భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న ఘనమైన చరిత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనగా ఇప్పటి తెలంగాణతో మరియు ఆంధ్రప్రదేశ్ లకు ఉంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఈ ప్రాంతానికి చెందిన పలువురు స్వాతంత్ర్య సమరయోధులు కీలక పాత్ర పోషించారు. ప్రముఖులు కొందరే ఉన్నా స్వాతంత్ర్య పోరాటం లో పాల్గొని వాళ్ళ జీవితలని ఈ నాటి మన కోసం అర్పించిన వారందరికీ మనం ఎప్పటికీ ఋణపడి ఉంటాము. పోటీ పరీక్షలలో ముఖ్యంగా APPSC గ్రూప్ 1 మరియు APPSC గ్రూప్ 2, డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ మరియు AP గ్రామ సచివాలయం వంటి వాటిలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ప్రముఖులు స్వాతంత్ర్య సమరయోధులు గురించి అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మేము మీకోసం ఈ కధనం లో ఆంధ్రప్రదేశ్ కి చెందిన స్వాతంత్ర్య పోరాట యోధుల గురించి ముఖ్య సమాచారం అందిస్తాము.
ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన స్వాతంత్ర్య సమరయోధులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడటానికి వివిధ పద్ధతులను ఉపయోగించారు. వీరు శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి అహింసాయుత ఉద్యమాలలో పాల్గొన్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాట్లకు కూడా నాయకత్వం వహించారు. పోరాటంలో భూస్వాములు, రైతులు, గిరిజనులు, మహిళలు, సామాజిక కార్యకర్తలు మొదలైన వారు ఉన్నారు భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించాలనే లక్ష్యంతో వారందరినీ ఏకం చేసింది.
APPSC/TSPSC Sure shot Selection Group
ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముఖ్య స్వాతంత్ర్య సమరయోధులు
ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన స్వాతంత్ర్య సమరయోధులు భారత స్వాతంత్ర్యోద్యమంలో గణనీయమైన కృషి చేశారు. వారి త్యాగాలు, పోరాటాలు 1947లో భారత స్వాతంత్ర్యానికి బాటలు వేశాయి. తెలుగు వారి ఖ్యాతిని తెలుగు వారి జాతిని బ్రిటిష్ వారికి రుచి చూపించి వారికి చెమటలు పట్టించేలా చేశారు కొందరు. స్వాతంత్ర్య పోరాటం లో ముందు ఉండి ప్రజలను నడిపించిన వీరులు మరి కొందరు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముఖ్య స్వాతంత్ర్య సమరయోధులు
1. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి
ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్య సమరయోధులలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర ప్రముఖమైనది. 1806 నవంబర్ 24న నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలోని రూపనగుడి గ్రామములో జన్మించారు. 1847 లో బ్రిటిష్ వారి పై తిరుగుబాటు చేశారు. నరసింహ రెడ్డి చూపిన ధైర్యం, తెగువ బ్రిటిష్ వారికి చెమటలు పట్టేలా చేసింది. ప్రజల పట్ల మరియు పేదల పక్షాన నిలిచిన ఉయ్యాల వాడ నరసింహ రెడ్డి ఎందరి గుండెలలోనో స్వాతంత్ర్య పోరాటాన్ని రగిలించాడు. బ్రిటీష్ వారు ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా నిరసనలు చేబట్టి వారి దోపిడీ ని ఎదుర్కున్నారు. పేద మరియు రైతులను పీడించే బ్రిటిష్ వారి పై పోరాటం చేశారు. 3000 పైగా బ్రిటిష్ పాలకులని చంపినట్టు చరిత్ర చెబుతోంది. 1847 ఫిబ్రవరి 22న ఉదయం 7 గంటలకు జుర్రేటి వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో బహిరంగంగా ఉరితీశారు. ఆయన తలను 1877 దాకా కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వ్రేలాడదీసే ఉంచారు తద్వారా విప్లవ కారులు భయపడతారు అని బ్రిటిష్ వారి నమ్మకం.
2. అల్లూరి సీతారామ రాజు
ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్య సమరయోధులలో అల్లూరి సీతారామ రాజు భీమునిపట్నం జులై 1897 న జన్మించారు వీరి కుటుంభం తూర్పు గోదావరి జిల్లా భీమవరం లో స్తిరపడ్డారు. అప్పట్లోనే కోలకతా వరకూ నడిచి వెళ్లారు. 1921 లో దేశయాటన చేశారు. కృష్ణ దేవర పేట/ కె.డి పేట లో బ్రిటిష్ వారు చేస్తున్న అరచకాలు చూసి పోరాటాన్ని ప్రారంభించారు. సీతారామరాజు కి ముఖ్య అనుచరులు గంటం దొర మరియు మల్లు దొరల సహాయంతో ఆయుధాలు దొంగతనం చేశారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజుగా పేరొందారు. ప్రధానంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో 1922 నాటి రంప తిరుగుబాటులో తిరుగుబాటు చేశారు. కెఎల్ పురం కొండ ప్రాంతం లో ఆయనను దహనం చేశారు.
3. పింగళి వెంకయ్య
పింగళి వెంకయ్య స్వాతంత్ర్య సమర యోధుడే కాకుండా భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ తరపున జాతీయ పతాక రూపకర్తగా కూడా నిలిచారు. 1916లో “భారత దేశానికి ఒక జాతీయ పతాకం” అనే ఆంగ్ల గ్రంథాన్ని కూడా రచించారు. పింగళి వెంకయ్య 1906 నుంచి 1922 వరకు భారత జాతీయోద్యమంలోని వివిధ ఘట్టాలలో పాల్గొన్నాడు. వందేమాతరం, హోమ్‌రూల్ ఉద్యమం, ఆంధ్రోద్యమాలలో పాల్గొని తన గొంతు వినిపించారు. గాంధీజీ సూచనల మేరకు జాతీయ జెండాను రూపొందించారు. ప్రస్తుతం మనం చూస్తున్న జండా కన్నా ముందు మన జాతీయ జెండా మధ్యలో రాట్నంగల ఒక జెండాను రూపొందించారు. 1947 లో ప్రస్తుతం మనం చూస్తున్న త్రివర్ణ పతాక జండాను నెహ్రూ గారు భారత రాజ్యాంగ సభలో ఆమోదించారు. 2009లో ఆయన చిత్రంతో పోస్టల్ స్టాంప్‌ను ప్రవేశపెట్టారు మరియు 2011లో ఆయనకు భారతరత్న అవార్డు లభించింది. జూలై 4, 1963, విజయవాడలో పింగళి గారు మరణించారు.
4. గొట్టిపాటి బ్రహ్మయ్య
గొట్టిపాటి బ్రహ్మయ్య గారు కృష్ణా జిల్లాలోని చినకళ్ళేపల్లి లో1889 డిసెంబరు 3 న జన్మించారు. గొట్టిపాటి బ్రహ్మయ్య స్వాతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన సైమన్ కమిషన్ మొదలు క్విట్ ఇండియా ఉద్యమం దాకా చాలా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు జైలుశిక్ష కూడా అనుభవించారు. 1968 జూన్ 30 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి అధ్యక్షునిగా ఉన్నారు. 1982లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ బాహుకరించింది. ఈయనకు రైతు పెద్ద అనే బిరుదు కలదు. ఈయన 1982 లో మరణించారు.
5. టంగుటూరి ప్రకాశం పంతులు
ఆంధ్ర కేసరి లేదా టంగుటూరి ప్రకాశం గారు చాలా ముఖ్యమైన వ్యక్తి మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. బిపిన్ చంద్ర పాల్ ప్రసంగాలు ఈయనకు స్పూర్తి. స్వరాజ్య వార్తాపత్రికలో ఎడిటర్‌గా కొంతకాలం పని చేశారు మరియు కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా మెలిగారు. ఆయన ధైర్యసాహసాలకు ఆంధ్ర ప్రజలు ఆంధ్ర కేసరి అనే బిరుదునిచ్చారు.
6. కనెగంటి హనుమంతు
1870, గుంటూరులో కన్నెగంటి జన్మించారు. కనెగంటి హనుమంతు బ్రిటీష్ వారికి పన్నులు చెల్లించడాన్ని వ్యతిరేకించారు ఆయన తిరుగుబాటుని పుల్లరి సత్యాగ్రహంగా ప్రసిద్ధి చెందింది. అతను తిరుగుబాటులో పాల్గొన్న రైతు నాయకుడు మరియు బ్రిటిష్ అధికారి చేతిలో చంపబడ్డాడు. కన్నెగంటి హనుమంతు 1922 ఫిబ్రవరి 26 తేదీన మరణించారు.
7. సర్దార్ గౌతు లచ్చన్న
సర్దార్ గౌతు లచ్చన్న ఆగస్టు 16, 1909న జన్మించారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం తదితర పోరాటాలలో పాల్గొన్నారు. ఈయనని చిన్న తనం 21 సంవత్సరాల వయస్సు లోనే బ్రిటిష్ వరు ఖైదు చేశారు. ఈయన బ్రిటిష్ వారికి ఎదురు తిరిగినందుకు సర్దార్ అనే బిరుదు లభించింది. సర్దార్ గౌతు లచ్చన్నఏప్రిల్ 2006 లో మరణించారు.
8. కల్లూరి చంద్రమౌళి
కల్లూరి చంద్రమౌళి 1898 నవంబరు 15న గుంటూరుజిల్లాలో జన్మించారు. కల్లూరి చంద్రమౌళి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన చర్యలకు పలుమార్లు అరెస్టయ్యారు. క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొన్నారు. తెనాలిలో వారి స్మృతి చిహ్నంగా 1959లో ‘రణ రంగ చౌక్’ ను నిర్మించారు. ఎన్నికలో కూడా పాల్గొని స్వాతంత్ర్యానంతరం కూడా తన రాజకీయాలలో ఉన్నారు. 1946 లో ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషత్కు మద్రాస్ ప్రొవెంషియల్ నుండి (మొదటి పార్లమెంట్) సభ్యునిగా ఎన్నికయ్యారు.
9. ఆచార్య ఎన్.జి.రంగా
ఆచార్య ఎన్.జి.రంగాగారు నవంబర్ 2000 లో జన్మించారు. ఆచార్య ఎన్.జి.రంగా 1930లో గాంధీగారి పిలుపుకి ఆయన అడుగు జాడలలో నడిచారు. ప్రజా సమస్యలకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆయన అనేక పుస్తకాలు రాశారు, ప్రసిద్ధి చెందినది బాపూ బ్లెస్సెస్ రచించారు. 60 ఏళ్ల పాటు పార్లమెంటు సభ్యుడిగా (1930-1991) వరకూ సేవలందించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. ఈయనకి భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారం అందించింది. 1936 లో స్వామి సహజానంద సరస్వతితో కలసి భారతీయ కిసాన్ సభను (AIKS) స్థాపించాడు. గ్రామీణ ప్రజల కోసం ‘వాహిని ‘అనేవార పత్రికను 1936లో ప్రారంభించారు. 1995 జూన్ 8వ తేదీన తుదిశ్వాస విడిచారు.
10. స్వామి రామానంద తీర్థ
స్వామి రామానంద తీర్థ అసలు పేరు వెంకటరావు ఖెడ్గేకర్. ఈయన అక్టోబర్ 3, 1903లో గుల్బర్గా జిల్లా, జాగిర్ గ్రామంలో జన్మించారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు మరియు ఈయన సన్యాసం తీసికుని విద్యారంగానికి కృషి చేశారు.
11. కాళోజీ నారాయణరావు
కాళోజీ నారాయణరావు అసలు పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ ఈయన 9, సెప్టెంబరు 1914 లో జన్మించారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా 1958 నుండి 1960 వరకు పనిచేసారు. ఈయనకి 1992 లో పద్మవిభూషణ్ లభించింది. ఈయన ఎన్నో రచనలు చేశారు అందుకుగాను “ప్రజాకవి” బిరుదు కలదు.
12. దుగ్గిరాల గోపాల కృష్ణయ్య
1889 జూన్ 2న, పెనుగంచిప్రోలు గ్రామం కృష్ణా జిల్లాలో జన్మించారు. 1919 లో బ్రిటిష్ ప్రభుత్వం చీరాల, పేరాల మునిసిపాలిటీలను విలీనం చేసినపుడు, అందుకు వ్యతిరేకంగా జరిగిన సహాయ నిరాకరణోద్యమానికి గోపాలకృష్ణయ్య నాయకత్వం వహించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. 1921 లో ఆంధ్ర రత్న బిరుదు అందుకున్నారు.
13. పర్వ తనేని వీరయ్యచౌదరి
పర్వ తనేని వీరయ్యచౌదరి 1886 అక్టోబరు 4న గుంటూరు జిల్లాలో జన్మించారు. 1921 లో దాదాపు 6000 మందితో శాంతి సైన్యం ఏర్పాటు చేసారు.న్ 1921 లో బ్రిటీష్ పాలకులను గడగడలాడించిన ఉద్యమాలలో ప్రధానమైనదిగా పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమం గుర్తింపు పొందింది. ఈ ఉద్యమం లో ఈయనతో పాటు కొల్లా వెంకయ్య గారు కూడా పోరాడారు. వెంకయ్య గారు 1944 లో గుంటూరు మార్కెట్ యార్డు చారిమం గా చేశారు.
వీరి తో పాటు ఇంకా ప్రముఖులు తేళ్ళకృష్ణయ్య చౌదరి, చౌదరి సత్యనారాయణ, పుచ్చలపల్లి సుందరయ్య, కల్లూరి చంద్రమౌళి, వావిలాల గోపాలకృష్ణయ్య, వీరపాండియ కట్టబొమ్మన్, చంద్ర పుల్లారెడ్డి వంటి తదితరులు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముఖ్య స్వాతంత్ర్య సమరయోధులు PDF
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |