ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 2 మెయిన్స్ కి సమయం దగ్గర పడింది. అభ్యర్ధులు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష కి సన్నద్దతని మరింత వేగవంతం చేసి ఉంటారు ఈ సమయంలో ప్రతీ అంశం ప్రతీ విభాగం మార్కులు తీసుకుని వస్తాయి సమగ్ర రివిజన్ మరియు అవగాహన కచ్చితంగా ప్రశ్నలను సరైన సమాధానం చేసేందుకు ఉపయోగపడతాయి. APPSC గ్రూప్ 2 మెయిన్స్ లో ప్రాధాన్యత ఉన్న జానపద కళలు గురించి మరియు వాటితో ముడిపడి ఉన్న సంస్కృతి గురించి తెలుసుకోండి.
Adda247 APP
ఆంధ్రప్రదేశ్ లో జానపద కళలు
జానపదకళలకు ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లు, 1857 నుంచి 1956 వరకు దాదాపు ఒక శతాబ్దం పైనే ఆంధ్రప్రాంతం లో నృత్యం లో కొత్త ఒరవళ్ళు తొక్కింది మరియు పాత కొత్తల కలయికతో జానపదలు వెళ్లువిరిసాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ముఖ్యమైన జానపద కళలు
యక్షగానం
- ఇది ఒక ప్రాచీన జానపద కళ మరియు దీనికి ఈ పేరు జక్కులు ప్రదర్శించే ప్రబంధానికి యక్షగానం అని పిలుస్తారు
- పోల్కుర్కి సోమనాధుడు పండితాధ్య చరిత్ర లో యక్షగానం గురించి చర్చించారు.
- తాళ్లపాక అన్నమాచార్యులు సంస్కృతంలో యక్షగానం గురించి లక్షణము అనే గ్రంధంలో తెలిపారు.
కురవంజి
- కురవంజి లేదా కొరవంజి అని కూడా పిలుస్తారు.
- పిల్లనగ్రోవులు ఊదుతూ ఢమరుకం వాయిస్తూ పాటలు పాడుతూ కుండలాకార నృత్యాలు చేస్తారు
- శ్రీశైలం,సింహాచలం, తిరుపతి ప్రసిద్ద పుణ్యక్షేత్రాలలో కూరవంజి ప్రదర్శిస్తారు.
- దీనిని కురవలు, చెంచులు, కోయలు దీనిని ప్రదర్శిస్తారు.
తోలుబొమలాట
- తోలురంగులో వివిధ బొమ్మలను చేసి ఒక తెల్లని తెర వెనుక దీపం కాంతిలో బొమ్మలను ఆదిస్తారు.
- బొమ్మలను ఆడించడం తో పాటు పధ్యాలు, మాటలు, పాటలు పాడతారు.
- భారతదేశం లో తొలుబొమ్మలాట లో తలలను కూడా ఆడిస్తారు
- జుట్టుపోలీగాడు, కేతిగాడు, బంగారక్క ప్రసిద్ద తోలుబొమ్మలాట కళారూపాలు.
- నిమ్మ కుంట, అనంతపురం జిల్లా ఈ తోలుబొమ్మలాటకి ప్రసిద్ది
కురవ నృత్యం
- పురుషులు కృష్ణుని లాగా మరియు స్త్రీలు గోపికల వేషం వేసుకుని నృత్యం చేస్తారు. ఈ నృత్యంలో మధ్యలో రాధా కృష్ణులు వేషంలో మరో ఇద్దరు నిలచ్చుంటారు.
- ఇది తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ది
కోలాటం
- కొలటం అనేది ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాళలావ్ ప్రసిద్ది చెందింది
- పాటలకి తగిన నృత్యం చేస్తూ ఈ కోలాటాన్ని చేస్తారు, ఇందులో 8 లేదా 12 మంది పాల్గొంటారు
- కోలాటంలో గజ్జెలు, కర్రలు(కోపులు) వాడతారు, కన్నడ ప్రాంతంలో జడకోలాటన్ని జాడ కోళ్ళుఅని పిలుస్తారు.
మెరవణి నృత్యం
- ఈ నృత్యం రాయలసీమ ప్రాంతంలో ప్రసిద్ది చెందినది
కోనసీమ గరగలు
- అమాలపురం తాలూకా కోన సీమ ప్రాంతంలో ఈ మాదిరి దేవతలు గరగ నృత్యాల ప్రాముఖ్యంతో వున్న గ్రామాలు దాదాపు 35 వరకూ వున్నాయి.
