General Knowledge MCQS Questions And Answers in Telugu : Andhra Pradesh Police Recruitment Board has released AP Police Notification 2022 for various posts in Andhra Pradesh. We are providing General Knowledge MCQS Questions And Answers in Telugu with detailed solutions for AP Police and APPSC Groups and AP Police with Latest syllabus. This MCQ or Multiple choice or objective Questions are very useful for crack the APPSC Groups & AP Police. Practice General Knowledge Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination.
General Knowledge MCQS Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ పోస్టుల కోసం AP పోలీస్ నోటిఫికేషన్ 2022ని విడుదల చేసింది. మేము AP పోలీస్ మరియు APPSC గ్రూప్స్ మరియు AP పోలీసులకు తాజా సిలబస్‌తో వివరణాత్మక పరిష్కారాలతో తెలుగులో MCQS ప్రశ్నలు మరియు సమాధానాలను అందిస్తున్నాము. ఈ MCQ లేదా బహుళ ఎంపిక లేదా ఆబ్జెక్టివ్ ప్రశ్నలు APPSC గ్రూప్స్ & AP పోలీసు పరీక్షను క్లియర్ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. తెలుగులో జనరల్ నాలెడ్జ్ క్విజ్ ప్రశ్నలు మరియు సమాధానాలను ప్రాక్టీస్ చేయండి, మీరు ఈ విభాగానికి బాగా ప్రిపేర్ అయితే, మీరు పరీక్షలో మంచి మార్కులు సాధించవచ్చు.
APPSC/TSPSC Sure shot Selection Group
General Knowledge MCQs Questions And Answers in Telugu
General Knowledge Questions – ప్రశ్నలు
Q1. గత అయిదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నికర ఉత్పత్తి ఎంత శాతం పెరిగింది?
(a) 50%
(b) 55%
(c) 60%
(d) 68%
Q2. 2019-20లో ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తికి అదనంగా సమకూరిన విలువలో (గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్) సేవా రంగం వాటా ఎంత శాతం ఉంది?
(a) 41.80%
(b) 42.50%
(c) 52.80%
(d) 50.15%
Q3. జననాల రేటు (ప్రతి వెయ్యి మందికి) 2008లో 18.4 ఉండగా, 2018 నాటికి ఎంతకి తగ్గింది?
(a) 15
(b) 19
(c) 13
(d) 16
Q4. 2018-19నాటి లెక్కల ప్రకారం రాష్ట్రంలో నిరుద్యోగ రేటు ఎంత శాతం ఉంది?
(a) 7.3%
(b) 4.5%
(c) 5.3%
(d) 5.1%
Q5. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి అందుబాటు సూచికలో అట్టడుగున ఉంది?
(a) ఆంధ్రప్రదేశ్
(b) కర్ణాటక
(c) ఉత్తర్‌ప్రదేశ్
(d) తమిళనాడు
Q6. 32వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం రూపొందించబడ్డ అధికరణలు ఏవి?
(a) 371(e),371(c)
(b) 371(d),371(g)
(c) 371(d),371(e)
(d) 371(a),371(e)
Q7. ఆంధ్రా-తెలంగాణా ప్రాంతాల మధ్య పెద్దమనుషుల ఒప్పందం జరిగిన సంవత్సరం?
(a) 1956
(b) 1957
(c) 1959
(d) 1952
Q8. హైదరాబాద్ నగరం ఉమ్మడి రాజధానిగా ఉంటుందని విభజన చట్టంలోని ఏ సెక్షన్ చెబుతుంది?
(a) సెక్షన్ 5
(b) సెక్షన్ 6
(c) సెక్షన్ 94(3)
(d) సెక్షన్ 94(4)
Q9. నూతన రాజధాని కొరకు ఏర్పాటు చేయబడిన కమిటీ ఏది?
(a) శ్రీకృష్ణ కమిటీ
(b) ఎస్ కె థార్ కమిటీ
(c) జె వి పి కమిటీ
(d) శివరామకృష్ణన్ కమిటీ
Q10. ల్యాండ్ పూలింగ్ స్కీం(Land Pooling Scheme) కింద భూమి లేని రైతులకు ప్రతినెలా ఎంత మొత్తంగా పెన్షన్ ఇవ్వబడుతుంది?
(a) 2650
(b) 2550
(c) 2500
(d) 2450
Solutions
S1.Ans(c)
Sol. గత అయిదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నికర ఉత్పత్తి (నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్) 60% (60.68%) పెరిగింది. ఈ అయిదేళ్లలో నికర ఉత్పత్తి వృద్ధిరేటు వరుసగా 15.7%, 12.4%, 16.4%, 8.9%, 12.8% మేర నమోదైంది.
S2.Ans(a)
Sol. ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తికి అదనంగా సమకూరిన విలువలో (గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్) సేవా రంగం వాటా 41.80% ఉంది. అయిదేళ్లలో ఈ రంగం సగటున 7.56% వృద్ధి నమోదు చేసింది.
S3. Ans(d)
Sol. ఆంధ్రప్రదేశ్ లో జననాల రేటు (ప్రతి వెయ్యి మందికి) 2008లో 18.4 ఉండగా, 2018 నాటికి 16కి తగ్గింది. అదేవిధంగా మరణాల రేటు 7.5 నుంచి 6.7కి తగ్గింది. మరోవైపు సంతానసాఫల్య రేటు 1.8 నుంచి 1.6కి తగ్గింది.
S4. Ans(c)
Sol. 2018-19నాటి లెక్కల ప్రకారం రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 5.3%. గ్రామీణ ప్రాంతాల్లో 4.5%, పట్టణ ప్రాంతాల్లో 7.3%గా ఉంది.
S5. Ans(a)
Sol. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి అందుబాటు సూచికలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగున ఉంది.
S6. Ans(c)
Sol. 1974 మే నెలలో32వ రాజ్యాంగ సవరణ చట్టంగా ఆమోదించబడింది, దీని ప్రకారం ఆర్టికల్ 371 మార్పులు చేస్తూ 371 (డి) అధికరణ మరియు 371 (ఇ) అధికరణలు కొత్తగా చేర్చబడ్డాయి. 371 (డి) ప్రకారం రాష్ట్రపతి కి అధికారాలు కల్పించబడ్డాయి , 371 (ఇ) ప్రకారం హైదరాబాద్‌లో (హెచ్‌సియూ) ఏర్పాటు.
S7. Ans(a)
Sol. 1956 ఫిబ్రవరి 20న ఢిల్లీలోని హైదరాబాద్ భవన్ (ప్రస్తుత ఏపీ భవన్) ఈ పెద్దమనుషుల ఒప్పందం జరిగింది
S8. Ans(a)
Sol. విభజన చట్టం భాగం -2లోని సెక్షన్ ‘5’ ప్రకారము హైదరాబాద్ నగరం తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌కు 10 సంవత్సరముల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది.
S9.Ans(d)
Sol. 2014 మార్చి 28న నూతన రాజధాని కొరకు ఏర్పాటు చేయబడిన కమిటీ శివరామకృష్ణన్ కమిటీ. దానిలోని సభ్యులు : రతిన్ రాయ్, అరోమర్ రెవి ,జగన్ షా ,కె టి రవీంద్రన్.
S10.Ans(c)
Sol. ల్యాండ్ పూలింగ్ స్కీం(Land Pooling Scheme) కింద భూమి లేని రైతులకు ప్రతినెలా రూ. 2500 పెన్షన్ ఇవ్వబడుతుంది. మరియు వారికీ ఉచితంగా ఇల్లు కట్టి ఇవ్వబడుతుంది మరియు రైతులకు రూ. లక్ష 50వేల ఋణం మంజూరు చేయబడుతుంది.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |