ప్రియమైన అభ్యర్థులారా,
మీ అందరికీ ADDA247 తెలుగు తరపున భోగి పండుగ శుభాకాంక్షలు! భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన పండుగలలో భోగి పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది ఆనందం, సంతోషం, కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునే పండుగ మాత్రమే కాకుండా, పాతది వదిలి కొత్తదాన్ని ఆహ్వానించే రోజుగా కూడా భావించబడుతుంది. ఈ సందర్భంగా మీ జీవితాల్లో మంచి మార్పులు చేర్పించి, మీ లక్ష్యాలు సాధించడానికి ముందుకు సాగాలని కోరుకుంటున్నాం.
భోగి పండుగ విశిష్టత
భోగి లేదా భోగి పండుగ అనేది ఆంధ్రులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటిరోజు భోగి పండుగగా జరుపుకుంటారు. భోగి పండుగ అంటే పాతవాటిని వదిలిపెట్టి కొత్త ఆశలను అలింగనం చేసుకునే వేడుక.ప్రతి ఏడాది జనవరి 13 లేదా 14 తేదీల్లో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజు ప్రజలు భోగి మంటలు వేస్తారు, పాత పనికిరాని వస్తువులను మంటల్లో వేసి, తమ జీవితంలో పాత అలవాట్లను, ప్రతిబంధకాలను వదిలిపెట్టి, మంచి మార్గంలో ముందుకు సాగాలని సంకల్పిస్తారు. ఈ కాలంలో దక్షిణాయనంలో సూర్యుడు దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరమవ్వడం వల్ల భూమిపై తీవ్ర చలి వాతావరణం ఏర్పడుతుంది.
Adda247 APP
భోగి మంటల విశిష్టత
భోగి రోజున చలికాలంలో అత్యంత చలి ఉంటుంది. ఈ రోజున అందరూ మంటలు వేసి చలికాచుకుంటారు. ఈ మంటలను “భోగి మంటలు” అని పిలుస్తారు. భోగి మంటల కోసం ఎక్కువగా తాటి ఆకులను ఉపయోగిస్తారు. భోగి పండుగకు కొన్ని రోజుల ముందు నుంచే ఈ తాటి ఆకులను సేకరించి సిద్ధం చేసుకుంటారు. కొన్నిచోట్ల ప్రత్యేకంగా భోగి మంటల కోసం తాటాకు మోపులు ఇంటి వద్దకే తెచ్చి విక్రయిస్తారు. ఈ మంటలలో పాత పనికిరాని వస్తువులను మండిస్తారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో ప్రతి ఇంటి ముందూ భోగి మంటలు వేయడం జరుగుతుంది.
భోగి పళ్ళ ప్రాముఖ్యత
భోగి పండుగ రోజు చిన్నపిల్లలపై భోగి పళ్ళను పోసి ఆశీర్వదిస్తారు. వీటిని “భోగి పళ్ళు” అని పిలుస్తారు. భోగి పళ్ళ ఆశీర్వాదాన్ని శ్రీమన్నారాయణుడి ఆశీస్సులుగా భావిస్తారు. ఈ సంప్రదాయానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది.
అభ్యర్థుల ప్రయాణంలో భోగి ప్రాముఖ్యత
భోగి పండుగ, అభ్యర్థుల జీవితంలో కూడా ఒక కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టే సమయంగా మారుతుంది. పాత పరాజయాలను, జడత్వాన్ని వదిలి, కొత్త ఉత్సాహంతో, కఠోర శ్రమతో విజయాన్ని సాధించేందుకు ఇది ఉత్తేజం అందించే రోజు. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే పండుగ.
మేము మీతో ఉన్నాం:
ADDA247 తెలుగు ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుంది. మీ ఉద్యోగ కలల్ని సాకారం చేయడం కోసం విద్యా ప్రయాణంలో మీకు అవసరమైన అన్ని విద్యాసంపత్తులు మరియు మెంటార్ సపోర్ట్ అందించడానికి కృషి చేస్తోంది.
సంకల్పం – విజయం వైపు అడుగులు
ఈ భోగి పండుగ సందర్భంగా మీ లక్ష్యాలపై మరింత స్పష్టమైన దృష్టి పెట్టండి:
- పాత అలసత్వాన్ని విడిచిపెట్టండి
- కొత్త పోరాట స్ఫూర్తిని దత్తత చేసుకోండి
- కొత్త స్టడీ ప్లాన్‌తో ముందుకు సాగండి
- అనవసరమైన ఆలోచనలను వదిలించుకోండి
విజయం వైపుగా చేసే ప్రతి చిన్న ప్రయత్నం గొప్ప ఫలితాలను అందిస్తుంది.
ఈ భోగి పండుగలో మీకోసం మంచి అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. పదవి సాధించడానికి మీ ఆత్మవిశ్వాసం, పట్టుదల, కృషి అత్యవసరం. ఈ భోగి మీ శ్రమకు విజయానికి నాంది కావాలి.
మరోసారి మీ అందరికీ 🔥భోగి పండుగ శుభాకాంక్షలు!🔥
🔥Happy Bhogi!🔥
Stay Positive, Work Hard, and Make It Happen!👍🏼
అన్ని పోటీ పరీక్షలకు ఉద్యోగ సమాచారం మరియు సిలబస్‌ని పొందడానికి ADDA247 తెలుగు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి,ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 Telugu YouTube Channel