- ఒరిస్సాకు చెందిన రాయగడ మధ్య గవరమ్మ వుత్సవంలో కూడ ఈ గరగ నృత్య ప్రాముఖ్యాత వుంది.
- అగ్ని గుండాలను తొక్కడం ద్వారాఒక ప్రత్యేకతను సంతరించుకుంది.
- అంతే కాక ఉభయ గోదావరి జిల్లాలలో చాలా చోట్ల ఇది ప్రసిద్ది చెందినది
అలాపు తొక్కడం
- ముహర్రం సమయంలో అలాపు అంటే అగ్నిగుండాన్ని తొక్కుతారు.
కనక తప్పెట్లు
- డప్పుల వాయిద్యాన్ని కనక తప్పేట్లు అంటారు.
- కనక తప్పేట్లు జాతరలకి, వివహాలకి ఉపయోగిస్తారు.
తప్పెటగుళ్ళు
- విశాఖ జిల్లాలో ఎక్కువమంది దీనిని ప్రదర్శిస్తారు మరియు కోనారులు, యాదవులు, గొల్లలు దీనిని ప్రదర్శిస్తారు
- తప్పెటగుళ్ళు, ఉత్తరాంధ్ర యాదవుల కళారూపం దీనిని దాదాపు 400 సంవత్సరాల చరిత్ర ఉంది.
భాగవతులు
- కాళ్ళకు గజ్జలు కట్టుకుని చిరుతలతో తాళం వేస్తూ రామదాసు కధలని పాడుతూ ఉంటారు
- దీనిని యాదవులు ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు.
చెక్క భజన
- ప్రాచిన జానపదకళా రూపాల్లో చెక్క భజన కూడా ఒకటి, ఈ చక్కభజన బృందంలో 16నుండి 20మంది సభ్యులు వరకూ ఉంటారు
- దేవుని స్తంబయలు పట్టుకుని భక్తితో భజనలు చేస్తారు
- చెక్కలతో, తాళం వేస్తూ కాళ్ళకి గజ్జెలు కట్టుకుని నృత్యం చేస్తారు
రేలా నృత్యం
- దీనిని రేలాట అని కూడా అంటారు
- ఇది కొయ్య తెగ మహిళలు మరియు గిరిజనులు చేసే సంప్రదాయ నృత్యం
ధింసా నృత్యం
- ఈ నృత్యాన్ని విశాఖ ప్రాంతం లోని అరకు లోయలో ఉన్న బుగతలు, కోటియా, ఖోండులు దీనిని ఆలపిస్తారు
- తుండి, మోరీ, కిచిడీ, డప్పు వాయిద్యాలను ఉపయోగిస్తారు.
సిద్ధి నృత్యం
- వివాహ సందర్భాలలో రంగు రంగుల లుంగీలు ధరించి నాడుముగా బాకు బిగించి చేతితో కత్తి పట్టుకుని నృత్యం చేస్తారు.
- నృత్య కారులు అర్థ వలయాకారంలో ఏర్పడి వెనుక పాడే వంత పాటకు రక రకాల ఖడ్గ యుద్ధ రీతులు ప్రదర్శిస్తారు. వేగం ఎక్కువయ్యే కోద్దీ నృత్యం పరాకాష్ఠలో కుంటుంది
అశ్వ నృత్యం
- అశ్వనృత్యాలు ఎక్కువగా కృష్ణా గుంటూరు జిల్లాలలో చేస్తారు
- దీనిని కీలుగుర్రాలాట అని కూడా పిలుస్తారు.
- మొడ వరకు గల ఒక గుఱ్ఱపు తలను పేడతో చేయించి వివిధ వార్నీషు రంగులతో అలంకరించి, ఇతర శరీర భాగాన్నంతా, తేలిక వెదురు బద్దలతో గుఱ్ఱపు ఆకారాన్ని తయారు చేసి చుట్టూ ఎఱ్ఱ చంగు చీరను కట్టి, ఆ గుఱ్ఱాన్ని చంకలకు తగిలించుకుని వెనకకూ, ముందుకూ నడుస్తూ, మధ్య మధ్య ఎగురుతూ, నృత్యం చేస్తారు.
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |