Gentlemen’s Agreement 1956 | పెద్ద మనుషుల ఒప్పందం 1956
- ఈ ఒప్పందం ఢిల్లీలోని హైద్రాబాద్ హౌజ్ (ప్రస్తుత ఆంధ్రభవన్)లో 1956 ఫిబ్రవరి 20న జరిగింది.
- ఈ ఒప్పందంనే పెద్దమనుషుల ఒప్పందం (లేదా) జెంటిల్ మెన్ అగ్రిమెంట్ అందురు.
- ఈ ఒప్పందంపై ఆంధ్రానుండి – నలుగురు నాయకులు, తెలంగాణా నుండి 4గురు నాయకులు సంతకం చేశారు.
తెలంగాణ నాయకులు :
- బూర్గుల రామకృష్ణారావు (హైద్రాబాద్ సి.ఎమ్.)
- కె.వి. రంగారెడ్డి (ఎక్సైజ్ శాఖ మంత్రి)
- మర్రి చెన్నారెడ్డి (వ్యవసాయ, పౌర సరఫరాల మంత్రి)
- జె.వి.నర్సింగరావు (హైదరాబాద్ పీసీసీ)
ఆంధ్ర నాయకులు :
- బెజవాడ గోపాల్ రెడ్డి – (ఆంధ్ర సి.ఎమ్.)
- నీలం సంజీవరెడ్డి (ఉపముఖ్యమంత్రి)
- సర్దార్ గౌతు లచ్చన్న (స్వతంత్ర పార్టీ)
- అల్లూరి సత్యనారాయణ రాజు (ఆంధ్ర రాష్ట్ర పీసీసీ)
APPSC/TSPSC Sure shot Selection Group
పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలు
- రాష్ట్ర కేంద్రీకృత, సాధారణ పాలనా ఖర్చు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు దామాషా ప్రకారం భరించాలి. తెలంగాణ ప్రాంతపు మిగులు ఆదాయాలు తెలంగాణ అభివృద్ధి కోసం రిజర్వ్ చేసి ఉంచాలి. ఈ ఏర్పాటును ఐదు సంవత్సరాల అనంతరం ఒకవేళ తెలంగాణ ప్రాంత శాసన సభ్యులు కోరితే సమీక్షించాలి.
- తెలంగాణ ప్రాంత శాసన సభ్యులు సూచించిన పద్దతులనే తెలంగాణలో మధ్య నిషేదం అమలుకావాలి.
- తెలంగాణలో ప్రస్తుతం ఉన్న విద్యాసౌకర్యాల్లో తెలంగాణ విద్యార్థులకే అవకాశాలు ఇవ్వాలి. వాటిని మరింత అభివృద్ధిపరచాలి. తెలంగాణలోని కాలేజీలు, సాంకేతిక విద్యాలయాల్లో ప్రవేశాలు కేవలం తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ఉండాలి. అది కాని పక్షంలో రాష్ట్రం మొత్తం మీద ప్రతి విద్యాలయంలో మూడింట ఒకవంతు (1/3) స్థానాలు తెలంగాణ విద్యార్థులకు అందించాలి. ఈ రెండింట్లో ఏది తెలంగాణ విద్యార్థులకు మేలు కలుగజేస్తుందో ఆ నిర్ణయం తీసుకోవాలి.
- ఇప్పుడు రాష్ట్రం ఏర్పాటువల్ల ఉద్యోగాలు తొలగించవలసి వస్తే, రెండు ప్రాంతాల్లో జనాభా దామాషా ప్రకారం తొలగించాలి.
- తదుపరి ఉద్యోగ నియామకాలు రెండు ప్రాంతాల జనాభాను ప్రాతిపదికగా చేసుకుని జరగాలి.
- పాలనా న్యాయవ్యవహారాల్లో ప్రస్తుతం తెలంగాణలో అమలులో ఉన్న ఉర్దూను ఇలాగే ఐదుసంవత్సరాలు కొనసాగించాలి. రీజనల్ కౌన్సిల్ ఈ అంశాన్ని పునస్సమీక్షించాలి. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేసుకునేటప్పుడు, తెలుగు భాషా పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలనే నియమం ఉండరాదు. అయితే ఉద్యోగంలో చేరిన తరువాత రెండు సంవత్సరాలలో నిర్దేశిత తెలుగు ప్రావీణ్యతా పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి.
- తెలంగాణావారు తమ జనాభా దామాషాకు అనుగుణంగా ఉద్యోగాలు పొందేందుకు స్థానిక నియమాలు రూపొందాలి. ఉదా: 12 ఏండ్లు ఆవాసం లాంటివి.
- తెలంగాణ ప్రాంతంలోని వ్యవసాయ భూమి అమ్మకాలు తెలంగాణ రీజనల్ కౌన్సిల్ నియంత్రణలో ఉండాలి.
- తెలంగాణ ప్రాంత అవసరాలను, ఆవశ్యకతలను దృష్టిలో ఉంచుకొని దాని సర్వతోముఖాభివృద్ధి కోసం,రీజనల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి.
- రీజనల్ కౌన్సిల్ లో 20 మంది సభ్యులుండాలి. ఈ శాసన సభ్యులను కింది విధంగా కౌన్సిల్ లకు తీసుకోవాలి.
- తొమ్మిదిమంది సభ్యులు తెలంగాణలోని తొమ్మిది జిల్లాలకు ప్రాతినిధ్యం వహించే శాసనసభ్యులు ఉండాలి. వీరిని తెలంగాణ ప్రాంత జిల్లాల శాసనసభ్యులు జిల్లాలవారీగా ఎన్నుకోవాలి.
- ఆరుగురు తెలంగాణ ప్రాంత శాసన సభ్యులు లేక పార్లమెంట్ సభ్యులు ఉండాలి. వీరిని తెలంగాణ ప్రాంత శాసన సభ్యులందరూ కలిసి ఎన్నుకోవాలి.
- 5గురు సభ్యులు శాసనసభకు బయటివారు ఉండాలి. ఈ 5గురు తెలంగాణ శాసనసభ్యులతో ఎంపిక చేసుకోవాలి. వీరేకాక, తెలంగాణ ప్రాంత మంత్రులందరూ ఈ కౌన్సిల్ లో మెంబర్లుగా ఉంటారు.
- ముఖ్యమంత్రి లేదా ఉపముఖ్యమంత్రి ఎవరు తెలంగాణకు చెందిన వారైతే వారు ఈ కౌన్సిలకు అధ్యక్షత వహించాలి. మంత్రిమండలిలోని ఇతర క్యాబినెట్ మంత్రులు ఆహ్వానితులుగా ఉండవచ్చు.
11. రిజనల్ కౌన్సిల్ చట్టబద్దసంస్థగా ఉండాలి. ఇంతకుముందు పేర్కొన్న అంశాలపై నిర్ణయాధికారం ఉండాలి.
- ప్రణాళిక అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, ఇతర ప్రాజెక్టుల విషయమై సాధారణ ప్రణాళికలో భాగంగా పారిశ్రామిక అభివృద్ది, తెలంగాణ ప్రాంతపు ఉద్యోగనియామకాల విషయంలో నిర్ణయాధికారం ఉండాలి.
- ఏదైనా అంశంపై రీజనల్ కౌన్సిల్ కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అభిప్రాయ భేదాలుంటే ఆ అంశాన్ని భారత ప్రభుత్వానికి నివేదించాలి. భారత ప్రభుత్వ నిర్ణయమే అంతిమ నిర్ణయం.
12. మంత్రిమండలిలో 60:40 శాతంగా ఆంధ్రప్రాంతీయులు తెలంగాణ ప్రాంతీయులు ఉండాలి. తెలంగాణకు చెందిన 40 శాతంలో కచ్చితంగా తెలంగాణ ప్రాంత ముస్లిం శాసనసభ్యుడు ఉండాలి.
- ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం నుంచి ఉంటే, ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతం నుంచి ఉండాలి. ముఖ్యమంత్రి పదవిలో తెలంగాణ ప్రాంతీయులు ఉంటే, ఉపముఖ్యమంత్రి పదవిలో ఆ ప్రాంతీయులుండాలి. కింది శాఖలలో 2 శాఖలు తప్పనిసరిగా తెలంగాణ వారికి కేటాయించాలి. 1.హోం శాఖ 2. ఆర్థిక శాఖ, 3. రెవిన్యూ, 4. ప్రణాళిక అభివృద్ధి, 5. వాణిజ్యం -పరిశ్రమలు
- హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు 1962 వరకు ప్రత్యేకప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉండాలని అభిప్రాయ పడ్డారు. ఆంధ్రప్రాంత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునికి ఈ విషయంలో ఎటువంటి అభ్యంతరం ఉండకూడదు.
ఈ చర్చలల్లో రెండు అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. కొత్తగా ఏర్పడనున్న రాష్ట్రం పేరు ఒక అంశం కాగా, హైకోర్టుకు సంబంధించిన అంశం మరొకటి.
- తెలంగాణ ప్రాంత ప్రతినిధులు రాష్ట్రానికి ఆంధ్ర తెలంగాణ అని పేరు పెట్టాలి అన్నారు. (ఇది ముసాయిదా బిల్లులో ఉన్నది). ఆంధ్రప్రాంత ప్రతినిధులు జాయింట్ సెలెక్ట్ కమిటీ సూచించిన ఆంధ్రప్రదేశ్ అనే పేరు ఉండాలన్నారు.
- గుంటూరులో హైకోర్టు బెంచ్, హైదరాబాదులో ప్రధానపీఠం ఉండాలని తెలంగాణ ప్రాంత ప్రతినిధులు అన్నారు. గుంటూరులో బెంచ్ ఉండనవసరం లేదని, హైకోర్టు హైదరాబాదులోనే ఉండాలని ఆంధ్రప్రాంత ప్రతినిధులు అన్నారు.
- 1956 ఫిబ్రవరి 20న చేసిన పై 14 అంశాల ప్రకటనను పెద్దమనుషుల ఒప్పందం అని పేర్కొంటారు.
- ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం పెద్దమనుషుల ఒప్పందంను ‘నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ ప్రపోజ్డ్ ఫర్ ది. తెలంగాణ ఏరియా’ అనే పత్రం తయారుచేసి 1956 ఆగస్టు 10న పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది.
- ఈ నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ లో ప్రాంతీయ మండలిని ప్రాంతీయస్థాయి సంఘంగా మార్చి అధికారాలను కుదించారు.
- రాజ్ బహదూర్ గౌర్ అడిగిన ప్రశ్నకు జవాబుగా కేంద్రప్రభుత్వం ఈ ఒప్పందాన్ని నోట్ ఆన్ సేఫ్ గార్డ్ పేరుతో పార్లమెంటులో ప్రవేశపెట్టింది.
తెలంగాణ ప్రాంతీయ సంఘం (టి.ఆర్.సి.)
- పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ ప్రాంతీయ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కమిటీ ఆర్డర్-1958ని జారీ చేసింది.
- ఈ చట్టం ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో ప్రాంతీయ కమిటీల ఏర్పాటును ప్రతిపాదించింది.
- 1958లో రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతీయ కమిటీని ఏర్పాటుచేశారు.
- ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి తెలంగాణ ప్రాంతీయ కమిటీకి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయలేదు.
- తెలంగాణ ప్రాంతీయ కమిటీకి 1958లో చట్టబద్ధత లభించినప్పటికి నీలం సంజీవరెడ్డి దీనిని పట్టించుకోలేదు.
- దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతీయ కమిటీకి కార్యవర్గాన్ని నియమించాడు.
అధ్యక్షులు | ఉపాధ్యక్షులు | కాలం |
కె. అచ్యుత్ రెడ్డి | మసూమాబేగం | 1960-1962 |
టి. హయగ్రీవాచారి | రంగారెడ్డి | 1962-1967 |
జె. చొక్కారావు | కోదాటి రాజమల్లు | 1967-1972 |
కోదాటి రాజమల్లు | సయ్యద్ రహ్మత్ అలీ | 1972 |
మిగులు నిధులకు సంబంధించి టి.ఆర్.సి. పనితీరు
1956 నుండి 1959 వరకు ప్రభుత్వం తెలంగాణలో చేయాల్సిన దానికన్నా తక్కువ వ్యయం చేసిందని టి.ఆర్.సి. తన నివేదికలో పేర్కొంది.
- 1961లో తెలంగాణ శాసనసభ్యులు రీజనల్ కమిటీ మిగులు నిధుల గూర్చి ప్రశ్నించగా ప్రభుత్వం తెలంగాణ మిగులు నిధులు 10.7 కోట్లు అని 1961 ఆగష్టులో పేర్కొంది.
- 1961 వరకు ఉన్న మిగులు నిధులను ఈ ఐదారు సంవత్సరాలలో తెలంగాణ ప్రాంతంలో ఖర్చు చేయాలని ప్రాంతీయ సంఘం తీర్మానించింది.
టి.ఆర్.సి పథకాలు
- 1961-63 సంవత్సరాల మధ్య మిగులు నిధులతో వివిధ పథకాలను రూపొందించి అమలు చేశారు.
- ఈ పథకాలనే టి.ఆర్.సి. పథకాలు అంటారు.
పథకాలు
- పోచంపాడు ప్రాజెక్టు
- ఉస్మానియా విశ్వవిద్యాలయం
- పాఠశాల భవనాలు
- గ్రామీణ విద్యుదీకరణ
- రోడ్ల నిర్మాణం
ఉస్మానియా విశ్వవిద్యాలయం పథకం
- టి.ఆర్.సి పథకాలలో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి గ్రాంట్ మంజూరు చేసింది.
- ఈ పథకం కింద ఉస్మానియాకి 3 కోట్ల నిధులు మంజూరు చేస్తూ, ఆ నిధులు తెలంగాణ ప్రాంతంలో విద్యుద్దీకరణ వినియోగనిమిత్తం విద్యుత్ బోర్డు పరిధిలో 10 సంవత్సరాలు అభివృద్ధి బాండ్ల రూపంలో ఉంచాలని నిర్ణయించారు.
- ఆ బాండ్ల మీద వచ్చే వడ్డీతో ఉస్మానియా విశ్వవిద్యాలయం అభివృద్ధి పథకాలను చేపట్టాలని నిర్దేశించింది.
- ఈ పథకం వల్ల ఉస్మానియా విశ్వవిద్యాలయానికి లబ్ది చేకూరింది.
ఇతర పథకాలు
- హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో గల ప్రకృతి చికిత్సాలయానికి గ్రాంటును మంజూరు చేశారు.
- రాష్ట్ర రాజధానిపై అయ్యే వ్యయాన్ని 2:1 నిష్పత్తిలో పంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభిప్రాయ పడింది
- ఆంధ్రతో తెలంగాణ విలీనం కావడం వల్లనే హైదరాబాద్ నగరంలో అదనపు మౌలిక వసతులు అవసరమవుతున్నాయి కనుక ఈ మౌలిక వసతులకు అయ్యే వ్యయం తెలంగాణ ప్రాంతానికి సంబంధం లేదని టి.ఆర్.సి. వాదించింది.
తెలంగాణ ఉద్యమం-పెద్ద మనుషుల ఒప్పందం 1956 PDF
మరింత చదవండి |
|
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |