శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ అందించడం కొరకు గూగుల్ క్లౌడ్ స్పేస్ ఎక్స్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది .
స్టార్ లింక్ ఉపగ్రహం ద్వారా ఇంటర్నెట్ సేవను అందించడానికి గూగుల్ క్లౌడ్ మరియు స్పేస్ ఎక్స్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ కనెక్టివిటీ ప్రాజెక్ట్ కొరకు గూగుల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అందిస్తుంది, అయితే స్పేస్ ఎక్స్ స్టార్ లింక్ ఉపగ్రహాలను కనెక్ట్ చేయడం కొరకు గూగుల్ యొక్క క్లౌడ్ డేటా సెంటర్ ల్లో గ్రౌండ్ టెర్మినల్స్ని ఇన్స్టాల్ చేస్తుంది. గ్రామీణ ప్రాంతాలకు వేగవంతమైన ఇంటర్నెట్ సేవను అందించడంలో ఇది సహాయపడుతుంది. ఈ సర్వీస్ 2021 చివరి లోగా కస్టమర్లకు లభ్యం అవుతుంది.
మొదటి స్టార్ లింక్ టెర్మినల్ అమెరికాలోని ఓహియోలోని గూగుల్ డేటా సెంటర్ లో ఏర్పాటు చేయబడుతుంది. ఇంతకు ముందు, మైక్రోసాఫ్ట్ తన అజ్యూరే క్లౌడ్ ను స్టార్ లింక్ కు అనుసంధానించడానికి స్పేస్ ఎక్స్ తో ఇలాంటి ఒప్పందంపై సంతకం చేసింది. స్టార్ లింక్ అనేది ఒక ప్రాజెక్ట్, దీని కింద స్పేస్ ఎక్స్ అంతరిక్ష ఆధారిత ఇంటర్నెట్ను అందించడానికి 12,000 ఉపగ్రహాలను పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యంశాలు:
- స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు మరియు సిఇఒ: ఎలోన్ మస్క్.
- స్పేస్ ఎక్స్ స్థాపించబడింది: 2002.
- స్పేస్ ఎక్స్ హెడ్ క్వార్టర్స్: కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.
- గూగుల్ సీఈఓ: సుందర్ పిచాయ్.
- గూగుల్ స్థాపించబడింది: 4 సెప్టెంబర్ 1998, కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్.
- గూగుల్ ఫౌండర్స్: లారీ పేజ్, సెర్జీ బ్రిన్.
గమనిక:
ఆంధ్ర మరియు తెలంగాణా విద్యార్ధులకు శుభవార్త ఇప్పుడు మీ అన్ని పరీక్షలకు మీ స్థానిక భాష అయిన తెలుగులో సిద్ధం కావచ్చు. Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందవచ్చు.
ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
16 & 17 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి