు అధికారిక పేజీ కి మరలింపబడతారు.

DPS DAE రిక్రూట్‌మెంట్ 2023 ఆన్‌లైన్ దరఖాస్తు లింక్‌

DPS DAE రిక్రూట్‌మెంట్ 2023  ఖాళీలు

DPS రిక్రూట్‌మెంట్ 2023 కింద జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్ / జూనియర్ స్టోర్ కీపర్ కేటగిరీల వారీ ఖాళీలు ఇక్కడ వివరించబడ్డాయి.

DPS DAE రిక్రూట్‌మెంట్ 2023  ఖాళీలు 
వర్గం ఖాళీల సంఖ్య 
UR 12
EWS 22
OBC 8
SC 23
ST 0
మొత్తం 65

DPS DAE రిక్రూట్‌మెంట్ 2023 అర్హత ప్రమాణాలు

DPS రిక్రూట్‌మెంట్ 2023 కోసం దరఖాస్తు చేయడానికి ముందు, అభ్యర్థి అర్హత ప్రమాణాలు తెలుసుకోవాలి.  ఇక్కడ మేము  DPS DAE నోటిఫికేషన్ 2023 అర్హత ప్రమాణాలకి సంబంధించిన విద్యా అర్హత మరియు వయో పరిమితి వివరాలను అందించాము.

APPSC Group 4 Result 2022, District wise Merit List PDF |_70.1APPSC/TSPSC Sure shot Selection Group

DPS DAE రిక్రూట్‌మెంట్ 2023 విద్యా అర్హత

DPS DAE రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్ధులు ఈ క్రింది విద్యా అర్హతను కలిగి ఉండాలి.

DPS DAE రిక్రూట్‌మెంట్ 2023 విద్యా అర్హత
పోస్ట్ విద్యా అర్హతలు 
జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్ / జూనియర్ స్టోర్ కీపర్
  • 60 శాతం మార్కులతో సైన్స్‌లో గ్రాడ్యుయేట్.
  • 60% మార్కులతో కామర్స్ గ్రాడ్యుయేట్.
  • ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు/సంస్థల నుండి 60% మార్కులతో మెకానికల్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రానిక్స్ / కంప్యూటర్ సైన్స్‌లో డిప్లొమా కలిగి ఉండాలి

DPS DAE నోటిఫికేషన్ 2023 వయో పరిమితి

ఇక్కడ, మేము DPS DAE రిక్రూట్‌మెంట్ 2023 కోసం కనీస మరియు గరిష్ట వయోపరిమితిని పేర్కొన్నాము.

DPS DAE నోటిఫికేషన్ 2023 వయో పరిమితి
పోస్ట్ కనీస వయసు  గరిష్ట వయసు
జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్ / జూనియర్ స్టోర్ కీపర్ 18 Years 27 Years

DPS DAE రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు రుసుము

DPS DAE రిక్రూట్‌మెంట్ 2023 కోసం కేటగిరీ వారీగా దరఖాస్తు రుసుము ఇవ్వబడిన పట్టికలో చర్చించబడింది.

DPS DAE రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు రుసుము 
వర్గం Application Fees
జనరల్ /OBC/EWS రూ. 200/-
SC/ ST, మహిళా అభ్యర్థులు, ఎక్స్-సర్వీస్‌మెన్ మరియు PWD

DPS DAE రిక్రూట్‌మెంట్ 2023 పరీక్షా సరళి

DPS DAE పరీక్షా సరళి – లెవెల్  1  పరీక్షా సరళి దిగువ పట్టికలో ఇవ్వబడింది.

DPS DAE రిక్రూట్‌మెంట్ 2023 పరీక్షా సరళి – లెవెల్ I
పార్ట్ సబ్జెక్ట్స్ ప్రశ్నల సంఖ్య మొత్తం ప్రశ్నలు వ్యవధి
A జనరల్ ఇంగ్షీషు 50 200 2 గంటలు
B (ఎ) సైన్స్‌లో జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ (బేసిక్ కాన్సెప్ట్‌లు 12వ తరగతి స్థాయి) లేదా (బి) బేసిక్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ (12వ తరగతి స్థాయి) 60
C క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (అంకగణితం) 50
D జనరల్ నాలెడ్జ్ 20
E కంప్యూటర్ నాలెడ్జ్ 20

DPS DAE రిక్రూట్‌మెంట్ 2023 ఎంపిక ప్రక్రియ

DPS DAE రిక్రూట్‌మెంట్ 2023 కోసం ఎంపిక ప్రక్రియ యొక్క దశలు ఇక్కడ పేర్కొనబడ్డాయి

లెవెల్ 1 పరీక్ష: ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్
లెవెల్ 2 పరీక్ష: డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్

DPS DAE రిక్రూట్‌మెంట్ 2023 జీతం

ఇక్కడ, ఇచ్చిన పట్టికలో మేము DPS DAE రిక్రూట్‌మెంట్ 2023 కింద ఎంపిక చేసిన జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్ / జూనియర్ స్టోర్ కీపర్ జీతం గురించి వివరించాము.

DPS DAE రిక్రూట్‌మెంట్ 2023 జీతం
పోస్ట్ జీతం
జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్ / జూనియర్ స్టోర్ కీపర్ లెవెల్ 4 (Rs.25500- Rs.81100)

adda247

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

Sharing is caring!

DPS DAE రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్, డౌన్లోడ్ PDF_5.1

FAQs

DPS DAE రిక్రూట్‌మెంట్ 2023కి వయోపరిమితి ఎంత?

DPS DAE రిక్రూట్‌మెంట్ 2023 కోసం వయోపరిమితి 18-27 సంవత్సరాలు.

DPS DAE రిక్రూట్‌మెంట్ 2023 ఎప్పుడు విడుదల చేయబడింది?

DPS DAE రిక్రూట్‌మెంట్ 2023 16 ఏప్రిల్ 2023న విడుదల చేయబడింది.

DPS DAE రిక్రూట్‌మెంట్ 2023 కోసం దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ ఏది?

DPS DAE రిక్రూట్‌మెంట్ 2023 కోసం దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ 22 ఏప్రిల్ 2023.

DPS DAE రిక్రూట్‌మెంట్ 2023 కోసం దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏమిటి?

DPS DAE రిక్రూట్‌మెంట్ 2023 కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 15 మే 2023.

DPS రిక్రూట్‌మెంట్ 2023 లో ఎన్ని ఖాళీలు ప్రకటించబడ్డాయి?

DPS రిక్రూట్‌మెంట్ 2023 లో మొత్తం 65 ఖాళీలు ప్రకటించబడ్డాయి.