పరీక్ష సిలబస్‌ను ఎలా సమర్థవంతంగా చదవాలి?
23 ఫిబ్రవరి 2025న APPSC గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను నిర్వహించనున్నారు. ప్రస్తుతం పరీక్షకు సుమారు 95 రోజుల సమయం మాత్రమే ఉంది. APPSC గ్రూప్-2 మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఈ సమయం చాలా కీలకమైనది మరియు విలువైనది. ఈ సమయాన్ని ప్రామాణికంగా ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు. ఇందులో ముఖ్యంగా పేపర్-1లో ఆంధ్రప్రదేశ్ చరిత్ర, భారత రాజ్యాంగ వ్యవస్థ అనే రెండు విభాగాలు ఉన్నాయి. ఈ రెండు విభాగాల సిలబస్‌ను చాప్టర్ల వారీగా చదివితే పరిమితమైన సిలబస్‌తో కూడిన విషయం అని గ్రహించవచ్చు. ప్రత్యేకంగా ఏపీ చరిత్రను చదవడం సులభం, ఎందుకంటే ఈ సబ్జెక్టు స్థిరంగా ఉంటుంది. పేపర్-2 (ఆర్థిక వ్యవస్థ, శాస్త్ర సాంకేతికత, పర్యావరణం) వంటి విభాగాల్లో సమగ్రమైన ప్రిపరేషన్ అవసరం
పేపర్-1: చరిత్ర మరియు పాలిటీపై పూర్తి పట్టు
ఆంధ్రప్రదేశ్ చరిత్ర విభాగంలో, విభజిత ఆంధ్రప్రదేశ్ భూభాగాలకు సంబంధించిన చారిత్రక అంశాలు మాత్రమే ప్రాముఖ్యత పొందవచ్చునని అభ్యర్థులు భావిస్తారు. కానీ కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం, బహమనీలు, శాతవాహనులు వంటి సాంప్రదాయ చరిత్ర భాగాలను ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ భూభాగంతో అనుసంధానం చేసుకుంటూ చదవడం ముఖ్యం. ఇది చరిత్రను సమగ్రంగా అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది.
Adda247 APP
ఆంధ్రప్రదేశ్ చరిత్ర: స్థిరమైన సబ్జెక్ట్
సిలబస్ పరిమితమైనది కనుక, చరిత్రపై పట్టు సాధించడం సులవు. చరిత్రలో ఎక్కువగా స్థిరమైన సమాచారం ఉంటుంది, అంటే ఇందులో ఏటా పెద్దగా మార్పులు ఉండవు. అందువల్ల దీనిపై సవరణ చేసుకోవడం తేలిక.
- ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ చరిత్ర:
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ భూభాగాల చరిత్రలో స్వతంత్ర రాజ్యాల సంస్థలు, వాటి ఉత్పత్తి, రాజ్య క్రమాలు వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. - కాకతీయులు, విజయనగర రాజులు, బహమనీలు వంటి చారిత్రక అంశాలను కూడా ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ భూభాగంతో అనుసంధానం చేసి అధ్యయనం చేయాలి.
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సరిహద్దు రాష్ట్ర సంబంధిత విషయాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి సరిహద్దు ప్రాంతాల చరిత్ర వంటి అంశాలను చదవడం ఉత్తమం.
- ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌తో ముడిపడిన రాజకీయ, సామాజిక, చారిత్రక, సాహిత్య అంశాలను అనుసంధానించుకుని చదవాలి.
ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో అత్యధిక మార్కులు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ముఖ్యమైన పాఠ్యాంశాలను రివిజన్ చేయాలి.
పునర్విభజన చట్టం 2014 ప్రాముఖ్యత
చాలా మంది అభ్యర్ధులకు గందరగోళంకి గురి చేస్తున్న ఒక ముఖ్యమైన ప్రశ్న“ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014ను చదవాలా లేదా?”:దీనికి సమాధానం , పునర్విభజన చట్టం పరిపాలనా అంశం కాబట్టి, విభజిత ఆంధ్రప్రదేశ్‌పై ఆ చట్టం చూపించిన ప్రభావం గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఈ చట్టం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకమైన రాజకీయ, ఆర్థిక ప్రభావాలు కలిగాయి.
-
- చట్టం రావడానికి ముందు జరిగిన చారిత్రక పరిణామాలపై అవగాహన అవసరం.
- మద్రాస్ ప్రెసిడెన్సీతో పాటు నిజాం పాలన చరిత్రకు సంబంధించిన అంశాలను తెలుసుకోవాలి.
పాలిటీ: విస్తృత అవగాహన అవసరం
భారత రాజ్యాంగ వ్యవస్థ పేపర్‌లో ప్రాధాన్యమైన అంశం. ఇది అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయించే కీలక భాగంగా ఉంటుంది. ఈ సబ్జెక్టులో సిలబస్‌కే పరిమితం కాకుండా అనుసంధానిత అంశాలను కూడా అధ్యయనం చేయాలి. కేంద్ర, రాష్ట్ర శాసన వ్యవస్థల సంబంధాలు, వివాదాలు, సంస్కరణలు వంటి అంశాలపై విస్తృత అవగాహన కలిగి ఉండడం అవసరం. న్యాయస్థానాల తీర్పులు, కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, మరియు కొత్త చట్టాలు ఇవన్నీ ప్రభావితం చేస్తాయి.
- సిలబస్‌పై పట్టు సాధించాలి: ప్రాథమిక అంశాలు అనుసంధాన విషయాలను కవర్ చేయాలి.
- ఉదాహరణ: కేంద్ర-రాష్ట్ర శాసన వ్యవస్థల నిర్మాణం.
- నవంబరు నుంచి జనవరి వరకు ప్రాథమిక అధ్యయనం
- పాలిటీ అనేది స్థిరంగా ఉండే సబ్జెక్టు కాదు. నిత్యం రాజ్యాంగం, న్యాయస్థానాల తీర్పులు, సంఘటనలు మారుతూనే ఉంటాయి. కాబట్టి జనవరి వరకు పాలిటీ సబ్జెక్టును కరెంట్ అఫైర్స్‌తో అనుసంధానించి చదవటం చాలా ముఖ్యం.
- సబ్జెక్ట్‌లో ముఖ్య అంశాలు
- భారత రాజ్యాంగ మూలాలు.
- భారతదేశ పాలనా వ్యవస్థలు.
- రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రి పాత్ర.
- కేంద్ర రాష్ట్ర సంబంధాలు.
- ఆర్టికల్స్, ప్రాథమిక హక్కులు & విధులు
పేపర్-2: ఆర్థిక వ్యవస్థ, శాస్త్ర సాంకేతికత, పర్యావరణం
పేపర్-2లో భారత ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంధన నిర్వహణ, పర్యావరణ అంశాలు ఉన్నాయి. ఈ విభాగంలో ప్రతి అంశం విస్తృత సమాచారం కలిగి ఉంటుంది, అందువల్ల విశ్లేషణాత్మకంగా అవగాహన పొందడం ముఖ్యం. ముఖ్యంగా భారత బడ్జెట్, ఆర్థిక సర్వే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన విధానాలు వంటి అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి.
1. భారత ఆర్థిక వ్యవస్థ
ఈ విభాగం విస్తృతమైన పాఠ్యాంశాలతో ఉంటుంది.
- 2024-25 బడ్జెట్, ఆర్థిక సర్వే నివేదికలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి.
- పేదరికం, నిరుద్యోగం వంటి సామాజిక అంశాలపై విశ్లేషణ అవసరం.
2. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ
- రాష్ట్ర బడ్జెట్ వివరాలతోపాటు 15కి పైగా ప్రకటించిన ప్రభుత్వ విధానాలపై అవగాహన అవసరం.
- విశ్లేషణ:
- వ్యవసాయం, పారిశ్రామిక రంగానికి సంబంధించిన అంశాలు చదవాలి.
- ఈ అంశాలు సిలబస్‌లో నేరుగా లేకపోయినా అనుసంధానం చేసుకోవాలి.
- ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్, సామాజిక ఆర్థిక దృక్పథం మరియు ఇతర ఆర్థిక సర్వే నివేదికలు చదవాలి
3. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంధన నిర్వహణ, పర్యావరణం
సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో అనేక పాఠ్యాంశాలు ఉన్నాయి, అయితే ప్రతి విభాగానికి సమ ప్రాధాన్యత ఉండటంతో ఈ విభాగంలో ఎక్కువ సమయం కేటాయించకూడదు. ఇంధన నిర్వహణలో, పునర్వినియోగ ఇంధనాలపై ఎక్కువ ప్రశ్నలు రావొచ్చు. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం నిర్వహించిన సదస్సులు, వాటి నిర్వహణ, నిర్ణయాలు కరెంట్ అఫైర్స్‌తో అనుసంధానం చేసుకుని చదవడం అవసరం.
సైన్స్ అండ్ టెక్నాలజీ
- సాంకేతికత విభాగం కింద అనేక అంశాలు ఉంటాయి.
- తాజా పరిణామాలను ప్రత్యేకంగా తెలుసుకోవాలి.
- ఈ భాగానికి సమయం కేటాయించేటప్పుడు, ఇతర విభాగాలను నిర్లక్ష్యం చేయకూడదు.
- ఇటీవల భారతదేశం చేసిన అంతరిక్ష పరిశోధనలు, వ్యాదుల కోసం తయారు చేసిన టీకాలు మొదలయిన అంశాలు చదవాలి.
ఇంధన నిర్వహణ
ఇంధన నిర్వహణకు సంబంధించి తాజా భారత సర్వే బడ్జెట్లలో విస్తృత సమాచారం విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వం సమీకృత ఇంధన విధానాన్ని విడుదల చేసింది. దానిలో ఇంధన నిర్వహణకు సంబంధించిన అనేక భావనలు ఉపయోగ పడతాయి. ముఖ్యంగా పునర్ వినియోగ ఇంధనాలపై ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ వెబ్‌సైట్లలో ఇంధన గణాంకాలు జనవరి నెలాఖరు వరకూ అప్‌డేట్ చేసుకుంటూ చదివితే మంచిది.
పర్యావరణం
- పర్యావరణ సంబంధిత విషయాలను గ్రాడ్యుయేషన్ స్థాయి పుస్తకాల నుండి చదవాలి.
- పర్యావరణ పరిరక్షణ సదస్సులు: తాజా సదస్సుల వివరాలను కరెంట్ అఫైర్స్‌తో అనుసంధానం చేయాలి.
- పర్యావరణ పరిరక్షణ కోసం ఇటీవలికాలంలో CoP 29 సదస్సులు జరిగాయి. వాటి నిర్వహణ, నిర్ణయాలు అడిగే అవకాశం చాలా ఎక్కువ.
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు Youtube Official Channel | ఇక్కడ క్లిక్ చేయండి |