ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును “డా. YSR యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్”గా నామకరణం చేసింది, విజయవాడ కేంద్రంగా ఉన్న డా. వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకీ నియామక నోటిఫికేషన్ ని విడుదల చేసింది. నేటితో 01 ఫిబ్రవరి 2024 తో ఆన్లైన్ దరఖాస్తు ముగుస్తుంది కావున అభ్యర్ధులు చివరి తేదీ ముగిసే లోపు దరఖాస్తు సమర్పించాలి. డా.వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ పూర్తి వివరాల కోసం ఈ కధనాన్ని తనిఖీ చేయండి.
డా.వైఎస్సార్ యూహెచ్ఎస్ లో జూనియర్ అసిస్టెంట్ అవలోకనం
డా.వైఎస్సార్ యూహెచ్ఎస్ లో జూనియర్ అసిస్టెంట్ అవలోకనం | |
సంస్థ | డా.వైఎస్సార్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం |
పోస్ట్ పేరు | జూనియర్ అసిస్టెంట్ |
ఖాళీలు | 20 |
నోటిఫికేషన్ విడుదల తేదీ | 11 జనవరి 2024 |
దరఖాస్తు ప్రారంభ తేదీ | 12 జనవరి 2024 |
దరఖాస్తు చివరి తేదీ | 01 ఫిబ్రవరి 2024 |
ఉద్యోగ స్థానం | విజయవాడ |
వర్గం | ఉద్యోగాలు |
అధికారిక వెబ్‌సైట్ | https://drysr.uhsap.in |
APPSC/TSPSC Sure shot Selection Group
డా.వైఎస్సార్ యూహెచ్ఎస్ జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ PDF
డా.వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ, లో 20 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు డా.వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. డా.వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ జూనియర్ అసిస్టెంట్ అధికారిక నోటిఫికేషన్ PDF ఎంపిక ప్రక్రియ, ఖాళీలు, దరఖాస్తు ప్రక్రియ, సిలబస్, పరీక్షా విధానం మొదలైన వాటికి సంబంధించిన వివరాలు ఈ కధనం లో అందించాము. అధికారిక నోటిఫికేషన్ PDFని డౌన్‌లోడ్ చేయడానికి క్రింది లింక్‌పై క్లిక్ చేయండి
డా.వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ PDF
డా.వైఎస్సార్ యూహెచ్ఎస్ జూనియర్ అసిస్టెంట్ ఖాళీల వివరాలు
డా.వైఎస్సార్ యూహెచ్ఎస్ జూనియర్ అసిస్టెంట్ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఈ కింది పట్టికలో అందించాము
వర్గం | ఖాళీలు |
OC | 09 |
BC-A | 02 |
BC-B | 01 |
BC-D | 02 |
BC-E | 01 |
EWS | 02 |
SC | 03 |
మొత్తం | 20 |
డా.వైఎస్సార్ యూహెచ్ఎస్ జూనియర్ అసిస్టెంట్ అర్హత ప్రమాణాలు
వయోపరిమితి: డా.వైఎస్సార్ యూహెచ్ఎస్ జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం వయోపరిమితి 18-42 సంవత్సరాలు. వయోపరిమితిని లెక్కించడానికి కీలకమైన తేదీ 01.07.2024. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యా అర్హత
పోస్ట్ పేరు | విద్యా అర్హత |
జూనియర్ అసిస్టెంట్ | UGC చే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి |
వయస్సు:
Dr.YSR UHS జూనియర్ అసిస్టెంట్ కి దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు 01 జులై 2024 నాటికి తప్పనిసరిగా 18 సంవత్సరాలు నిండి 42 సంవత్సరాల లోపు ఉండాలి. SC, ST, BC, EWS అభ్యర్ధులకి సడలింపు ఉంది పూర్తి వివరాలకు పైన అందించిన అధికారిక నోటిఫికేషన్ తనిఖీ చేయండి.
డా.వైఎస్సార్ యూహెచ్ఎస్ జూనియర్ అసిస్టెంట్ ఎంపిక ప్రక్రియ
డా.వైఎస్సార్ యూహెచ్ఎస్ జూనియర్ అసిస్టెంట్ నియామకం కోసం ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది:
- దశ-1: ప్రిలిమ్స్ (OMR విధానం లో)
- దశ-2: మెయిన్స్ లేదా
- దశ-3: CPT (కంప్యూటరు ప్రొఫీషియన్సీ టెస్ట్)
- దశ-4: సర్టిఫికేట్ వెరిఫికేషన్
D.YSR UHS జూనియర్ అసిస్టెంట్ పరీక్షని నిర్వహించనున్న APPSC
D.YSR UHS జూనియర్ అసిస్టెంట్ పరీక్ష నిర్వహణ బాధ్యతని యూనివర్సిటీ APPSC కి అప్పగించింది, ఈ చర్యతో పరీక్ష యొక్క నిర్వహణ, పారదర్శకత పై అభ్యర్ధులు సందేహపడనవసరం లేదు. అభ్యర్ధులు దరఖాస్తు చివరి తేదీ ముగిసే లోపు వారి అప్లికేషన్ ను సమర్పించి పరీక్ష కి సన్నద్దమవ్వచ్చు. APPSC పరీక్ష నిర్వహణకి విడుదల చేసిన పత్రికా ప్రకటనని ఇక్కడ అందించాము.
D.YSR UHS జూనియర్ అసిస్టెంట్ పరీక్షని నిర్వహించనున్న APPSC
D.YSR UHS జూనియర్ అసిస్టెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు
డా. వైఎస్ఆర్ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 2024 లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. D.YSR UHS జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 12 జనవరి 2024 నుండి ప్రారంభమైంది మరియు అభ్యర్థులు 01 ఫిబ్రవరి 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
D.YSR UHS జూనియర్ అసిస్టెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు లింక్
D.YSR UHS జూనియర్ అసిస్టెంట్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
D.YSR UHS జూనియర్ అసిస్టెంట్ కోసం దరఖాస్తు చేయడానికి ఈ దశలను అనుసరించండి
- దశ-1: క్రింద ఇవ్వబడిన D.YSR UHS జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ PDF నుండి మీ అర్హతను తనిఖీ చేయండి
- దశ-2: క్రింద ఇవ్వబడిన “ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయి” లింక్‌పై క్లిక్ చేయండి లేదా https://apysruhsjar.aptonline.in వెబ్‌సైట్‌ను సందర్శించండి
- దశ-3: STEP-1 రిజిస్ట్రేషన్ & ఫీ పేమెంట్ పై క్లిక్ చేసి దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి
- దశ-4: STEP-2 ద్వారా అవసరమైన ఫీజు చెల్లించి తదుపరి దశకి వెళ్ళండి
- దశ-5: STEP-3 లో దరఖాస్తు కీ సంభందించిన అన్నీ విషయాలు పూరించి మీ అప్లికేషన్ ను దరఖాస్తు చేసుకోండి
- దశ-6: తదుపరి అవసరాల కోసం దరఖాస్తు ఫారమ్‌ను ప్రింట్ చేసుకోండి
D.YSR UHS జూనియర్ అసిస్టెంట్ దరఖాస్తు విధానం
D.YSR UHS జూనియర్ అసిస్టెంట్ దరఖాస్తు రుసుము
D.YSR UHS జూనియర్ అసిస్టెంట్ దరఖాస్తు కోసం సాధారణ అభ్యర్థులు తప్పనిసరిగా రూ.1500/- దరఖాస్తు రుసుముగా చెల్లించాలి. డెబిట్/క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ లేదా అందుబాటులో ఉన్న ఏదైనా ఇతర ఎంపికను ఉపయోగించి ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించేటప్పుడు ఫీజును ఆన్‌లైన్ మోడ్‌లో చెల్లించవచ్చు.
దరఖాస్తు రుసుము |
|
Gen/ OBC/ EWS | రూ. 1500/- |
SC/ ST/ PWD/ ESM/ స్త్రీ | రూ. 750/- |
చెల్లింపు విధానం | ఆన్‌లైన్ |
D.YSR UHS జూనియర్ అసిస్టెంట్ జీతం
D.YSR UHS జూనియర్ అసిస్టెంట్ గా ఎంపికైన అభ్యర్ధులకి నెలకి అధికారిక వేతనం రూ.25,220 నుంచి రూ.80,910 వరకు ఉంటుంది. జీతంతో పాటు ప్రభుత్వం ఇతర అలవెన్సులు కూడా అందుకుంటారు.
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |